S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సాంస్కృతిక వారసత్వం

ఆరుగాలం కష్టించి పని చేస్తూ పంటలు పండించే అన్నదాతలు, వ్యవసాయ కూలీలు ఏడాదికోమారు ఎడ్ల పందేలు నిర్వహిస్తూ సంబరాలు జరుపుకోవడం రాయలసీమ జిల్లాల్లో శతాబ్దాల నుంచి ఆనవాయితీగా మారింది. ఆటవిడుపుగా ఎడ్లబండ్ల పందాలు, రాతి దూలం లాగుడు పోటీలు నిర్వహిస్తారు. అనంతపురం జిల్లాలో శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి నుంచి బ్రిటిష్ వారి హయాం వరకు, నాటి నుంచి నేటి వరకూ ఈ సంబరాలు జరుగుతూనే ఉన్నాయి. ఇందుకు పక్కా చారిత్రక ఆధారాలు లేకపోయినా, పలు రచనల్లో ఎద్దుల పందేల ప్రస్తావన ఉన్నట్లు తెలుస్తోంది. ఎద్దుల్ని ఏడాదంతా బలవర్ధక ఆహారం, పుష్టికరమైన దాణా, గ్రాసం వంటి వాటితో ఎంతో అపురూపంగా పోషిస్తూ పోటీలకు సిద్ధం చేయడం రివాజు. ఎద్దుల పోటీలు ప్రధానంగా మూడు పద్ధతుల్లో నిర్వహిస్తారు. ఇందులో రాతి దూలం లాగుడు పోటీలు ప్రధానమైనవి. ఇది కాకుండా చెక్క ఎడ్ల బండి చక్రాలను కదలకుండా బిగుతుగా మోకులతో (బలమైన తాళ్లు) కట్టివేసి బండిని ఎద్దులతో లాగించడం. మూడోది బండి చక్రాలను కట్టకుండానే వేగంగా పరుగులు తీయించడం కూడా కద్దు. ముఖ్యంగా ఈ మూడు పోటీల్లోనూ అధికంగా రాతి దూలం లాగుడు పోటీలు ఉత్సాహంగా సాగుతాయి. వేల నుంచి లక్షల రూపాయలు పందాలు కాస్తారు. రాతి దూలం లాగుడు పోటీలు అనంతపురం జిల్లాలోని గుంతకల్లు, ఉరవకొండ, రాయదుర్గం, కణేకల్లు, బెళుగుప్ప, తాడిపత్రి, ధర్మవరం, పుట్టపర్తి, గుత్తి, నార్పల తదితర ప్రాంతాల్లో ఏటా జరుగుతుంటాయి. వీటిలో తాడిపత్రి, నార్పల, గుంతకల్లు, ఉరవకొండ ప్రాంతాల్లో క్రమం తప్పకుండా భారీ స్థాయిలో అధికంగా పోటీలు నిర్వహించడం ఆనవాయితీ. తాడిపత్రి, గుంతకల్లు తదితర ప్రాంతాల్లో రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతాయి. ఈ పోటీలకు కర్ణాటక నుంచి కూడా అధికంగా కాడెద్దులు తరలి వస్తుంటాయి.
జాతర్లు, ఇతర పర్వదినాల్లో పోటీలు అధికం
జిల్లాలో ముఖ్యంగా జూన్ నెలలో తొలి ఏకాదశికి ఎడ్ల బండ్ల పందేలు, రాతి దూలం లాగుడు పోటీలు నిర్వహించడం సంప్రదాయం. అలాగే గంగమ్మ, ఎల్లమ్మ, పోలేరమ్మ, అమాసమ్మ జాతర్లలో రాతి దూలం లాగుడు పోటీలు నిర్వహిస్తారు. కాగా కరవు పరిస్థితుల దృష్ట్యా ఆర్థిక ఇబ్బందులతో పాటు గ్రాసం కొరత కారణంగా ఎద్దుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. ఫలితంగా చాలా గ్రామాల్లో వ్యయప్రయాసలకోర్చి ఎద్దుల బండ్ల పోటీలు, రాతి దూలం లాగుడు పోటీలను నిర్వహించడం కష్టంగా మారింది. దీంతో గ్రామ పెద్దలు, ఎమ్మెల్యేల స్థాయిలో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. గెలుపొందిన మూడు జతల ఎడ్లకు భారీగా నజరానాలు చెల్లిస్తారు. ఒక్కో సందర్భంలో రూ.లక్షకు మించి బహుమతులు ఉంటాయి.
రూ.కోట్లకు చేరిన కోడి పందాలు
పల్నాటికి పౌరుషంగా చెప్పుకునే కోడి పందాలు గోదావరి జిల్లాల్లో సంప్రదాయంగా మారింది. ఇవి రానురాను జూదంలా మారిపోయాయ. ఈ పందాలను వీక్షించేందుకు ఎన్‌ఆర్‌ఐలు కూడా వస్తున్నారంటే వీటి ప్రాధాన్యత ఏ స్థాయలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సంక్రాంతికి ముందు రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులందూ ఏకతాటిపైకి వచ్చి ఒప్పించుకునే స్థాయకి చేరింది. కేవలం రూ.100తో ప్రారంభమై నేడు జూదంలా మారి కోట్లకు పడగలెత్తింది. 1980 ప్రాంతంలో గోదావరి జిల్లాల్లో చేపల చెరువుల నుంచి ఆశించిన స్థాయికంటే ఎక్కువగా లాభాలు రావడంతో రైతులంతా కోడి పందాల వైపు దృష్టిసారించారు. ఆ తర్వాత 1995 ప్రాంతంలో విదేశాలకు రొయ్యలు ఎగుమతి అవుతుండటంతో ఆక్వా రైతాంగానికి డాలర్ల వర్షం కురవడం ప్రారంభమైంది. దీంతో సంక్రాంతికి ఒక్కరోజు మాత్రమే జరిగే ఈ సాంప్రదాయ కోడి పందాలు మూడురోజులు నిర్వహించడం ప్రారంభించారు. గ్రామాలకే పరిమితమైన ఈ జూద క్రీడ పట్టణాలకు పాకింది. 2000 సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నుంచి ప్రారంభమైంది. ప్రతి ఏడాది సంక్రాంతికి సాంప్రదాయ కోడి పందాల మొత్తం సుమారు రూ.700 కోట్లు వరకు ఉంటుందని, వీటిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని గత ఏడాది పలువురు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించడం విశేషం.
ఎడ్లపందాలకు అనుమతి ఇవ్వాలి
ప్రకాశం జిల్లాలోని పలుచోట్ల సంస్కృతి, సంప్రదాయాలతో బండ లాగుడు ఎడ్ల పందాలను నిర్వాహకులు నిర్వహిస్తున్నారు. ఈ పందాలకు ప్రభుత్వ అనుమతి లేకపోయినప్పటికీ ఎడ్ల అందాల పోటీల పేరుతో ఈ బండ లాగుడు పోటీలకు లక్షలాది రూపాయలను వెచ్చిస్తుంటారు. జల్లికట్టు, కంబళ పోటీల మాదిరిగానే రాష్ట్రంలో ఎడ్లపందాలకు అనుమతి ఇవ్వాలనే డిమాండ్ మొదలైంది. ప్రధానంగా సంక్రాంతి, తిరునాళ్ళ సందర్భంగా ఈ పోటీలను నిర్వహిస్తూ పోటీలను ప్రొత్సహిస్తున్నారు. బండలాగుడు పోటీల్లో పాల్గొనే ఎద్దులు జత సుమారు 20 లక్షల రూపాయల వరకు ఖరీదు చేస్తుంది. ప్రస్తుతం కొంతమంది మాత్రమే పోటీలకోసం ప్రత్యేకంగా ఎడ్లను పెంచుతున్నారు.
ప్రతిష్ఠ కోసమే...
బొబ్బిలి, పల్నాడు వంశాల్లో అనేకమంది పందాలతో రాజ్యాలే కోల్పోయారు. పౌరుషానికి ప్రతీక అయిన నాగమ్మ కావచ్చు, అలాగే కుల మతాలకు అతీతంగా పంక్తి కూడుకు శ్రీకారం చుట్టిన బ్రహ్మనాయుడు కావచ్చు. ఈ పందాలతోనే సర్వం కోల్పోయారు. కృష్ణాజిల్లాలో పశుపోషణ నానాటీకీ క్షీణిస్తున్నది. పేరు ప్రతిష్ఠల కోసం కేవలం 20, 30 మంది రైతులు మాత్రమే ఒంగోలు జాతి ఎడ్లను పోషిస్తున్నారు. ఒక్కో జత ఎద్దులకు రోజుకు కనీసం వెయ్యి రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో ఎక్కడ ఎడ్ల పందాలు జరిగినా తమ ఎడ్లను తీసుకువెళ్లటం వీరికి సాంప్రదాయంగా వస్తున్నది. బహుమతి మొత్తం తక్కువే అయినా తమ ప్రతిష్ఠ కోసం వీటిని పోషిస్తున్నారు. కొన్నిచోట్ల ఎడ్ల అందాల పోటీలు కూడా జరుగుతున్నాయి. కృష్ణాజిల్లాలో ప్రస్తుతం 70 నుంచి 100 జతల ఎద్దులు మాత్రం ఉన్నట్టు తెలుస్తోంది.
క్రీడా పోటీల మాదిరిగానే...
చట్టపరంగా నిషేధం ఉన్నా.. జీవకారుణ్యసంఘాలు ఘోషిస్తున్నా గుంటూరు జిల్లాలో ఎడ్ల పందాలు ఏటా ఆనవాయితీగా సాగుతున్నాయి.. క్రీడా పోటీల మాదిరిగా సబ్ జూనియర్లు, జూనియర్లు, సీనియర్ల కేటగిరీలను నిర్దేశించి సామర్థ్యాన్ని బట్టి మోత బరువు లాగుడు పోటీలు నిర్వహిస్తున్నారు. చిలకలూరిపేటలో రెండు నెలల క్రితం జాతీయ స్థాయి పోటీలు నిర్వహించారంటే ఏ రకంగా పందేలు జరుగుతున్నాయనేది అవగతమవుతుంది. నిర్వహణ, ఎడ్లను మేపేందుకు లక్షల్లో ఖర్చు వెచ్చించినప్పటికీ మొదటి బహుమతిగా దక్కేది కేవలం రూ. 50వేల రూపాయలలోపే. అయితే ఇందులో రాజకీయాలు చోటుచేసుకోవడంతో ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. ఒక జత ఎడ్లను చిన్న నాటి నుంచి పోటీలకు సిద్ధం చేయాలంటే పదిలక్షల మేర ఖర్చవుతుంది. రోజుకు రెండువేలు వెచ్చించాల్సి వస్తోందని రైతులు చెప్తున్నారు. ఒక్కో ఎద్దు జీవితకాలం పదేళ్లు కాగా పోషణలో అపురూపంగా చూసుకున్న యజమానులు పోటీలలో మాత్రం రక్తం ఓడేలా హింసించటం పోటీలలో కానరాని దారుణం.
**
- కె.పురుషోత్తమకుమార్, పి.శ్రీనివాసరావు, పి.వి.్భస్కర్‌రెడ్డి, నిమ్మరాజు చలపతిరావు, టి.స్వామి అయ్యప్ప

- కె.పురుషోత్తమకుమార్, పి.శ్రీనివాసరావు, పి.వి.్భస్కర్‌రెడ్డి, నిమ్మరాజు చలపతిరావు, టి.స్వామి అయ్యప్ప