S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవీ .. ఇవీ..

06/11/2016 - 20:48

ఈ 65 అడుగుల చెట్టును హఠాత్తుగా చూస్తే అచ్చం మనిషిలా ఉందికదూ. చాలామంది పర్యాటకులు దీనిని చూసి అవాక్కవుతున్నారు. రెండు చేతులు, తల, మొండెం, రెండు కాళ్లు ఉన్నట్లు ఈ భారీ వృక్షం మనిషిని పోలినట్లు ఉండటంతో పెద్దసంఖ్యలో జనం వస్తున్నారు. కానీ దానిని చూసి ఆశ్చర్యపోవడమే కాదు ఒకింత భయపడుతున్నారటకూడా. బల్గేరియాలోని బాల్కన్ పర్వతశ్రేణుల్లో ఈ వృక్షం ఇప్పుడు పెద్ద ఆకర్షణగా మారిపోయింది.

06/11/2016 - 20:44

రాజస్థాన్‌లోని పుష్కర ప్రాంతంలో ఈమధ్య స్థానిక సంప్రదాయ పద్ధతుల్లో ఉత్సవాలు నిర్వహించారు. అక్కడ ఒకదాని పక్కన ఒకటి వ్యతిరేక దిశలో నిల్చున్న రెండు ఒంటెలు దూరంనుంచి ఇలా కనిపించి కనువిందు చేశాయి. చూడటానికి రెండుతలల ఒంటెలా ఉన్నా అక్కడ ఉన్నవి రెండు ఒంటెలే.

06/11/2016 - 20:38

ఏనుగు ఎలా ఉంటుందో మనకు తెలుసు. కానీ చూపులేనివారికి ఎలా తెలుస్తుంది. అందుకే ఇదిగో ఇలా నేలమీద జారబడిన ఓ ఏనుగును తాకి తెలుసుకుంటున్నారు వారంతా. ఇది థాయ్‌లాండ్‌లోని ఓ జూలో నిర్వహిస్తున్న క్లాస్. ఇక్కడున్న రెండు ఏనుగులు ఇలా నేలమీద పడుకుంటాయ్. అంధులు, వికలాంగులు వచ్చి వాటిని తాగి, వాటి శరీరభాగాల గురించి తెలుసుకుంటారు. దీనికోసం ఆ రెండు ఏనుగులకు ప్రత్యేక తర్ఫీదు ఇచ్చారు.

06/04/2016 - 21:24

అందంగా కన్పిస్తున్న ఈ మలుపుల రహదారిపై ప్రయాణించాలని మనసు ఎంత తపన పడినా గుండెధైర్యం ఉండాలి. సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తున ఉన్న ఈ గోర్జి మొరాకోలో ఉంది. అల్లాస్, బెల్ పర్వతశ్రేణుల మధ్య ఉన్న లోతైన లోయలోని మలుపుల రహదారి ఇప్పుడు పర్యాటకులకు పెద్ద ఆకర్షణ. నేషనల్ జియోగ్రాఫికల్ ఛానల్ నిర్వహించిన ట్రావెలర్ ఫొటోగ్రఫీ పోటీకోసం పంజియాలోమ్ నెట్టి అనే ఫొటోగ్రాఫర్ ఈ చిత్రాన్ని తీసి పంపాడు.

05/28/2016 - 23:24

ఇక్కడ కన్పిస్తున్నది ఓ కళాఖండం. శిల్పకళానైపుణ్యానికి ఇది ఓ మచ్చుతునక. షోయిలాసోఖన్వరి అనే కళాకారుడు ఈ శిల్పాన్ని రూపొందించాడు. లండన్‌లోని సాచిగ్యాలరీలో నిర్వహించిన ‘షాంపేన్ లైఫ్’ ప్రదర్శనలో దీనిని చూసిన ప్రేక్షకులు కన్నార్పకుండా చూస్తున్నారు.

05/23/2016 - 03:23

ఏ జిమ్నాస్టైనా ఇలా గెంతగలరా? కెన్యాలోని మసైమాలా అభయారణ్యంలో ఈ దృశ్యం కన్పించింది. వేగంగా పరుగుపెడుతున్న ఓ ఎద్దుకు జీబ్రా అడ్డొచ్చేసరికి ఇలా ఎగిరింది. ఈ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించాడు..పౌలా హెమ్మక్.

05/23/2016 - 03:21

కుస్తీ మన ప్రాచీన యుద్ధవిద్య. పాకిస్తాన్‌లో ఇది జాతీయక్రీడ. అక్కడ కుస్తీకి మంచి ఆదరణ ఉంది. అందుకు ఉదాహరణ ఈ చిత్రం. తన కుమారుడికి కుస్తీలో తర్ఫీదు ఇస్తున్న ఈ వ్యక్తి లాహోర్‌వాసి. అక్కడ దాదాపు ప్రతి కూడలిలో ఇలాంటి కుస్తీ నేర్పే యుద్ధశాలలు ఉంటాయి. వీళ్లని చూస్తే బరిలోకి దిగాలన్పిస్తోందికదూ.

05/23/2016 - 03:20

లండన్‌లో ఓ అరుదైన రెస్టారెంట్ తెరవబోతున్నారు. కృత్రిమ వెలుగుజిలుగులకు దూరంగా అంతా సహజవాతావరణంలో ఈ రెస్టారెంట్‌లో ఎవరైనా ఆహారాన్ని తినొచ్చు...తాగొచ్చు. అయితే ఇక్కడ ఓ ఆఫర్ ప్రకటించారు. అదీ ఇష్టమైనవారికే. ఈ రెస్టారెంట్‌కు వచ్చేవారు ఓ తరహా గౌన్‌ను ధరించాల్సి ఉంటుంది. వారు ఏ రకం దుస్తుల్లో ఉన్నా అక్కడకు వచ్చాక మార్చుకోవల్సిందే. ఆ గౌన్లూ వద్దనుకునేవారు తమ దుస్తులను విడిచి నగ్నంగా ఆహారాన్ని తినొచ్చు.

05/23/2016 - 03:18

ఈ చిత్రంలో కన్పిస్తున్న ‘హమడ్రాస్ బబూన్’ అనాథ. తల్లికి దూరమైన ఈ బబూన్‌ను జంతుపరిరక్షణ సంస్థలు చేరదీశాయి. మైసూరులోని శ్రీ చామరాజ జూలాజికల్ పార్కులో దీనిని సంరక్షిస్తున్నారు. ఓ బబూన్ బొమ్మతో అది ఇలా ఆడుకుంటూ సందర్శకులను అలరిస్తోంది.

05/14/2016 - 21:46

సియోల్‌లోని జోగ్యే బౌద్ధారామంలో ఇప్పుడు ముద్దులొలికే చిన్నారులు గుండుతో దర్శనమిస్తున్నారు. ఏటా అక్కడ నిర్వహించే ‘బౌద్ధ భిక్షువుల్లా చిన్నారులు’ వేడుక నిర్వహిస్తారు. మే 11న ప్రారంభమైన ఈ ఉత్సవం 25వ తేదీ వరకు నిర్వహిస్తారు. బౌద్ధంపై ఆసక్తి ఉన్నవారి పిల్లలను ఈ ఆలయానికి తీసుకువచ్చి వారికి గుండు చేయించి, మెడలో తులసిమాలలు వేసి బౌద్ధమతం గురించి బోధనలు చేస్తారు.

Pages