S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

08/26/2017 - 21:55

మనం బలంగా, దృఢంగా ఉండాలని కఠిన క్రమశిక్షణకు లోను కావడమన్నది మనలోని బలహీనత. ఉల్లాసంగా, మృదువుగా ఉండడం తెలుసుకుంటే మనలోని బలాన్ని, దృఢత్వాన్ని చూడగలం.
మనం ప్రతిదానితో సామరస్యంగా ఉండగలిగితే, ముఖ్యంగా మనలో మనం సామరస్యంగా ఉండగలిగితే మనం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండగలం.

08/26/2017 - 21:52

ఉన్నతమైన మనసు గల కౌసల్య దుఃఖాన్ని వదిలి, నీళ్లతో ఆచమనం చేసి శుచిగా రాముడికి మంగళక్రతువులు పూర్తి చేసి చెప్పింది.

08/26/2017 - 21:49

ఫ్రశ్న: నేను సెక్యూరిటీగా పని చేస్తుంటాను. నిద్ర పోవటానికి సమయం చాలటంలేదు. నా వృత్తి ధర్మం అలాంటిది. ఈ మధ్య జ్ఞాపకశక్తి బాగా తగ్గిపోతోంది. దేని మీదా ఉత్సాహం ఉండట్లేదు. నిద్ర లేకపోవటం వల్లనే అంటున్నారు. నిజమేనా?
జ: నిద్రే మంచిది! నిద్రను మించిన మంచి లేదు! నిద్రపోవటం మనిషి హక్కు.

08/21/2017 - 23:28

ఈమధ్య ఓ వీడియో చూశాను. అందులో ఓ వ్యక్తి 100 రూపాయల నోటుని నలిపి ‘దీని విలువ ఎంత’ అని ఆ క్లాసులో కూర్చున్న వ్యక్తులను అడుగుతాడు.
‘వంద రూపాయలని’ అక్కడ కూర్చున్న వ్యక్తులు చెబుతారు. ఆ తరువాత అతను ఆ వంద రూపాయలని బూటుకాలితో నలిపి మళ్లీ అదే ప్రశ్న వేస్తాడు.

08/21/2017 - 23:22

దృఢతర దీక్ష, పట్టుదల, కష్టపడే నైజం ఉంటే కలలను సాకారం చేసుకోవడం ఏమంత కష్టం కాదు. వీటన్నింటికీ కొంచెం అదృష్టం తోడైతే ఉన్నత శిఖరాలకు చేరుకోవడం ఎవరికైనా సాధ్యమే. సరిగ్గా దీనినే చేసి చూపించాడు నాగ్‌పూర్‌కి చెందిన శ్రీకాంత్ పంత్‌వానే. అతి సాధారణమైన సెక్యూరిటీ గార్డ్ కొడుకైన శ్రీకాంత్‌కి చిన్నతనం నుండి విమానాలంటే ఇష్టం. ఎంత ఇష్టమంటే తాను ఎప్పటికైనా విమానాలు నడపాలని కలలు కంటుండేవాడు.

08/21/2017 - 23:17

విజయపురం మహారాజు విక్రమసింహుడు ప్రజారంజకుడు. ప్రతి ఏడాదీ తన జన్మదినాన విరివిగా పేద ప్రజలకు దానధర్మాలు చేసేవాడు. ఒకరోజున సభలో తన పాలన గూర్చి మాట్లాడుతూ తాను చేసే దానాల గురించీ కాస్త గర్వంగా చెప్పడం విన్న మహామంత్రి మాన్యుడు ‘మహారాజా! చాలామంది సామాన్యులు సైతం తమకున్న దాంట్లో చాలా దానాలే చేస్తూంటారు. బాగా సంపద ఉన్న వారికంటే తమ కష్టంతో సంపాదించిన దాన్లోంచీ దానం చేయడం గొప్ప అవుతుంది’ అన్నాడు.

08/21/2017 - 23:15

తల్లిదండ్రులు, దగ్గరి బంధువులను చూడగానే పసికందులు ఎలా ముచ్చటపడిపోతారో తెలుసుగా? మాటలురాని స్థితిలో నెలల పిల్లలు కాళ్లూచేతులూ ఆడించి, బోసినవ్వులు చిందించి, నొసలు చిట్లించి, కేరింతలు కొట్టి ఇలా రకరకాలుగా భావోద్వేగాలను వెల్లడిస్తారు. కొంత పెరిగాక మీదపడడం, ముద్దుపెట్టుకోవడం, గారాలుపోవడం, వెనకాలే తిరగడం, శరీరాన్ని తాకుతూ ప్రేమను చాటడం వంటి చర్యలతో తమ అనుబంధాన్ని చిన్నారులు వెల్లడిస్తారు.

08/19/2017 - 23:04

ఒకసారి బుద్ధుడు ఒక నగర సరిహద్దులోని ఒక ఉద్యానవనంలో విడిది చేశాడు. ఆ నగరానికి రాజు అజాతశత్రువు. అంటే అతనికి శత్రువన్నవాడు ఇంకా పుట్టలేదన్నమాట. అతని పేరుకు అది అర్థం. పేరు ఎలా వున్నా రాజు రాజే. రాజులకు ఎప్పుడూ శత్రువుల భయం ఉంటుంది. అట్లాగే అజాతశత్రువు నిరంతరం అప్రమత్తంగా, అభద్రతా భావంతో ఉండేవాడు.

08/19/2017 - 21:57

రాముడులోని తండ్రి మాటని పాటించాలనే దృఢ నిశ్చయాన్ని గమనించిన సుమిత్ర డగ్గుత్తికతో ధర్మపరమైన మాటలని పలికింది.

08/19/2017 - 21:53

ఫ్రశ్న: వానాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?
-శరభయ్య వారణాసి (వరంగల్)
జ: శిశిర, వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత ఋతువులు ఆరింటిలో మొదటి మూడు కాలాల్ని విసర్గ కాలాలంటారు. మనలోని శక్తిని, శీతల గుణాలను ఈ ఋతువులు గ్రహిస్తాయి. వాటిని అదాన కాలాలంటారు. ఇది ఉత్తరాయణంలో జరిగే అంశం. శిశిరంలో ఆకులు రాలేది అందుకే!

Pages