S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకు తెలుసా ?

08/27/2017 - 22:07

ఈ భూమిమీద లభ్యమయ్యే ఆక్సిజన్‌లో 87 శాతం మేరకు అందిస్తున్న ప్రాణులు ఆల్గే. దాదాపు 75 వేల రకాలలో ఉండే ఈ ఆల్గే.. ఒక రకమైన మొక్కల్లాంటి ప్రాణి. ఎక్కువగా సముద్రాలు, నదుల్లో జీవిస్తుంది. అందరి పరిభాషలో చెప్పాలంటే ఆల్గే ఒకరకమైన నాచు. కిరణజన్య సంయోగక్రియ ద్వారా కార్బన్‌డయాక్సైడ్‌ను వాడుకుని ఆక్సిజన్‌ను విడుదల చేసి సొంతంగా ఆహారం తయారు చేసుకుంటుంది.

08/27/2017 - 22:05

బంతిలా గుండ్రంగా, అందంగా వందల సంఖ్యలో ఒకచోట ఎదిగే ఇవి నిజమైన బంతులు కావు. బంతుల ఆకారంలో ఉండే మొక్కజాతి జీవులు. కిరణజన్య సంయోగక్రియ ద్వారా తమకు తాముగా ఆహారాన్ని తయారు చేసుకునే ఇవి ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. మరోరకంగా చెప్పాలంటే ఇవి నాచుబంతులన్న మాట. అలల తాకిడి వల్ల ఆ నాచు ఇలా ఉండచుట్టుకుపోయి బంతుల్లా తయారవుతుంది.

08/27/2017 - 22:02

జపాన్, హవాయ్ దీవుల్లో కనిపించే ఈ అందమైన అక్వేరియం చేపల పేరు ఎల్లో టాంగ్. వీటి తోకకు ఇరువైపులా ఉండే ఎముక (స్పైన్-టాంగ్)తో శత్రువులను భయపెడతాయి. ప్రమాదం ఎదురైనపుడు, లేదా ఇవి భయపడినపుడు తోకను అతివేగంగా అటూఇటూ కదుపుతూ ఈ టాంగ్‌ను ప్రదర్శిస్తూ ఆర్భాటం చేస్తాయన్నమాట. ఇక పసుపురంగులో అందంగా మెరిసిపోయే ఈ చేపలు రాత్రిపూట పసుపురంగులో మెరుపును తగ్గిస్తాయి. వీపుమీదుగా ఎర్రని చార వచ్చేలా చేస్తాయి.

08/19/2017 - 21:41

దక్షిణ అమెరికాలోని కొన్ని దేశాల్లో కనిపించే ఈ కోతులను ‘వూలీ మంకీస్’ అని పిలుస్తారు. దట్టంగా, నున్నగా, మెత్తగా ఉండే ఊలు లాంటి బొచ్చు వల్ల వాటికి ఆ పేరు వచ్చింది. ప్రశ్నార్థకాన్ని పోలినట్లు ఉండే కొనతిరిగిన పొడవైన తోక వీటికి అందాన్నిస్తుంది. ధృడంగా, బలంగా ఉండే ఈ తోక ఆధారంగా అది చెట్లపై వేళ్లాడుతూ ఆహారాన్ని తలకిందులు భంగిమలో తింటుంది. ఒకచెట్టుపైనుంచి మరోచెట్టుపైకి దూకి సంచరిస్తూంటాయి.

08/19/2017 - 21:39

ఆస్ట్రేలియాలో ఎటు చూసినా కనిపించే ‘గలాహ్’ చిలుకలు కొకటూ కుటుంబానికి చెందినవి. ఎదభాగం ఊదారంగులోను, మిగతా శరీరం బూడిదవర్ణంలోను ఉండే ఈ పక్షులు జతకట్టాక జీవితాంతం అమితమైన ప్రేమతో కలసిమెలసి జీవిస్తాయి. కనీసం వెయ్యిపక్షులు ఉమ్మడిగా జీవించడం వీటి ప్రత్యేకత. మగ పక్షుల కళ్లు నల్లగాను, ఆడపక్షుల కళ్లు ఎర్రగాను ఉంటాయి. అంతకుమించి ఆ పక్షులను విడిగా గుర్తుపట్టడం కష్టమే.

08/19/2017 - 21:37

మనకుమల్లే దీని శరీరవర్ణం ఉండటం వల్ల ‘ఒల్మ్’ చేపలను హ్యూమన్ ఫిష్ అని పిలుస్తారు. పాముల్లా, ఈల్ చేపల్లా ఉండే ఇవి స్లొవేనియా, క్రొయేషియా, ఇటలీ, బోస్నియా, హెర్జిగోవినా ప్రాంతాల్లోని సముద్ర గర్భంలో ఉండే గుహల్లో జీవిస్తాయి. వీటికి కళ్లు పూర్తిగా పనిచేయవు. నీటి నుంటి రక్షణకు పారదర్శకంగా ఉండే కనుపాపలు ఉంటాయి. వీటికి ఊపిరితిత్తులు ఉన్నా తలవెనుక ఉండే గుత్తుల్లాంటి గిల్స్‌తోనే శ్వాస తీసుకుంటాయి.

08/19/2017 - 21:32

కాంగో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జీవించే ఈ జంతువు పేరు ‘ఒకాపి’. ఆకర్షణీయమైన రంగులో ఉన్నప్పటికీ శరీరంలో ముందు, వెనుకకాళ్లమీదుగా ఉండే చారలవల్ల అవి జీబ్రాల జాతికి చెందినవేమోనని చాలామంది భావిస్తారు. కానీ అవి జిరాఫీకి దగ్గరి జీవులు. నిజానికి జిరాఫీకి అతి సామీప్యం ఉన్న జీవరాశి ఇదొక్కటే. 6.5 అడుగుల ఎత్తు, 8.5 అడుగుల పొడవు పెరిగే వీటికి జిరాఫీ మాదిరిగా పొడవైన మెడ ఉంటుంది.

08/19/2017 - 20:54

పశ్ఛిమ ఆఫ్రికాలోని సియర్రాలియోన్, లైబీరియా వంటి దేశాల్లో కనిపించే ‘డయానా’ కోతులు ఓల్డ్ వరల్డ్ మంకీ జాతులకు చెందినవి. ఆకర్షణీయమైన రంగులు, పొడవైన తోక వీటికి ఉంటాయి. నుదుటి పైభాగంలో ఉండే తెల్లటి వెంట్రుకలతో కూడిన మార్కింగ్ వల్ల వీటికి ‘డయానా’ అన్న పేరు వచ్చింది.

08/08/2017 - 22:15

పిల్లిజాతికి చెందిన ‘జాగ్వార్’ (పులులు)లు అమెరికాలో దేశాల్లోనే కనిపిస్తాయి. దొంగచాటుగా దాడిచేసి ఒక్కగెంతులో శత్రువును నోటకరచి పుర్రెను కొరికి చంపేయడం వాటి ప్రత్యేకత. ‘యాగ్వార్’ అనే భారతీయ పదం నుంచి ‘జాగ్వార్’ అన్న పేరు దానికి వచ్చింది. దాదాపు 85 రకాల ఆహారాన్ని తినే ఈ పులుల శరీరంపై రోజా పువ్వులాంటి మచ్చలు ఉంటాయి. చిరుతల్లా ఇవి చెట్లు ఎక్కి నక్కి ఉంటాయి.

08/08/2017 - 22:10

‘నేక్‌డ్ మోల్ రాట్’గా పిలిచే ఈ క్షీరదజాతి జీవికి ఎలుకలతో సంబంధమే లేదు. కనీసం చుంచులతోనూ వీటికి సంబంధం లేదు. నిజానికి గినియాపందులు, ముళ్ల పందులు వీటికి బంధువులు. దాదాపు నగ్నంగా ఉన్నట్లు కనిపించే శరీరంతో ఉన్నా దాదాపు వంద వెంట్రుకలు వాటికి ఉంటాయి. నిరంతరం పెరిగే పైన, దిగువ ఉండే పొడవైన పళ్లను అవి చాప్‌స్టిక్స్‌లా ఉపయోగిస్తాయి. చీమల మాదిరిగా ‘కాలనీ’ వ్యవస్థ వీటికి ఉండటం ప్రత్యేకత.

Pages