S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

10/08/2017 - 00:01

వృద్ధాప్యం కొందరికి ఒంటరితనాన్ని తెచ్చిపెడుతోంది. సమాజంలో వచ్చిన మార్పులు, చిన్నకుటుంబాల వ్యవస్థ పెద్దవారిని బాధిస్తోంది. కాలానుగుణంగా వచ్చిన మార్పులు ఒకపట్టాన వారికి అలవాటు కాకపోవడం వారిని మరింత ఒంటరిని చేస్తోంది. ఆధునిక సమాజంలో ఇప్పుడు ‘డిజిటల్ లిటరసీ’కి ప్రాధాన్యం పెరిగిపోయింది. స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల వినియోగం ఎక్కువైపోయింది. దాదాపు అన్ని పనులు వీటిద్వారానే చేసేస్తున్నారు.

10/07/2017 - 23:58

ఇక్కడున్న ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ దాగి ఉంటుంది. అయితే చాలా మంది ఆ విషయాన్ని గుర్తించరు. ఎవరైనా ఏదైనా సాధించారంటే వారేదో పైనుండి దిగి వచ్చినట్లు భావిస్తూ తమను తాము తక్కువ చేసుకుని సాదాసీదాగా బతికేస్తూ ఉంటారు. కానీ హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలకి చెందిన ముకేష్‌థాపా మాత్రం అటువంటి వాడు కాదు. అతనో అరుదైన ప్రతిభ గల చిత్రకారుడు.

10/07/2017 - 23:55

అరుణ్, కిరణ్ ఇద్దరూ మంచి స్నేహితులు. వాళ్లిద్దరూ ఒకే బడిలో ఐదవ తరగతి చదువుతున్నారు.
ఇటు చదువులోనూ, అటు ఆటపాటల్లోనూ, అన్నింటిలో ఇద్దరూ ఇద్దరే అన్నట్లు పోటీ పడుతూ మంచి పేరు తెచ్చుకున్నారు.
ఇద్దరిలో ఒకరు ఏ కారణం చేతనైనా బడికి రాకపోతే, మరొకరు ఆ రోజు తరగతి గదిలో ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలనీ, నోట్సులనీ జాగ్రత్త రాసి వాటిని మిత్రుడి ఇంటికి వెళ్లి మరీ అందించేవారు.

10/07/2017 - 21:28

ఒక గురువు తనని దర్శించడానికి వచ్చిన ఒక వ్యక్తితో ‘జీవితానికి సంబంధించిన చిన్ని రహస్యం ఇది. ఎవరేం చెప్పినా, చివరికి గురువు చెప్పినా గుడ్డిగా అంగీకరించవద్దు. ఏదీ మరీ సీరియస్‌గా తీసుకోవద్దు. నవ్వుడం నేర్చుకో - ప్రతిదాన్నీ చూసి చిరునవ్వు నవ్వడం నేర్చుకో. అప్పుడు నువ్వు జీవించడం ఎలాగో నేర్చుకుంటావు’ అన్నాడు. ఆ వ్యక్తి గురువు మాటల్ని వింటున్నాడు. గురువు కొనసాగించాడు.

10/07/2017 - 21:27

అబూసరి బట్టల కొట్టు నడిపేవాడు. మార్కెట్ మధ్యలో అతని షాపు ఉండేది. వచ్చీపోయే జనాలతో మార్కెట్ రద్దీగా ఉండేది. సందడిగా వుండేది. అబూసరి షాపునకు జనాలు బాగా వచ్చేవాళ్లు. వాళ్లతో మాటలు కలిపి సరదాగా కబుర్లు చెబుతూ, అందరి క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ అబుసరి వ్యాపారం కొనసాగించేవాడు. అతనికి ఒంటరిగా ఉండడం ఇష్టముండదు. మనుషులతో గడపడమంటే అతనికి ఆనంద.

10/07/2017 - 21:14

రోజుకి 50 నుంచి వంద లీటర్ల పరిశుద్ధమైన మంచినీటిని తయారుచేసే పద్ధతిని కనుగొన్నారు ఇటలీ శాస్తవ్రేత్తలు. అర్ట్యురో విటోరి, అతడి సహచరుడు అండ్రియాస్ వొగ్లర్ రూపొందించిన ఈ అతిసాధారణమైన యంత్రం అటు కరెంటు పరికరాలపైన గానీ, ఇటు భూగర్భ జలవనరులపై గానీ, ఏ మాత్రం ఆధారపడదు. ఈ పరికరానికి వార్క వాటర్ టవర్ అని పేరు పెట్టారు.

10/07/2017 - 21:11

అంతకు ముందే అక్కడికి వచ్చిన లక్ష్మణుడు సీతారాముల సంవాదాన్ని విని దుఃఖాన్ని దిగమించుకోలేక కన్నీటితో నిండిన కళ్లతో సోదరుడి పాదాలకి నమస్కరించాడు. గొప్ప నియమాలు గల రాముడితో, గొప్ప కీర్తిగల సీతతో లక్ష్మణుడు ఇలా చెప్పాడు.

10/07/2017 - 21:05

ఫ్రశ్న: నా వయసు 30 సం.లు. సాఫ్ట్‌వేర్‌లో పని చేస్తున్నాను. ఊరికే అలసిపోతున్నాను. అన్ని పరీక్షలూ చేసి ఏమీ లేదంటున్నారు. ఎలా తగ్గించుకోవాలో వివరంగా చెప్పగలరు.
జ: బుర్ర వేడెక్కిపోతోంది! మానసికంగా అలసిపోతున్నా! జ్ఞాపకశక్తి తగ్గిపోతోంది! ఆలోచనలు సాగటం లేదు! బుర్ర సరిగా పని చేయట్లేదనిపిస్తోంది... ఇలా అనిపిస్తున్న వారికి లైఫ్ స్టైల్‌లో కొద్దిపాటి మార్పులు అవసరం అవుతాయి.

10/02/2017 - 22:52

జీవితంలో ప్రతి విషయం ఒక్క చిన్న అడుగుతోనే ప్రారంభం అవుతుంది. ఈ విషయం తెలిసి కూడా చాలామంది తమ జీవితాలకు అన్వయించుకోరు.
ఈ చిన్న అడుగుతో ఏం అవుతుందని అనుకుంటూ వుంటారు. అట్లా అనుకొని నిరుత్సాహపడి అడుగు వేయడం మానేస్తారు. మన చుట్టూ వున్న వాతావరణాన్ని మనుషులని గమనిస్తే ఈ విషయం బోధపడుతుంది. కానీ ఈ విషయం అర్థం చేసుకోరు.

09/23/2017 - 23:24

ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు పెద్దలు. చక్కటి ఆహారం, కంటినిండా నిద్ర మంచి ఆరోగ్యానికి బాటలు వేస్తాయి. శారీరక శ్రమ తగినంత అవసరం కూడా. కానీ గంటల తరబడి పనిచేస్తూ ఉంటే మాత్రం ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది తాజాగా జరిపిన పరిశోధనల్లో తేలిన అంశం. నిర్ణీత సమయానికి మించి అదేపనిగా విధుల్లో మునిగితేలిపోతూంటే గుండెకు ప్రమాదం తప్పదని తాజా అధ్యయనం తేల్చిచెబుతోంది.

Pages