S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

02/19/2017 - 00:05

ప్రాచీన యుగాల్లో మన పురాణాల్లో జనక మహారాజును గొప్ప జ్ఞానిగా భావిస్తాం. ఆయన మహారాజయినా నిత్యం తత్వ చింతనలో, జ్ఞాన చర్చల్లో మునిగి ఉండేవాడు. దేశదేశాల నుండి ఆయన దర్శనం కోసం ఎందరో మహా పురుషులు వచ్చేవాళ్లు.
నిరంతర జ్ఞాన చింతనతో, బ్రహ్మజ్ఞాన అనే్వషణలో జనక మహారాజు మునిగి ఉండేవాడు. దేనినయినా, ఎప్పుడయినా వదులుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాడు. ప్రపంచ అశాశ్వతత్వాన్ని తెలిసిన మహాజ్ఞాని ఆయన.

02/19/2017 - 00:02

ఈ ప్రపంచం అతిపెద్ద వింతల నిలయం. ఇక్కడ జరిగే కొన్ని సంఘటనలను విశే్లషించి, విశదీకరించడానికి గొప్పగొప్ప మేధావులకు కూడా శక్తి చాలదు. దీనికి ప్రత్యక్ష నిదర్శనమే ఉత్తరప్రదేశ్‌లోని దియోరియా జిల్లాలో గల రుద్రపూర్ పట్టణంలో ఉన్న శివలింగం. మన దేశంలో దాదాపు అన్నిచోట్లా మనకు శివాలయాలు కనిపిస్తాయి. అందులో ప్రత్యేకతేం లేదు.

02/12/2017 - 04:08

ఏమండీ... వింటున్నారా?’’
ఏదో ఆలోచిస్తున్నవాడల్లా శ్రీమతి పద్మజ కేకతో ఈ లోకంలోకి వచ్చాడు విరాజ్
‘‘ఆ... వింటున్నా... చెప్పు’’
‘‘మీకు మరీ మొబైలు పిచ్చి ఎక్కువై ఇంట్లో విషయాలు అస్సలు పట్టించుకోవట్లేదు’’
‘‘వాట్సప్‌లో ఆఫీసువాళ్లులే... ఇంతకీ ఏమైందో చెప్పు’’ విసుగ్గా అడిగాడు.
‘‘మీరేమో వాడ్ని ఆ బోర్డింగ్ స్కూలులో చేర్చారు, నేను వద్దన్నా వినకుండా’’

02/12/2017 - 04:06

మీకో ప్రశ్న

ఈ ఐదుగురు భక్తుల్లో ఎవరు
రాముడి దాసులో చెప్పగలరా?
1. రామదాసు, 2. కబీర్‌దాసు, 3. తులసీదాసు,
4. సూరదాసు, 5. పురందర దాసు

02/12/2017 - 00:26

జీరంగి శాస్ర్తీ పేద బ్రాహ్మణుడు. ఉదయం నించీ సాయంత్రం దాకా బిచ్చమెత్తుకుని జీవించేవాడు. సాయంత్రానికి ఇంటికి చేరేవాడు. బిచ్చమెత్తిన ధాన్యాన్ని భార్యకు ఇచ్చేవాడు. ఆమె ధాన్యాన్ని పిండి చేసి రొట్టెలు చేసేది. వాళ్ళిద్దరే. వాళ్లకు పిల్లల్లేరు. అతని భార్య తెలివైంది. పిండితో రొట్టెలు చేసేది. ఐతే నాలుగు రొట్టెలు ఎప్పటికైనా పనికి వస్తాయని దాచి ఉంచేది. తాను రెండు తిని రెండు రొట్టెలు భర్తకు పెట్టేది.

02/11/2017 - 21:18

బాతులు చాలా గమ్మత్తుగా ఉంటాయి. వాటి జీవనం ఎక్కువగా నీటిలోనే ఉంటుంది. అవి ఎప్పుడైతే నీటినుంచి బయటకు వస్తాయో అప్పుడు వాటి రెక్కలను విదిలించి నీటిని తొలగించుకుంటాయి.

02/05/2017 - 01:18

శునశే్శపుడితో వెళ్తూ అంబరీషుడు మధ్యాహ్నం పుష్కర క్షేత్రంలో విశ్రాంతి తీసుకున్నాడు. అప్పుడు దాహంతో, అలసటతో ఉన్న శునశే్శపుడు ఇతర ఋషులతో కలిసి తపస్సు చేసుకునే విశ్వామిత్రుడ్ని చూసి, ఆయన ఒడిలోకి వెళ్లి చెప్పాడు.

02/05/2017 - 01:15

కడ్పల్‌లోని ప్రాథమిక పాఠశాల ముందు బైక్ ఆపాడు మోహన్.
‘కొత్త సార్.. కొత్త సార్’ అంటూ పిల్లలు కేకలు పెడుతూ మోహన్ సార్ చుట్టూ మూగారు.
‘హుష్.. ఏయ్.. అల్లరి వద్దూ’ అని పాఠశాల ఆఫీస్‌లోనికి వెళ్లాడు.

02/04/2017 - 23:57

కర్ణాటకలోని అడవుల్లోంచి ఏనుగులొచ్చి తన పొలాన్ని పాడుచేస్తున్నాయని ఆంధ్ర ప్రాంతంలోని ఒక రైతు తన పొలంలో గొయ్యితీసి, పైన చెరకు మొక్కలు దొంగ పొలంగా పాతాడు. ఆ రాత్రి ఒక ఏనుగు పిల్ల వచ్చి ఆ గోతిలో పడింది. మర్నాడు ఆ రైతు వచ్చి దాన్ని పైకి లాగటంలో దాని కాలు విరిగింది. ఆ రైతు దాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఆ ఏనుగు పిల్ల ఒక వారం పాటు లేవలేక, తిండి నీళ్లు లేక యాతన పడింది.

02/04/2017 - 23:49

కుల నిర్మూలన ఆశయంతోనో
కులరహిత సమాజం కోసమో ఆరాటపడుతూ
గొప్ప ఆకాంక్షతో ఉద్యమ సారధులను కీర్తిస్తూ
శతజయంతులూ, వర్ధంతులూ
అంగరంగ వైభవంగా జరుపుతూ
వేదికల్ని దద్దరిల్లజేస్తూ
కుటుంబంలోనూ బంధువుల మధ్యా
కులగజ్జిని సవరించుకుంటూనే ఉన్నాం

Pages