S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవీ .. ఇవీ..

07/31/2017 - 22:26

సైనికులంటే యుద్ధమే చేయాలా? అదేం లేదనడానికి ఇక్కడ కనిపిస్తున్న దృశ్యమే సాక్ష్యం. దేశభక్తిని, రక్షణ బాధ్యతను గుర్తించి పౌరుల్లో జాతీయభావం ఉప్పొంగేలా ఇలా ‘మిలటరీ బ్యాండ్’ కార్యక్రమం నిర్వహించారు. స్విట్జర్లాండ్‌లోని రిక్రుటెన్స్‌పిల్ అనే నగరంలో ఈ ప్రదర్శన నిర్వహించారు. భావరాగయుక్తంగా సాగిన ఈ కచేరీలో వాడిన వాద్యపరికరాలకు ఎల్‌ఇడి సాంకేతికత జోడవడంతో అందమూ తోడైంది.

07/29/2017 - 22:29

దక్షిణ కొరియాలో బరిష్టా అన్నది ఓ అద్భుతమైన కాఫీలాంటి డ్రింక్ అన్నమాట. దానికి కాస్తంత కళను దట్టించాడు ఓ కళాకారుడు. మీగడకు కొన్ని రకాల రంగులు అద్ది అందమైన దృశ్యాన్ని ఆ కప్పులోని ద్రావకంపై సృష్టించడమే అతడి లక్ష్యం. క్రీమ్‌ఆర్ట్, ఫ్లవర్ ఆర్ట్ సమ్మిళితంగా లీ కాంగ్ బిన్ ఈ కళను సృష్టించాడు. సియోల్‌లోని ఓ కాఫీషాప్ నిర్వహిస్తున్న అతడు కస్టమర్లను ఆకర్షించేందుకు ఈ ప్రయోగం చేశాడు.

07/29/2017 - 22:27

కుందేళ్లకు, పిల్లులకు హోటళ్లు ఉన్నట్లే ఎలుకలకూ ఈ మధ్య ఓ హోటల్ తెరిచారు. కాకపోతే వాటికి ఉన్నంత ఇదిగా ఇక్కడ ఏర్పాట్లు ఉండవు. కేవలం జూలైలో ఓ రెండు రోజులు మాత్రమే ఆ హోటల్‌లో అవి సందడి చేశాయి. సుమారు 50 డాలర్ల మొత్తం చెల్లించి వచ్చిన వినియోగదారులకు టిఫిన్, స్నాక్స్, సాఫ్ట్ డ్రింక్ అందిస్తారు.

07/17/2017 - 03:43

అమెరికా పిట్స్‌బర్గ్‌లోని జూలో అలరిస్తున్న గున్నఏనుగు ఇది. గజరాజుల కుటుంబం అంతా నివసించే పిఎంజి అక్వేరియంలో హొయలుపోతున్న ఈ గున్నఏనుగు వయసు కేవలం నాలుగు నెలలే. తొలిసారిగా అది జూకు వచ్చే బాల సందర్శకుల కోసం అద్దాల గదిలోకి వచ్చింది. దానిని చిన్నారులు కళ్లింత చేసుకుని చూసి ఆనందించారు.

07/17/2017 - 03:42

ఈ రహదారి ఎన్ని మలుపుతిరిగిందో చూడండి. రొమేనియాలోని తన్సల్వేనియాకు వెళ్లే చే డిఎన్ 1ఎ మార్గం ఇది. కలిన్ స్టాన్ అనే ఫొటోగ్రాఫర్ తన ద్రోన్‌తో తీసిన చిత్రం ఇది. ద్రోన్‌లతో తీసే ఫొటోల వేదికగా ఉన్న ద్రోన్‌స్టాగ్రామ్ నిర్వహించిన పోటీల్లో దీనికి నేచర్ విభాగంలో రెండో బహుమతి లభించింది.

07/17/2017 - 03:40

విభిన్న, వినూతన అలంకరణతో కనిపిస్తున్నది మోడల్ కాదు. ప్రఖ్యాత జాజ్ సంగీత కళాకారిణి గ్రేస్ జోన్స్. స్విట్జర్లాండ్‌లో మాంట్రియస్ జాజ్ సంగీతోత్సవం సందర్భంగా ప్రదర్శన ఇచ్చేందుకు వచ్చిన గ్రేస్‌జోన్స్ ఇలా తనదైన వస్తధ్రారణతో ప్రేక్షకులను, శ్రోతలను అలరించాడు.

07/17/2017 - 03:38

రష్యాలోని టైట్రిస్ నదీతీరంలో నిర్వహించిన ఇవాన్ కుపాలా పండుగ సందర్భంగా సంప్రదాయ రీతిలో ఆటపాటలు నిర్వహించారు. అందులో భాగంగా నిప్పుల కొలిమిలో మంటలు రేగుతుండగా ఓ వ్యక్తి ఇలా వాటిలోంచి దూకాడు. ఇలాంటి సంప్రదాయ విన్యాసాలు ఇక్కడ మామూలే.

07/13/2017 - 21:41

ఓ పెద్దతుపాకీ, మల్లయుద్ధానికి సిద్ధమన్నట్లు గ్లౌజ్‌లతో సిద్ధంగా ఉన్నట్లు సంకేతం...బాగుందికదూ ఈ సన్నివేశం. కానీ అక్కడున్నది తుపాకీకాదు. అవి గ్లౌస్‌లు ధరించిన చేతులూ కావు. రెడ్‌పామ్ జాతికి చెందిన బీటిల్ యాంటెన్నా ఇది. అతి సూక్ష్మభాగాలను దగ్గరగూ చూసినపుడు ఇలా ఉంటాయన్నమాట. ఈ దృశ్యాన్ని ప్రఖ్యాత మేక్రో ఫొటోగ్రాఫర్ జేవియర్ రూప్‌రెజ్ తన కెమెరాలో బంధించాడు.

07/13/2017 - 21:39

గొంతెండిపోతున్నప్పుడు ఐస్‌క్రీమ్ ఇచ్చారనుకోండి. గబగబా తినేస్తాం కదా. ఐస్‌ఫ్రూట్ ఇచ్చారనుకోండి...ఇష్టంగా లాగించేస్తాంకదా! అలాగే ఇక్కడ ఓ నీటిఏనుగుకు ‘ఐస్‌బాంబ్’గా పిలిచే ఓ ఐస్‌ఫ్రూట్‌ను ఇచ్చారు. అంతే అది ఐస్‌ను నాకుతూ అందులో ఉన్న పళ్లు, కూరగాయలకోసం తహతహలాడింది. ఎండలు ముదిరిపోవడంతో జర్మనీలోని కర్ల్‌స్రూలో ఓ నీటిఏనుగుకు ఇలా ‘ఐస్‌బాంబ్’ ఇచ్చారన్నమాట.

07/13/2017 - 21:37

ఈ చిత్రాన్ని జాగ్రత్తగా గమనించండి. కొన్ని వందల బుల్లి ఫ్లెమింగో పక్షుల సమూహం కనిపిస్తుంది. వాటికి దారిచూపుతూ పైన ఎగురుతున్న ఓ పెద్ద ఫ్లెమింగో పక్షిని చూడండి. ఈ అద్భుత దృశ్యం టర్కీలోని టుజ్ సరస్సు తీరంలో కనిపించింది. అక్సారే ప్రాంతంలో ఈ సరస్సు ఉంది. ఏటా కొన్ని వేల ఫ్లెమింగోలు ఇక్కడకు వచ్చి సంతతిని అభివృద్ధి చేసుకుంటాయి.

Pages