S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాతో - మీరు

08/07/2017 - 00:00

ఆరువందల ఏళ్లుగా తమ సంస్కృతీ సంప్రదాయాల్ని కాపాడుకుంటూ వస్తున్న అహ్మదాబాద్ నగరాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తించడం, ఆ గుర్తింపు పొందిన ఏకైక నగరం ఇదే కావడం భారతీయులందరికీ గర్వకారణం. కవర్‌స్టోరీ ‘వారసత్వ విజయం’లో అహ్మదాబాద్ విశేషాలు చక్కగా అందించారు. బహుమతి కథ ‘నేలతల్లి’ బాగుంది. పారిశ్రామిక వాడలవల్ల ఎన్ని సమస్యలొస్తాయో బాగా వివరించారు.

07/30/2017 - 23:22

మన దేశంలో స్వాతంత్య్ర ఉద్యమం రాజుకోక ముందే బ్రిటీష్ వారిపై తిరుగుబాటు చేసిన ఆంధ్రుడెవరు అని అడిగితే మొదట జ్ఞాపకం వచ్చే పేరు అల్లూరి సీతారామరాజు. అయితే సినిమా తీయనుండటంతో తెలిసిన రెండో పేరు కొదమసింహం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ‘కవర్‌స్టోరీ’ ద్వారా ఆయన కథ తెలుసుకొని ఆనందించాం. మొదటి బహుమతి కథ విలువ ఉన్నదే. నేటి పరిస్థితులకు దర్పణం పట్టింది.

07/22/2017 - 22:34

‘సామాన్యుని సవారి’ కథనం ఎంతో బాగుంది. సైకిల్ తొక్కడం వ్యాయామం మాత్రమే కాదు సైకిల్ సామాన్యుని జీవితకాల సహచరి. కోనసీమలో సైకిల్‌కి ఐదారు అరటి గెలలు కట్టి సైకిల్ తొక్కడం చూసి తీరాల్సిందే. పల్లెటూరి సంతల్లో సైకిల్ ఒక మొబైల్ షాప్! సైకిల్‌కి నాలుగైదు ట్రేలు కట్టి వాటిలో అద్దాలు, దువ్వెనలు, నెయిల్ పాలిష్, రిబ్బన్లు, ప్లాస్టిక్ బొమ్మలు లాంటివి పెట్టి అమ్మేవాళ్లు కనిపిస్తారు.

07/16/2017 - 04:37

ఆశలు, ఆకాంక్షలు అన్నీ హద్దుల్లేని ప్రాంతం వైపే సాగిపోవాలని ఈ తరం తహతహలాడుతోంది. రాకెట్లు, విమానాలు, కార్లు, అధునాతన ప్రయాణ సాధనాలు సౌకర్యాన్నిస్తూనే ఉన్నాయి. అయినా.. ఎంత పెద్ద వారైనా ఓ సైకిల్ కనిపిస్తే చిన్నపిల్లల్లా మారిపోతారు. అదే సైకిల్‌లోని మహత్తు. ‘కవర్‌స్టోరీ’ సామాన్యుని సవారి చదువుతూంటే మళ్లీ కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తున్నట్టనిపించింది.

07/09/2017 - 00:11

కలల బేహారులు

07/04/2017 - 04:07

తలపుల పందిరి కింద మాటల గడబిడ గురించి చక్కగా వివరించారు ‘లోకాభిరామమ్’ గోపాలంగారు. ప్రాంతాల పేరుతో వాడుకలో ఉన్న అనేక వంటకాలు, కాయలు, పళ్లు నిజానికి ఆ ప్రాంతంలో దొరక్కపోవచ్చు. మైదాతో బూరెల్లాగ తయారుచేసే మైసూర్ బోండా అసలు మైసూర్‌లో దొరకదు. అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా తిరుమల స్వామి సన్నిధిలో రోజంతా ఉండేందుకు ఒక్కరోజు గవర్నర్ పదవి కావాలనడం తమాషాగా ఉంది.

06/25/2017 - 00:09

‘సండే గీత’ రిటర్న్ గిఫ్ట్ పరంగా చెప్పిన విషయాలు అలరించాయి. నిజమే. తమ వద్ద పండేది ఇతరులకు పంచాలి! కోతిలోంచి మనిషి పుట్టాడంటారు. కాని మనిషి ఊబకాయం కోతికి సంక్రమించడం, ఆ ఊబకాయాన్ని తగ్గించడానికి దాన్ని పరిగెత్తించడం భలే తమాషాగా అనిపించింది. అక్షరాలోచనల్లో ‘తంపటి’ కవిత ఆలోచింపజేసింది. సర్దుకుపోవడం సరైన పద్ధతి కాదు. తప్పును సమర్థించడమే అనడం సరికాదేమో.

06/17/2017 - 23:59

మానవుడు తన వివేకం, ఆశావహ దృక్పథంతో మనసును భయాందోళనల నుండి సంతోషం వైపు మరల్చి జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలన్న ‘సండేగీత’ స్ఫూర్తిదాయకంగా ఉంది. నాలుగు నిమిషాలపాటు గుండె ఆగిపోయి, తాత్కాలిక మరణం సంభవించాక, కాంపియన్ జీవితంలో జరిగిన అద్భుతాలని గురించి ‘నమ్మండి ఇది నిజం’లో చదివి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాం.
-ఎం.కనకదుర్గ (తెనాలి)
18వ ఆవు

06/10/2017 - 23:05

పాస్‌వర్డ్
‘సండే గీత’లో -పాస్‌వర్డ్.. అతని జీవితాన్ని ఎలా మార్చివేసిందో హృద్యంగా చెప్పారు. చాలా బాగుంది. లాబ్రడార్ శునకం తన పిల్లలతోబాటు పంది పిల్లలకు కూడా పాలిచ్చి పెంచడం ఆశ్చర్యమే. అయితే దానికి మానవ సహజ ప్రేమ లాంటి భావనలు జోడించనక్కరలేదు. కాకి తనే సాకిన కోకిల పిల్లల్ని తరిమేసినట్టు పంది పిల్లలు పెరిగాక శునకం కూడా వాటిని తరిమేయవచ్చు. అక్షరాలోచనల్లో ‘ఒక్కో వాక్యం’ కవిత చాలా బాగుంది.

06/04/2017 - 01:29

ఆకాశవాణితో అనుబంధం ఉన్న సంగీత గాయక శిఖామణులలో శ్రీరంగం గోపాలరత్నం గారు ఒక విదుషీమణి అని చెప్పవచ్చు. ఈమె కొన్ని సినిమా పాటలను మధురంగా ఆలపించినా, ఈ రంగంలో ఎక్కువగా ఆసక్తిని కనబరచలేదు. తన గాన రవళులతో జీవించినంత కాలం సామవేదానికి సేవ చేస్తూనే ఉన్నారు. ఏభై నాలుగేళ్ల మధ్య వయసులోనే దేహం చాలించడం ఆమె అభిమానుల దురదృష్టం. ఇళ్లల్లో రేడియోలున్న రోజులలో ఈమె గానాన్ని, స్వరాలను విని ఆనందించని వారుండరు.

Pages