S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

07/17/2017 - 03:29

వీడియోగేమ్‌ల వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుందని, డిమెన్షియా (జ్ఞాపకశక్తి తగ్గిపోవడం) బారినుంచి కోలుకునేందుకు ఇవి ఉపయోగపడతాయని ఓ అధ్యయనం చెబుతోంది. సంక్లిష్ట నాడీవ్యవస్థతో కూడిన మెదడు పనిచేయడం మందగిస్తే జ్ఞాపకశక్తి తగ్గడం, మతిమరుపు, చురుకుగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఎదుటివారిని గుర్తించలేకపోవడం వంటి రుగ్మతలు తలెత్తుతాయి.

07/17/2017 - 03:27

రమణమ్మకి శుచి శుభ్రం పాటించటం అలవాటు. తనలాగే అందరూ ఉండాలనుకోవటం ఆమె మనఃస్వభావం. అందుకు విరుద్ధంగా ఎవరైనా ఉన్నా, ప్రవర్తించినా తట్టుకోలేదు ఆమె.
ఆమెకి వొంట్లో బాగోకపోవటంతో వంట మనిషిని పెట్టుకోవాలనుకుంది. ఎంత మందో మారారు ఆమె సూటిపోటి మాటలు పడలేక. అప్పయ్య శాస్ర్తీ వచ్చిన తరువాత ఇక వంట మనిషి గురించి వెతికే అవసరమే కలగలేదు రమణమ్మ భర్త రామయ్యకి.

07/17/2017 - 03:25

ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. సకాలంలో దానిని గుర్తించగలిగి, ఆ రంగంలో కృషి చేస్తే ఎవరైనా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు. సరిగ్గా దీనే్న చేసి చూపించాడు మధ్యప్రదేశ్‌కి చెందిన రాహుల్ స్వామి. రంగోలీ ఆర్ట్‌లో సిద్ధహస్తుడిగా పేరు గడించిన రాహుల్ క్షణాల్లో రకరకాల రంగులతో కళ్లు మిరుమిట్లు గొలిపే ముగ్గులను వేసి చూపరులను ఆశ్చర్యచకితులను చేస్తాడు.

07/17/2017 - 03:14

మనదేశంతోపాటు మరికొన్నిచోట్ల చట్టసభలను ఇంగ్లీషు భాషలో ‘Parliament’ అని వ్యవహరిస్తారు. కానీ ఆ పదానికి మరో అర్థం కూడా ఉంది. గుడ్లగూబల గుంపును కూడా ఆంగ్లంలో ‘పార్లమెంట్’ అని పిలుస్తారు. గ్రీకు ఇతిహాసాల్లో మేధస్సుకు అధిదేవతగా ‘అథెనా’ను కొలుస్తారు. ఆమెకు సంకేతంగా గుడ్లగూబను సూచిస్తారు. తెలివైనవారి లేదా జీవుల సమూహాన్ని పార్లమెంట్‌గా పిలవడంలో బహుశా అంతరార్థం అదే అయి ఉంటుంది.

07/15/2017 - 21:37

అతను యువకుడుగా ఉండగానే రాజయ్యాడు. చిన్నతనం నుండి గొప్ప ఆధ్యాత్మికవేత్త అయిన గురువు దగ్గర విద్యాభ్యాసం చేశాడు. దానివల్ల ఆ రాజు యవ్వనంలో వున్నా అతనిలో కొంత వైరాగ్య భావన ఉండేది.

07/15/2017 - 21:34

సంతోషించే మిత్రులతో శ్రీమంతుడైన రాముడు రధాన్ని ఎక్కి జెండాలతో అలంకరించబడి, ఉత్తమమైన అగరు, చందన సువాసనలతో, అనేక మంది ప్రజలతో నిండి ఉన్న నగరాన్ని చూశాడు. అగరు పొగతో నిండిన రాజమార్గంలో ప్రయాణించాడు. ఆ దారి ఇరువైపులా మేఘాల్లా ఎతె్తైన తెల్లటి భవనాలతో వెలిగిపోతోంది.

07/15/2017 - 21:32

ఫ్రశ్న: ఆహార కల్తీలకు విరుగుడు మందు ఏమైనా చెప్తారా?
-కింగ్ జార్జి, సికిందరాబాద్
జ: ఆహారంలో రుచికే తప్ప నాణ్యతకు ప్రాముఖ్యం ఇవ్వలేని బలహీనత మనలో ఉండటమే కల్తీదారులకు లోకువ. ఆహారంలో తక్కువ నాణ్యత కలిగిన వాటిని కలపటం, రంగు, రుచి, వాసనల కోసమూ, నిల్వ చేయటం కోసమూ విష రసాయనాలను వాడటం, ప్రమాదకరమైన రీతిలో వండటాన్ని ‘ఆహార కల్తీ’ అంటారు.

07/13/2017 - 21:42

మనసుంటే మార్గం వుంది అంటారు పెద్దలు. ఏదైనా పనిని కచ్చితంగా చేద్దామని అనుకుంటే ఆ పనిని కచ్చితంగా చేస్తాం. మన మనస్సు ఆ దిశగా పనిచేస్తుంది. తలంపు శక్తి (విల్ పవర్) అని అంటాం. ఈ శక్తి ఏర్పరచుకోవాలంటే మన మనస్సులో ఆ పని కచ్చితంగా చేద్దామని వుండాలి. అది కచ్చితంగా వుంటే ఈ పనులన్నీ మనం చేస్తాం.
* మన మార్గంలో వచ్చే ఆటంకాలని మనం తొలగించుకుంటూ ప్రయాణం చేస్తాం.

07/10/2017 - 00:20

FLOCK

రామచిలుకల
సమూహాన్ని ఇంగ్లీష్‌లో FLOCK అని పిలుస్తారు. కొన్ని ఇతర రకాల పక్షుల సమూహాల్ని కూడా ఇలా పిలుస్తూ ఉంటారు.

07/10/2017 - 00:19

దారి ఏది?

Pages