S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవీ .. ఇవీ..

07/13/2017 - 21:36

అంతరించిపోయిందని భావిస్తున్న అందచందాల మేల్ పర్పుల్ ఎంపరర్ సీతాకోకచిలుకలు మళ్లీ కనిపించాయి. ఇందులో అంత ఆశ్చర్యపోవలసిందేముందీ అంటే..అందులో విషయం ఉంది మరి. దాదాపు 120 సంవత్సరాల తరువాత ఈ అందమైన సీతాకోకచిలుక దర్శనమిచ్చినట్లు ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత నేషనల్ ట్రస్ట్ ఆఫ్ మేల్ పర్పుల్ ఎంపరర్ బటర్‌ఫ్లై సంస్థ ప్రకటించింది. నీలివర్ణంతో మెరిసిపోయే ఈ సీతాకోక చిలుకలు ఒకప్పుడు విస్తృతంగానే ఉండేవి.

07/08/2017 - 22:01

ఓ ఐదురోజుల పాటు దాదాపు లక్షన్నర మంది ఒకేచోట నివసించి తమకు నచ్చిన రీతిలో, సంప్రదాయంలో ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపే వేడుక గ్లాస్టన్‌బ్యురో ఫెస్టివల్. ఇంగ్లండ్‌లోని పిల్టన్‌లో ఏటా దీనిని నిర్వహిస్తారు. 1970 నుంచి ఇది ఓ సంప్రదాయంగా మారిపోయింది. మొదట హిప్పీలు, అలాంటి తరహా జీవనవిధానంలో ఉన్నవారు ఇలా ఒకచోటికి చేరి వేడుక చేసుకునేవారు. రానురాను ఇది విస్తృత ప్రజాదరణ పొంది జనసామాన్యానికి చేరువైంది.

07/08/2017 - 21:59

ఇంగ్లండ్‌లోని మోర్‌కేంబే తీరం గాలిపటాల పోటీలకు పెట్టింది పేరు. ఏటా జూన్‌లో ఈ పోటీలు నిర్వహిస్తారు. అయితే ప్రస్తుతం పోటీల సమయం వచ్చినా గాలి అనుకూలంగా లేకపోవడంతో ఔత్సాహికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా అందమైన, విభిన్నమైన రూపాలతో గాలిపటాలను రూపొందించి, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన కైటర్స్ ఇక్కడ వాటిని ఎగురవేయడం పరిపాటి.

07/08/2017 - 21:58

కందిరీగలు తమ గూళ్లను ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటాయో తేల్చి చెప్పే ఫొటో ఇది. చెట్ల బెరడను నమిలి, రసాన్ని ఉమ్మి ఓ కాగితపు పొరలా చేసి అవి గూళ్లను నిర్మించుకుంటాయి. వాన చినుకులు లేదా మంచు కురిసి ఆ గూళ్లు తడిస్తే.. ఆ తేమను, లేదా నీటిని ఇలా బుడగల్లా చేసి బయట పడేస్తాయి. ఆ లక్షణం వాటి ప్రత్యేకత. అదిగో ఓ కందిరీగ అలా తన గూడునుంచి నీటిని బుడగలా మార్చి పడేస్తున్న దృశ్యాన్ని క్లిక్‌మనిపించాడు ఓ ఫొటోగ్రాఫర్.

06/25/2017 - 21:11

రోడ్డును చూసి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. అది ‘ఎల్’ బోర్డుతో నడుస్తున్న వాహనమే కావొచ్చు. రాంగ్ రూట్లో వస్తున్న వాహనం కూడా కావొచ్చు. ఇవి రెండు కాకుండా చౌరస్తాలలో కన్పించే పచ్చలైటు కూడా కావొచ్చు.

06/25/2017 - 21:09

అమెరికా ఆర్థిక రాజధాని మాన్‌హట్టన్ (న్యూయార్క్)లోని భారీ కాంస్య విగ్రహం వాల్‌స్ట్రీట్ బుల్ ఎదురుగా ధైర్యంగా, ఠీవిగా నిలుచుని తీక్షణంగా చూస్తున్నట్లు కనిపిస్తున్న ఈ ‘్ఫయర్‌లెస్ గర్ల్’ కూడా ఓ కాంస్య విగ్రహమే. లాటిన్ బాలిక పోలికలతో 50 అంగుళాల పొడవు, 110 కేజీల బరువు ఉండే ఈ విగ్రహాన్ని ఈ ఏడాది మార్చిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆవిష్కరించారు.

06/25/2017 - 21:06

అవతార్ సినిమా చూసినవారికి గుర్తుండే ఉంటుంది.. అందులోని పాత్రధారుల రూపురేఖావిలాసాలు. వింత కనుబొమ్మల కళ్లు, పొడవైన నాసిక, చెవులు, లేత, ముదురు నీలిరంగు శరీరం, తలపై కొద్దిమేర మాత్రమే కనిపించే కేశాలు.. ఇలా విచిత్రరూపంలో కనిపించే అవతార్ పాత్రలను అచ్చం అలానే ఉండేట్లు రూపొందించిన పిల్లల బొమ్మలు ఇప్పుడు మార్కెట్‌లోకి వచ్చాయి.

06/25/2017 - 21:04

థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో కుందేళ్ల హోటల్ ఒకటుంది. అక్కడకు వచ్చే వినియోగదారులు లేదా సందర్శకులు కుందేళ్లతో సరదాగా గడపవచ్చు. తాము తినే పదార్థాలను వాటికీ పెట్టొచ్చు. తాము తాగే ద్రవపదార్థాలను వాటికీ పట్టొచ్చు. వాటితో ఆడుకోవచ్చు. ప్రపంచంలో వింతైన హోటళ్లు, రిసార్టులలో ‘రేబిట్ పార్క్’ ఒకటన్నమాట.

06/25/2017 - 21:03

ఓ వ్యక్తి చుట్టుపక్కల ఏం జరుగుతోందో చూసుకోకుండా ఎంచక్కా కొలనులో ఈత కొట్టేస్తూంటే పైనుంచి ఏదో గ్రహం వచ్చి మీదపడిపోతున్నట్లుంది కదూ ఈ దృశ్యం. కానీ ఇందులో కొంత నిజం ఉంది..మరి కొంత కల్పన ఉంది. పశ్చిమ ఫ్రాన్స్‌లోని ఓ ఈతకొలనులో వ్యక్తి ఈతకొట్టడం వరకు అంతా నిజమే. కానీ మిగతాదంతా కల్పన. బ్రిటిష్ కళాకారుడు ల్యూక్ జెర్రమ్ రూపొందించిన మూన్ మ్యూజియం ఆర్ట్‌కు సంబంధించి ఓ కళాఖండం ఇది.

06/22/2017 - 23:29

తేళ్లంటే కొందరికి భయం... మరికొందరికి అసహ్యం. కానీ ఈ వృశ్ఛిక నారికి అవంటే ఇష్టం. అత్యంత విషపూరితమైన తేళ్లను ఇలా ముఖంపైన, నోటిలోను వాటికి కావలసినంత సేపు తిరగనిచ్చి గిన్నిస్ రికార్డు కొట్టేసిన ఘనత ఈమెది. థాయ్‌లాండ్‌లోని పట్టాయా నగరంలోని ప్రఖ్యాత రిప్లే బిలీవ్ ఇట్ ఆర్ నాట్ సంస్థ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న కంచన కేట్‌కవ్ ఇప్పటికే రెండు గిన్నిస్ రికార్డులు సొంతం చేసుకుంది.

Pages