S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథ

06/04/2017 - 02:06

‘మీరెప్పుడూ ఇంతే అమ్మా, ఏదడిగినా కాదూ, లేదు అంటారు.. మా ఫ్రెండ్స్‌లో ఎవరికీ ఇంత దరిద్రం లేదు. నాకే ఇదంతా... ఛీఛీ ఏం బ్రతుకిది.. ఇలా బ్రతికేకంటే చావడం మేలు!’ అంటూ చేతిలో కాఫీ గ్లాస్‌ని గోడకేసి కొట్టాడు శరత్‌చంద్ర కోపంగా.

05/14/2017 - 18:59

‘అమ్మా!’ కోటి వీణియలు మీటినట్లు, మరెన్నో కోయిలలు కూసినట్లుందా పిలుపు. ఆమె మనసు పరవశించింది. తల తిప్పి చూసిందామె.
ఎదురుగా ప్రగతి. చేతిలో ఓ పాకెట్.
‘ఏంట్రా కన్నా?’ కన్నుల నిండా ప్రేమ, మదినిండా ఆప్యాయత నింపుకుని అడిగింది భవాని కూతుర్ని.
‘ఈ రోజు నర్సింగ్‌హోం యానివర్సరీ అమ్మా! ప్రారంభించి సంవత్సరం అయిపోయింది కదూ? ఆ శున సందర్భంగా నీకో చీర తెచ్చానమ్మా. ప్లీజ్ కాదనకు!’

04/29/2017 - 23:40

చీకటి వ్యాపిస్తుంటే, దాన్ని జయిస్తూ నగరంలో విద్యుద్దీపాలు వెలగసాగాయి. మనిషి ప్రకృతిలో తనకు ఆటంకంగా ఉన్న వాటిని జయిస్తూ, తనలోని అవగుణాలను అధిగమించలేక పోవడం మానవత్వానికి సవాలుగా మిగిలిపోయింది ఆది నుంచీ! కాబట్టే, మానవ విజ్ఞానానికి ఇంకా పరిపక్వత రాలేదనిపిస్తుంటుంది. ఆడి కారు వీధి దీపాల కాంతిని మరింత ప్రకాశవంతం చేస్తూ దూసుకుపోతోంది చరిత్రని పునరావృతం చేయడానికన్నట్లు.

04/22/2017 - 22:40

శిశిర ఋతువు. ఉదయపు సూర్యుడు ‘రావాలా! వద్దా?’ అని తటపటాయిస్తున్నాడు కాబోలు; ఆకాశాన తూర్పు ఎర్రనైంది కాని సూర్యుడి జాడ లేదు.

04/17/2017 - 02:05

విశాఖ - భువనేశ్వర్ పాసింజర్ ఆరు గంటలు ఆలస్యంగా కప్పను తిన్న పాములా... మెల్లగా.. కీచుమనే శబ్దాలు చేస్తూ జాడుపూడి రైల్వేస్టేషన్‌లో ఆగింది.
దిగి.. ప్లాట్‌ఫాం మీదకు వచ్చాను.. ఆకాశం మేఘావృతమై ఉంది. గడియకో.. నిమిషానికో వర్షం కురిసేలా ఉంది. వాచీ చూసుకున్నాను. ఒంటి గంట దాటింది.
రాత్రి.. దట్టమైన చీకటి.. స్టేషన్‌లో - స్టేషన్ మాస్టారి క్యాబిన్ దగ్గర తప్ప ఎక్కడా వెలుతురు లేదు.

04/08/2017 - 23:42

నాజన్మ నక్షత్రం విశాఖ. నక్షత్రాధిపతి గురువు. మీన లగ్నం. లగ్నాధిపతి కూడా గురువే. ప్రత్యక్ష దైవం ఆ సూర్యనారాయణుడి జన్మనక్షత్రం కూడా విశాఖే. మంగళవారం పుట్టేను. కుజుడి అధిష్టాన దేవత దేవ సేనాధిపతి కుమారస్వామి.
అధివృక్షం నాగకేసరం. వ్యాఘ్రయోని. అధిదేవతలు ఇంద్రాగ్నులు.

04/01/2017 - 23:06

మీరు మాకు చేసిన సేవలు చాలు. ఇక మీరు విశ్రాంతి తీసుకుని మమ్మల్ని కృతార్థులని చెయ్యండి’ అంటూ నాగేశ్వర్ మెళ్లో ఓ దండ వేసి, చేతిలో ఓ గిఫ్ట్ ప్యాకెట్ ఇచ్చి సాదరంగా సాగనంపారు ఆఫీసు వాళ్లు.

03/30/2017 - 03:15

ఉగాది పర్వదినం సందర్భంగా... జిల్లా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో జిల్లా ముఖ్య పట్టణంలోని కళాక్షేత్రంలో కార్యక్రమాలు ఏర్పాటయ్యాయి. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పానకాలరావు ముఖ్య అతిథి.

03/27/2017 - 20:55

మంగళీభవ!’’ ఆశీర్వదిస్తున్న అమ్మమ్మ వైపు ఆశ్చర్యంగా చూసింది ఆమని. క్రొత్తగా పెళ్లయి మేనమామ యింటికివచ్చిన ఆమనికి అమ్మమ్మ ఆశీర్వాదం కూడా క్రొత్తగానే తోచింది. తమింటి వెనుకనే వున్న గుడిసెలో, ఎడమకాలితో తాగుబోతు భర్తని తంతూనే కుడిచేత్తో తన పుస్తెల తాడుని కళ్ళకద్దుకునే దృశ్యం చూస్తూ కూడా ఇలాగే ఆశ్చర్యపోయేది.

03/27/2017 - 20:54

విద్యాధర్ మెలకువ వచ్చినా యింకా పక్కమీద దొర్లుతూ శరీరాయాసం తీర్చుకుంటున్నాడు. మనస్సు రకరకాల ఆలోచనలతో కొట్టుమిట్టులాడుతూ ఉంది. శరీరానికి మనస్సుకు సంయమనం తీసుకు రాగలగడం చేతకావడంలేదు.

Pages