S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకు తెలుసా ?

09/16/2017 - 17:49

నెప్ట్యూన్ గ్రహం చుట్టూ ఉండే రింగుల నేపథ్యంలో కనిపించే అతి చిన్న గ్రహం ప్లూటో. దీనిని 1930లో క్లైడ్ టొమ్‌బాగ్ అనే ఖగోళ శాస్తవ్రేత్త కనిపెట్టారు. అయితే దీనికి ఏం పేరుపెట్టాలన్నదానిపై ఆలోచన చేస్తున్న సమయం అది. వెనెటియా బర్న్‌లీ అనే పదకొండేళ్ల బాలిక ప్లూటో పేరును పెడితే బాగుంటుందని తన తాత ఫాల్కన్ మదన్‌తో చెప్పింది. ఇతను బాడ్‌లియాన్‌లోని ఆక్స్‌ఫర్డ్ లైబ్రరీలో ఉద్యోగి.

09/16/2017 - 17:40

ఇది స్వార్ధపూరిత ప్రపంచం. అంతా నాకే కావాలి... అంతా నేనే దోచుకోవాలి అనుకునే సమాజంలో బతుకుతున్నాం మనం. పక్కవాడి గురించి కలలో కూడా ఆలోచించని పైశాచిక మానవులు మన చుట్టూ ఉన్నారు. ఆస్తులు, ఐశ్వర్యాల కోసం రక్తసంబంధీకులను కూడా కడతేరుస్తున్నారు. అటువంటిది తనకేమీ కాని వారి కోసం తన యావదాస్తిని తృణప్రాయంగా త్యజించిన ఒక మానవతా మూర్తి గురించి వింటే ఆశ్చర్యపోక తప్పదు. అతనే డెబ్బై నాలుగేళ్ల పాలం కళ్యాణ సుందరం.

09/16/2017 - 17:28

ఏడాదిలో భూగోళాన్ని చుట్టివచ్చే వలసపక్షి ఇది. దీని పేరు ఆర్కిటిక్ టెర్న్. కేవలం వంద గ్రాముల బరువు, 40 సెంటీమీటర్ల పొడవు మాత్రమే ఉండే ఈ పక్షి ఏటా కనీసం సగటున 70,900 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఆహార లభ్యత ఆధారంగా ఏటా వేసవిలో ఆర్కిటిక్ ప్రాంతం నుంచి అంటార్కిటికాకు వలస వెళతాయి. సంతానోత్పత్తి తరువాత మళ్లీ ఆర్కిటిక్‌కు వెళతాయి.

09/16/2017 - 17:26

చిహువాహువా జాతి శునకాలు డాగ్ ఫ్యామిలీలో అతి చిన్నవి. మెక్సికోలోని అతిపెద్ద రాష్టమ్రైన చిహువాహువా ప్రాంతంలో మొదటిసారిగా వీటిని కనిపెట్టినందున ఆ ప్రాంతం పేరే వాటికి పెట్టారు. మూడున్నర నుంచి 4.5 అంగుళాల ఎత్తు మాత్రమే పెరిగే ఈ శునకాలు పెద్ద చెవులు, గుండ్రని పెద్దకళ్లు, వెడల్పైన పెద్ద చెవులతో చూడముచ్చటగా ఉంటాయి. శునకాలన్నింటిలోకి ఇవి కాస్త ఆరోగ్యమైనవిగా చెప్పుకోవచ్చు.

09/12/2017 - 20:53

లిజార్డ్ (బల్లి) జాతికి చెందిన ఈ కొమడో డ్రాగన్‌లు భూమిపై ఉన్న అతి పాతకాలపు జీవులు. భూమి ఏర్పడిన తరువాత పుట్టిన ఈ జీవులు కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నాయి. అయినా వాటిని గురించి తొలిసారిగా తెలిసింది వందేళ్ల క్రితమే. అదీ ఓ విమాన ప్రమాదం కారణంగా వాటి సంగతి బయటి ప్రపంచానికి తెలిసింది. కొమడో అనేది ఓ దీవి. ఓ ఓసారి ప్రమాదానికి గురైన ఓ విమానం ఈ దీవిలో పడింది.

09/12/2017 - 20:52

ప్రపంచంలో అత్యధిక జనాభాకు నల్లని, లేదా గ్రేకలర్ జుత్తు కలిగి ఉంటారు. 12శాతం మంది జనాభా ఎర్రజుత్తుతో ఉంటారని తేలింది. అయితే వారిలో అత్యధికశాతం మంది స్కాట్లాండ్‌లో ఉంటారు. అంటే ఆ దేశంలో దాదాపుసగం మంది ఎర్రజుత్తు ఉన్నవారే. ఎర్రజుత్తు ఉన్నవారి కళ్లు గ్రే కలర్ ఉండటం మామూలు. అయితే నీలికళ్లు, ఎర్రజుత్తు ఉన్నవారికి ఎంతో విలువ ఉంటుంది.

09/12/2017 - 20:50

లిజార్డ్స్ జాతికే చెందిన జీవి మోనిటర్ లిజార్డ్. ఇవి కూడా కొమడో డ్రాగన్‌ల మాదిరిగా పెద్ద జీవులే. 10 నుంచి 122 అంగుళాల మేర ఇవి పెరుగుతాయి. పొడవైన మెడ, తోక వీటికి ఉంటాయి. వెనుక కాళ్లపై నిటారుగా నిలబడి చుట్టుపక్కల ప్రాంతాలను గమనించడం వీటికి అలవాటు. అందువల్లే వీటిని మోనిటర్ లిజార్డ్స్ అని పిలుస్తారు. అతివేగంగా తిరగడం వీటికి తెలుసు. ఒకే ప్రాంతంలో జీవితాంతం ఉండటానికి ఇష్టపడటం వీటి ప్రత్యేకత.

09/02/2017 - 21:45

నీలం, ఆకుపచ్చ, ఆరెంజ్ రంగుల్లో అందంగా కనిపించే ఈ చేపలు డ్రాగనెట్ కుటుంబానికి చెందినవి. సముద్రంలో అడుగున నేలపై నడుస్తూ, పగడపుదిబ్బల మాటన జీవిస్తూ ఆహారాన్ని అనే్వషిస్తాయి. ఇవి అందంగా ఉండటం వల్ల అక్వేరియంలలో పెంచేందుకు వ్యాపారులు వేటాడి పట్టుకుంటారు. కానీ వీటిని పెంచడం చాలా కష్టం.

09/02/2017 - 21:43

శంఖం ఆకారంలో షెల్‌లో (కోన్ స్నెయిల్స్) పెరిగే నత్తలు అత్యంత విషపూరితమైనవని అందరికీ తెలిసిందే. వాటిలో అన్నింటికన్నా జియోగ్రాఫిక్ కోన్ స్నెయిల్ అత్యంత విషపూరితమైనది. వీటిని సిగరెట్ స్నెయిల్స్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇవి కాటువేసిన తరువాత బాధితుడు కేవలం సిగరెట్ కాల్చడానికి పట్టినంత సమయంలో ప్రాణాలు కోల్పోతాడు. అందుకనే వీటిని అలా పిలుస్తారు. ఈ భూమీద అత్యంత విషపూరితమైన జీవి ఇదే.

09/02/2017 - 21:40

విషపూరితమైన జీవి స్టోన్ ఫిష్. రాయిమాదిరిగా కనిపించడం వల్ల దానికి ఆ పేరు వచ్చింది. హిందూ పసిఫిక్ సముద్ర జలాల్లో ఇవి కనిపిస్తాయి. శరీరంపై ఉండే సూదుల్లాంటి పుల్లల దిగువ సంచుల్లో విషం నిల్వ ఉంటుంది. దీనిపై అడుగువేసినప్పుడు కలిగే ఒత్తిడిని బట్టి ఆ స్పైన్స్‌లోకి విషం వస్తుంది. కేవలం 0.15 సెకండ్లలో ఇది దాడి చేస్తుంది. కనురెప్ప పడి తెరిచేలోగా ఇది ఆహారాన్ని పట్టుకోవడం కాని, దాడి చేయడం గాని చేసేస్తుంది.

Pages