S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాతో - మీరు

12/10/2016 - 22:45

మల్లాది సూరిబాబుగారు ‘అమృతవర్షిణి’ శీర్షికలో సంప్రదాయ సంగీత వారధుల వివరణలో ఎంతో వాస్తవం ఉంది. మహా సంగీత స్రష్ఠలు రూపొందించిన శాస్ర్తియ సంగీతాన్ని, లలిత సంగీతంలా మార్చి, తేలికగా రూపొందిస్తున్న విధానాలు, సంప్రదాయ సంగీతాన్ని కించపరిచేలా అన్నమయ్య పాటలు బాధాకరంగా ఉన్నాయి.

12/04/2016 - 03:48

విపత్కర పరిస్థితుల్లో ఒక గదిలో బంధించబడి నిస్సహాయంగా రోజుల తరబడి ఉండిపోయిన మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుందో క్రైం కథలో చక్కగా వివరించారు. క్రైం కథల ప్రత్యేకత అదే. వస్తు వైవిధ్యం! వెటకారం చేసేవారికి కనిపించకపోవచ్చు గానీ రైల్వేస్‌లో కాస్తంత మార్పు కనిపిస్తోంది. ప్లాట్‌ఫామ్స్ వెనకటికన్నా శుభ్రంగా ఉన్నాయి. రైళ్ల సరాసరి ఆలస్యం 2 గంటలు తగ్గింది.

12/03/2016 - 21:22

‘సూపర్‌మూన్ వస్తోంది’ కవర్‌స్టోరీ కథనంలో పలు ఆసక్తిదాయక విశేషాలు తెలుసుకొన్నాం. మూన్ విశిష్టత కూడా తెలిసింది. ఎడిటర్‌తో ముఖాముఖి ‘మనలో మనం’ ద్వారా పలు అంశాలపై ఎడిటర్‌గారు ఇస్తున్న సమాధానాలు బాగుంటున్నాయి. అమృతవర్షిణి అమృతంలా ఉంటోంది. సిసింద్రీ ఆకట్టుకుంటోంది. వారంవారం సరికొత్త అంశాలతో మమ్మల్ని అలరిస్తోన్న భూమికి ధన్యవాదాలు.
-నీలిమ సబ్బిశెట్టి (రాజానగరం)
సూపర్

11/19/2016 - 21:53

‘ఆధ్యాత్మిక శక్తి.. మానవతామూర్తి’ చినజీయర్ స్వామి వారి గురించి చెప్పిన విషయాలు ఉత్తేజం కలిగించాయి. కొద్దికాలం క్రితం వారి దర్శన భాగ్యం కలిగింది. వ్యాసం చదువుతుంటే ఆనాటి విషయాలు గుర్తుకొచ్చి తనువు పులకించింది. స్వామీజీ మా పక్కనే ఉన్న అనుభూతి కలిగింది. ఉన్నాడా ఈ మనిషి అంటూ గోపాలంగారు ముల్లా నస్రుద్దీన్ గురించి చెప్పిన విషయాలు ఆసక్తి కలిగించాయి.

11/12/2016 - 20:07

చిన్న జీయర్ స్వామివారి ‘తిరునక్షత్ర మహోత్సవం’ గురించిన ఆసక్తికర అంశాల నెన్నింటినో తెలుసుకోగలిగాం. నవ యువకుడిలా కనిపించే చిన్న జీయర్‌కు అప్పుడే అరవై ఏళ్లు నిండాయా అని భక్తులు ఆశ్చర్యపోవటంలో అతిశయోక్తి లేదు. ఆ ముఖ వర్ఛస్సు అటువంటిది. మానవత్వానికి ప్రతీకగా చెప్పుకొనే పెద్ద జీయర్ స్వామి అడుగుజాడల్లో చిన్నజీయర్ పయనిస్తూ, సమాజానికి స్ఫూర్తిని కలుగజేస్తున్నారు.

11/05/2016 - 23:06

దీపావళి సందర్భంగా చినజీయర్ స్వామి వారి గురించిన ఆసక్తికరమైన ఎన్నో అంశాలను అందజేసినందుకు ధన్యవాదాలు. స్వామి జన్మస్థలం మా తూర్పుగోదావరిలో అర్తమూరు. నిజంగా మా జిల్లా వాసులు ధన్యులు. దీపావళి నేపథ్యంలో అందించిన స్టోరీ ఆకట్టుకొంది. సిసింద్రీ ఒక్క దీపావళికే ఉంటుంది. కానీ మా సిసింద్రీ వారం వారం ముచ్చట్లతో సందడి చేస్తుంది.
-ఎన్.ఎస్. (ఆర్.నగర్, తూ.గో.జిల్లా)
కొత్తొక వింత

10/29/2016 - 22:50

భర్తలను భార్యలు ప్రేమించినంతగా భర్తలు భార్యల్ని ప్రేమించడం లేదన్నది ‘ఓ చిన్న మాట’లో తేటతెల్లం చేశారు. భర్తల గుండెల్లో ఆ చిన్న మాట గట్టి దెబ్బే! ‘మనలో మనం’లో మీ సమాధానాలు ముఖ్యంగా ‘మేము చింతించడం లేదు’ ‘ఏలిన వారికి కావలసింది పబ్లిసిటీ’ ‘పెళ్లికాని వారంతా బ్రహ్మచారులు కారు’ లాంటివి అలరించాయి. ‘ఆకాశవాణి’లో మన కవుల బాణీ ఆహ్లాదకరంగా ఉంది. ఆ పాటలన్నీ ఓసారి మనసులో మెదిలాయి.

10/22/2016 - 23:13

ఈ వారం ఆదివారం అనుబంధంలో అన్నీ అంశాలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా ‘సండే గీత’లో కాలం విలువ గురించి చక్కగా వివరించారు. ప్రపంచంలో ఎవరికైనా ఉండేది 24 గంటలే. సక్రమంగా ఉపయోగించుకుంటే కాలం మనల్ని ఆకాశంలో నిలబెడుతుంది. దుర్వినియోగం చేస్తే అధఃపాతాళానికి తొక్కివేస్తుంది. ‘ఆకాశవాణిలో మన కవుల బాణి’ వ్యాసంలో దేవులపల్లి కృష్ణశాస్ర్తీ, దాశరథి వారు రాసిన గీతాల గురించి చక్కగా వివరించారు.

10/15/2016 - 22:05

ప్రతీ సంవత్సరం బ్రహ్మోత్సవాలు తిరుపతి దేవదేవునికి నిర్వహిస్తున్నా ఎప్పుడూ పాత అనే భావన రాదు కదా! నిత్య నూతనంగా ఒక వివాహ వేడుక జరుగుతున్నంత ఆనందంగా ఉంటుంది. ఆదివారం అనుబంధంలో కలియుగ వాసుని ఇంపైన బ్రహ్మోత్సవ వేడుకల్ని చక్కటి చిత్రాలతో అందించినందుకు ధన్యవాదాలు. భక్తులు వెండి, బంగారు వాకిళ్లలో ఇరుక్కుని, తోసుకుంటూ, తన్నుకుంటూ వృద్ధులకు, స్ర్తిలకు, పిల్లలకు అనేక ఇబ్బందులు కలుగజేస్తున్నారు.

10/08/2016 - 23:00

శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ‘తిరువీధుల మెరసీ దేవదేవుడు’ శీర్షికన అందించిన కవర్‌స్టోరీ కథనం భక్తి ప్రధానంగా సాగి మా ఇంటిల్లిపాదినీ అలరించింది. ఆ దేవదేవుని దర్శించి తరించిన పుణ్యఫలం దక్కింది. ఫొటోలు అత్యద్భుతంగా ఉన్నాయి. చిరునవ్వు వెల ఎంత? కథ చాలా బాగుంది. కనుమరుగవుతున్న జీవజాతుల గురించి అందించిన ప్రత్యేక కథనం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం.

Pages