S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవీ .. ఇవీ..

12/02/2017 - 19:20

ఫొటోగ్రఫీ ఓ కళ. అద్భుతమైన దృశ్యాలను చూడటం, దానిని లెన్స్‌లో బంధించడం సాదాసీదా వ్యవహారం ఏమీకాదు. పైగా ఎదురుగా కనిపించే దృశ్యాలను కెమెరాతో క్లిక్‌మనిపించడంలో కిక్ ఏముంటుంది. ఆకాశంలో దాదాపు 7500 అడుగుల ఎత్తున హెలికాప్టర్‌లో ప్రయాణిస్తూ భూమిపై కనిపించే అద్భుతమైన దృశ్యాలను కెమెరాలో అంత చక్కగానూ బంధించడానికి ఎంత ధైర్యం ఉండాలి. సాహసంతోపాటు డబ్బూ ఉండాలి.

11/25/2017 - 18:22

ఎడారిలో వాతావరణం ఎప్పటికప్పుడు ఎలా మారిపోతుందో ఊహించడం కష్టం. పల్చటితెరలా ఉన్న ఇసుక గుట్టలుగా మారిపోవడం క్షణాల్లో జరిగిపోతుంది. అక్కడి వాతావరణం గురించి బాగా తెలిసిన వారు తప్ప మనగలగడం కష్టం. ఇదిగో అలా ఇసుక తినె్నల మాటున చాటున ఒంటెల సహాయం నడచివెళుతున్న కొందరిని చూడండి. ఒమన్‌లోని బెడోమిన్ ప్రాంతానికి చెందిన బిడియా పౌరులు వారు.

11/25/2017 - 18:20

ఇంగ్లండ్‌లో ఏటా నవంబర్‌లో జరిగే స్థానిక వేడుకల్లో భాగంగా పెద్దఎత్తున బొమ్మల బెలూన్‌లు ఎగరవేస్తూంటారు. ఇటీవల జరిగిన ఓ వేడుకలో ఈ బొమ్మ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది.

11/25/2017 - 18:19

ఇంగ్లండ్‌లో ఇటీవ ప్రపంచ మంచుశిల్పాల పోటీ జరిగింది. ఓ కళాకారుడు తన శిల్ప చాతుర్యాన్ని ఇలా మలిచాడు. బాగుంది కదూ!

11/25/2017 - 18:18

ఆవు..అమ్మ ప్రేమకు చిహ్నాలు. అలాంటి అవుల్ని అమ్మలా సాకుతోంది ఈ అతివ. జర్మనీలోని బెర్లిన్ నుంచి 1978లో కేవలం పర్యాటకురాలిగా భారత్‌లో అడుగుపెట్టిన ఆమె ఆవులంటే ప్రేమ పెంచుకుంది. మధురలోని రాధాకుండ్‌కు వచ్చిన తరువాత ఆధ్యాత్మిక గురువుకోసం వెతికింది. ఈలోగా అక్కడి పేదలు ఓ ఆవును పెంచుకోవాలని కోరారు. వెంటనే ఒప్పుకున్న ఆమె ఇక ఆ ప్రాంతాన్ని వదలిపోలేదు. ఇప్పటికీ ఆమె అక్కడే ఉంది.

11/18/2017 - 19:22

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నేషనల్ జియోగ్రాఫికల్ సంస్థ ఎప్పటిలా వరల్డ్ నేచర్ ఫొటోగ్రఫీ పోటీలు నిర్వహిస్తోంది. ప్రపంచం నలుమూలల నుంచి నిపుణులైన ఫొటోగ్రాఫర్లు తీసిన అరుదైన, అందమైన ఛాయాచిత్రాలను ఎంట్రీలుగా పంపిస్తున్నారు. ఈ పోటీలో గ్రాండ్ విన్నర్‌కు 7500 అమెరికల్ డాలర్ల మొత్తాన్ని బహుమతి ఇస్తారు. ఛానల్‌లో ఆయా ఛాయాచిత్రాల ప్రదర్శనతోపాటు ఆ సంస్థకు చెందిన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేస్తారు.

11/18/2017 - 19:19

నీళ్లలో వేసిన ఓ క్యూబ్‌ను పట్టుకునేందుకు ఎంతో శ్రద్ధతో ప్రయత్నిస్తున్న ఈ శునకం ఓ సంకరజాతికి చెందినది. బ్రిటన్‌లో ఈ మధ్య ప్రపంచ శునకాల పోటీ నిర్వహించారు.
అందులో పాల్గొన్న ఈ శునకం విజయం కోసం ఇలా ప్రయత్నిస్తోంది. లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆ వస్తువును ఎలా తీక్షణంగా చూస్తోందో చూడండి.

11/11/2017 - 18:09

బ్రిటిష్ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ పోటీల్లో ఎంపికైన చిత్రం ఇది. మంచుగా మారుతున్న సముద్ర జలాల్లో బతుకు జీవుడా అంటూ ఈదుతూ వచ్చేస్తున్న ఓ సముద్ర పక్షి యాతనకు ఇది సజీవ సాక్ష్యం. మనం చూడటానికి ఈ దృశ్యం బాగుంది. కానీ ఆ పక్షి పడుతున్న ఇబ్బంది అంతాఇంతాకాదు. యార్క్‌షైర్‌లో ఈ దృశ్యం కనిపించింది.

11/11/2017 - 18:07

జీవజాతుల్లో అతి చిన్నవి ఉంటాయి. వాటిని ఎంత దగ్గర నుంచి చూసినా మనం గమనించలేని అంశాలు చాలానే ఉంటాయి. వాటిని మైక్రోస్కోపులో చూస్తే వాటి విశ్వరూపం కనిపిస్తుంది. ఇలా మైక్రో ఫొటోగ్రఫీతో అతి చిన్నజీవుల నిగూఢ రూపాన్ని ఆవిష్కరించారు చాలామంది. నికాన్ సంస్థ నిర్వహించే వార్షిక మైక్రో ఫోటోగ్రఫీ పోటీల్లో బహుమతులు గెలుచుకున్న కొన్ని చిత్రాలు ఇవి.

11/11/2017 - 18:06

థాయ్‌లాండ్‌లో ఈ కనువిందైన దృశ్యం గోచరించింది. తాయ్ జో పట్టణంలో ఈ పెంగ్ వేడుకల సందర్భంగా ఈ దీపాల లాంతర్లను ఒకేసారి పెద్దసంఖ్యలో విడిచిపెట్టారు. వాటి వెలుగుల్లో వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ లాంతర్లను వెదురు, గడ్డిపోచలతో తయారు చేయడం ప్రత్యేకత.

Pages