S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

11/04/2017 - 18:10

సీతాకోక చిలుకల్లో ‘మోనార్క్ బటర్‌ఫ్లై’గా చెప్పుకునేవి అతిపెద్దవి. నారింజ, నలుగు, తెలుపు ముదురు రంగులతో ఆకర్షణీయంగా కనిపించే ఈ సీతాకోక చిలుకలు రెక్కలు విప్పితే పది సెంటీమీటర్ల వెడల్పు ఉంటాయి. దాదాపు ఐదు నెలలు వీటి జీవితకాలం. భారత్, ఆస్ట్రేలియా, కెనడా, మెక్సికో, అమెరికాల్లో ఇవి కనిపిస్తాయి. అయితే అమెరికాలో ఇవి ఎక్కువ. మిల్క్‌వీడ్ చెట్ల ఆకులు తొలిదశలో వీటి ప్రధాన ఆహారం. అమెరికాలో ఈ చెట్లు ఎక్కువ.

11/04/2017 - 18:08

ఈ భూమిపై పడ్డ ప్రతి ఒక్కరు ఏదో ఒక ప్రత్యేకత కలిగే ఉంటారు. ఆ ప్రత్యేకత ఏమిటో ఎవరికి వారు తెలుసుకుని సాధన చేస్తే గొప్పవారిగా కీర్తింపబడతారు. అయితే చాలా మంది తమపై తాము నమ్మకం కలిగి ఉండరు. ఎవరో వస్తారు... ఏదో చేస్తారని ఎదురు చూస్తూ ఉంటారు. అయితే మధ్యప్రదేశ్‌కి చెందిన అభిషేక్ చౌబే మాత్రం ఆ తరహా కుర్రాడు కాదు. అతనికి తన బలమేమిటో బలహీనత ఏమిటో తెలుసు.

10/29/2017 - 00:27

తామర రేకుల్లాంటి కళ్లు కలవాడు, నల్లటివాడు, సాటిలేని వాడు, పూజ్యుడు ఐన రాముడు ‘నేను వచ్చినట్లు మా నాన్నకి చెప్పు’ అని ఆ సారథితో చెప్పాడు. దుఃఖంలో ఉన్న సుమంత్రుడు రాముడి మాటలు వినగానే లోపలకి వెళ్లి, అక్కడ దుఃఖంతో నిట్టూర్చే రాజుని చూశాడు. దశరథుడు గ్రహణం పట్టిన సూర్యుడిలా, బూడిదతో కప్పబడ్డ నిప్పులా, నీళ్లు లేని చెరువులా కనిపించాడు.

10/29/2017 - 00:25

ఫ్రశ్న: ఇటీవల ఎక్కువగా గురక పెడ్తున్నానని ఇంట్లో వాళ్లు అంటున్నారు. డాక్టర్‌గారికి చూపిస్తే మందులిచ్చారు. కానీ ఫలితం లేదు. ఇది తగ్గుతుందా? నేను తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి?
జ: నిద్రావస్థలో గురక ఒక దురవస్థ. ఊపిరి గొట్టాల్లో వాపుల వలన కలిగే ఒక హింసాత్మక అవస్థ. స్వయంగా గురక వీరులకు, కలిసి పడుకున్న ఇతరులక్కూడా!
చిత్రవిచిత్రమైన ధ్వనులతో గురక పెడ్తుంటారు కొందరు.

10/29/2017 - 00:14

హిందువుల స్వర్గంలో ఒక అద్భుత వృక్షం ఉంది. అది కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం. నువ్వు ఒక కప్పు టీకి, లేదా ఒక స్ర్తిని, ఒక కారుని ఆర్డర్ చెయ్యాల్సిన పని లేదు. హోటల్‌లో పిలిచినట్లు బేరర్‌ని పిలిచి ఆర్డర్ ఇవ్వాల్సిన పనే్లదు.
నువ్వు వెళ్లి ఆ కోరికలు తీర్చే కల్పవృక్షం కింద కూచుని నీకు ఏం కావాలంటే అది మనసులో అనుకుంటే, తక్షణం అవి నీ ముందు ప్రత్యక్షమవుతాయి.

10/28/2017 - 23:33

ఉద్యోగం రాక ముందు ఒక రకమైన ఆలోచన ఉంటుంది. ఉద్యోగం వచ్చిన తరువాత మరో రకమైన ఆలోచన మొదలవుతుంది. అనుకున్న స్థలంలో ఉద్యోగం రావాలని, జీతం పెరగాలని ఇట్లా కోరికల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది.
ఎన్ని పెరిగినా ఉద్యోగాన్ని ఉద్యోగంగా మాత్రమే చూస్తారు తప్ప మరో రకంగా చూడరు. అది ఉద్యోగం మాత్రమే కాదు. మన నైపుణ్యాలని పెంచుకోవడానికి ఉద్యోగం అనేది ఒక అవకాశం కల్పిస్తుంది.

10/28/2017 - 17:44

కరీంనగర్‌కు చెందిన నర్సింలు వరంగల్ చేరాడు. నాలుగు రోజులు చిన్నమ్మాయి శిరీష దగ్గరుందామని బయల్దేరి వచ్చాడు.
మరునాడు వరండాలో కూర్చుని దినపత్రిక తిరగేస్తున్నాడు. అంతలో వాకిట్లో కారు ఆగింది. మేనల్లుడు గిరి కారు దిగి ఇంట్లోకి వచ్చాడు. ‘మామయ్యా! బయటకెళదాం. సిద్ధంగా ఉండు’ అంటూ లోనికి వెళ్లాడు.

10/28/2017 - 17:42

చలిచలిగా, పొడిపొడిగా ఉండే వసంత, శీతాకాలంలో వాతావరణం చాలామందికి కాస్తంత చిరాకుగానే ఉంటుంది. కానీ ఆ కాలంలో ప్రసవించిన బాలింతలకు మాత్రం ఆ సమయం ఎంతో మంచిదని తాజా అధ్యయనం చెబుతోంది. సాధారణంగా ప్రసవించిన తరువాత చాలామంది మహిళలు ఒకరకమైన కుంగుబాటుకు గురవుతారు. దానినే ‘బేబీ బ్లూ’గా పిలుస్తారు.

10/28/2017 - 17:38

అదొక ప్రత్యేకమైన గ్రామం. మన దేశంలోని మేఘాలయకు చెందిన ఖాసీ అనబడే కొండ ప్రాంతంలో ఉంటుందది. కాంగ్‌తాంగ్ అని పిలవబడే ఆ గ్రామంలోని ప్రజలు అందమైన ప్రకృతితో మమేకమై జీవిస్తుంటారు. కొండలు, కోనలు, సెలయేళ్లు, తటాకాలు, పచ్చికబయళ్లే వారి నేస్తాలు. కల్మషం ఎరుగని అక్కడి ప్రజలు ప్రశాంత జీవనం గడుపుతారు. కాంగ్‌తాంగ్ గ్రామానికి వెళ్లేందుకు రహదారి సదుపాయం లేదు.

10/21/2017 - 23:53

వందేళ్లు పూర్తి చేసుకున్న సూర్యాపేట ‘విజ్ఞాన ప్రకాశిని’
*

Pages