S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనలో - మనం

09/18/2016 - 06:57

దుర్గరాజు ఇందిర, విజయవాడ
పవన్ కల్యాణ్ రాజకీయ తాజా గర్జనల మీద మీ కామెంట్?
ఏకపాత్రాభినయం అదిరింది.

కాకినాడ ఆత్మగౌరవ సభ అంత సూపర్‌హిట్ అవడానికి కారణమేమిటి?
జనంలో అతడిపట్ల ఉన్న క్రేజు. (నిజానికి అది తెలుగుదేశం ఆత్మరక్షణ సభ.)

అన్న ‘ప్రజారాజ్యం’లా కాకుండా తమ్ముడి ‘జనసేన’ గ్రాండ్ సక్సెస్ అవుతుందా?
తమ్ముడు అన్నకు మంచి పేరు తెస్తాడు.

09/11/2016 - 01:04

యు.శేషగిరిరావు, ధవళేశ్వరం
దండుగమారి కాశ్మీర్‌లో వేర్పాటువాదులతో మళ్లీ చర్చలు జరుపుతారట. ఈ తరహా ‘చవట ఛాంపియన్’ ప్రక్రియను చూసిచూసి వెగటు పుట్టటం లేదా? నిజంగా దమ్ము లేదా? ముస్లిం ఓట్లు పోతాయనా?
దమ్ములేకే.

09/03/2016 - 21:28

వేదుల జనార్దనరావు, వంకావారిగూడెం, ప.గో.జిల్లా
గోవధ చేసే వాళ్లని హెచ్చరించవలసిన ప్రధాని నరేంద్ర మోదీ, గోరక్షకులను హెచ్చరించడం వెనుక ఆంతర్యమేమిటి?
రాజకీయ అవసరం.

08/27/2016 - 22:47

యశ్వంతరావు శేషగిరిరావు, ధవళేశ్వరం
నేను లోగడ లాల్‌ఖిలా (్ఢల్లీ), షాజహాన్ కోట (ఆగ్రా), దౌలతాబాద్ కోట (ఔరంగాబాద్), గోల్కొండ (కుతుబ్‌షాహీ, హైదరాబాద్) వగైరా చూశాను. ఎందులోనూ ‘టాయిలెట్స్’ కానీ ‘ఎటాచ్డ్ బాత్’లు కానీ కనపడలేదు. స్థానిక గైడ్స్ రొటీన్ చరిత్ర తప్ప ఈ పాయింట్ వివరించలేదు. మీరు చెప్పగలరా? చక్రవర్తులు, షాహెన్‌షాలు కాలకృత్యాలకు ఎక్కడికి వెళ్లేవారు?

08/14/2016 - 09:16

అనదాసు సత్యనారాయణ, పెద్దాపురం
కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుగారు ఆత్మీయ అభినందన సభలో పార్టీ ఫిరాయింపుదారులు గురించి మాట్లాడుతూ పదవికి రాజీనామా చేసి వెళ్లాలని అన్నారు. ఈ సలహా ఎంతవరకు పాటిస్తారు?
ఈ రోజుల్లో అంతటి నీతిమంతులు అరుదు. పదవినిబట్టే మనిషికి గిరాకీ.

08/06/2016 - 22:11

వై.వి.శివకాంత, అచ్యుతాపురం, శ్రీకాకుళం జిల్లా
ఒక నాయకుడు కాని నాయకురాలు కాని ఏ పదవీ రాలేదని మరొక పార్టీలోకి గెంతడం నీతిమాలిన రాజకీయాలకు పరాకాష్ట! చేసిన అవినీతి పని చేసి ఊరుకోకుండా... వదిలివేసిన పార్టీని నోటికి వచ్చినట్లు తిట్టటాన్ని ఏమనాలి?
కుసంస్కారం - భ్రష్ట రాజకీయం.

07/30/2016 - 22:05

ఉప్పు సత్యనారాయణ, తెనాలి
ఇటీవల రాష్ట్రంలో పట్టపగలు ప్రజలను దోచుకోవటం, బస్సులు, రైళ్లల్లో దోపిడీలు ఎక్కువ ప్రజల ఆస్తులు, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. రక్షణ కోసం ప్రజలు ఆ భగవంతుని వేడుకొందామంటే, దేవాలయాల్లో సైతం ఆ భగవంతునికే రక్షణ లేకుండా విగ్రహాలు, నగలు దోచుకుంటుంటే, ఆ భగవంతుడు తన మొర ఎవరికి చెప్పాలి?

07/24/2016 - 01:52

బి.వి.ఎస్.ప్రసాద్, bvcartoons@gmail.com
ఫేపర్లో ఒకరు నవ్యాంధ్ర అంటారు. స్వర్ణ ఆంధ్ర అని ఒకరు రాస్తారు. మరో సందర్భంలో అవశేష ఆంధ్రప్రదేశ్ అంటారు. ఏది సరైనది?
విశేషణాలు అక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్ అంటే చాలు.

07/16/2016 - 22:12

కలుకం పిచ్చయ్య, ఖమ్మం
మన దేశ జనాభా 1951లో 36 కోట్లు ఉంటే ఇప్పుడు 120 కోట్లకు పెరిగింది. ఇది శుభసూచకమా? జనాభా ఇలా పెరుగుతూ పోతే ఒనగూడేదేమిటి? ఇది సుభిక్షానికి సంకేతమా లేక దుర్భిక్షానికి సంకేతమా?
జనమే మన ఆస్తి. జనాభాలో యువత శాతమే హెచ్చుగా ఉండటం దేశ భవితకు శుభసూచకం. జనాభా పెరుగుదలను చూసి బెంబేలెత్తడం కాదు. జనశక్తిని సద్వినియోగం చేయటం ఎలాగన్నది ఆలోచించాలి.

07/09/2016 - 21:44

కాళిదాసు, కావలి
నారదుడే విశ్వంలో మొట్టమొదటి ‘రిపోర్టర్/ జర్నలిస్ట్’ అని ఆరెస్సెస్ వాళ్లు ‘నారద జయంతి’ జరుపుతుంటారు. నిజమేనా? మీ అభిప్రాయం?
నాకు తెలిసినంతలో భారత యుద్ధాన్ని లైవ్‌గా రిపోర్టు చేసిన సంజయుడే మొదటి జర్నలిస్టు.

Pages