S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

01/21/2017 - 23:03

సీతాపురం ఒక చిన్న గ్రామం. అందులో ఒక పాఠశాల ‘విజ్ఞాన మందిరం’. ఆ ఊరికి అది ఒక్కటే పాఠశాల. అందులో రామారావు ఒక మాస్టారు మాత్రమే. అయితే అతనికి పాఠశాలే ప్రపంచం. అందులోని విద్యార్థులే తన సొంత పిల్లలుగా భావించేవాడు. వారిలోని లోటుపాట్లను గమనించి, సరిదిద్ది, వారిని ఉత్తమ విద్యార్థులుగా మార్చటానికి ఎంతో కృషి చేసేవాడు. ఇతర గురువులు ‘నీకెందుకీ హైరానా?’ అని అన్నా వినేవాడు కాదు.

01/21/2017 - 22:39

దేవీ భాగవతంలో, దేవీ పురాణంలో, కాళికా పురాణంలో, యోగినీ తంత్రంలో, హేవజ్ర తంత్రంలో, తంత్ర చాముండామణిలో, కామరూప (గువాహటి) జిల్లాలోని శ్రీ కామాఖ్యాదేవి గురించిన సాహిత్య చర్చ (8వ శతాబ్దం), తాంత్రిక పూజా విధానంలో ముఖ్యమైనదిగా, యోగినీ తంత్రంలో, కాళికా పురాణంలో కామాఖ్యా దేవిని శాక్త తంత్రంగా అభివర్ణించారు.

01/08/2017 - 05:29

అనగనగా అడవిలో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు మీద ఒక కాకి తన ముగ్గురు పిల్లలతో కలసి నివసించసాగింది. కొంతకాలానికి ఆ మూడు కాకి పిల్లల్లో రెండు కాకులు ఉదయానే్న బయటికి పోయి వేటి ఆహారం అవే సంపాదించుకునేవి. మూడవది మాత్రం ఎగరగలిగినా బయటికి వెళ్లకుండా గూట్లోనే ఉండిపోయేది. పోనీలే చిన్నపిల్ల కదా అని తల్లి కాకి దానికి ఆహారం తెచ్చి ఇచ్చేది. క్రమేణా దానికి బద్దకం ఎక్కువని గ్రహించింది తల్లి కాకి.

01/08/2017 - 01:34

కోన్ని ప్రకృతి నియమాలుంటాయి. జీవితానికి సంబంధించిన ధర్మాలుంటాయి. వాటిని అతిక్రమించటానికి ఎవరికీ వీలుపడదు. చివరికి ఆ నియమాల్ని, ధర్మాన్ని సృష్టించిన దైవానికైనా వాటిని దాటడానికి వీలుపడదు. దానే్న కర్మ అని కూడా అంటారు.

01/08/2017 - 01:02

మీకో ప్రశ్న

పరశురాముడు తపస్సు చేసిన స్థలం ఎక్కడ ఉంది?

గత వారం ప్రశ్నకి జవాబు

ఉజ్బెకిస్థాన్, తజకిస్థాన్,
కజకిస్థాన్, దాటి ఇరాన్ దాకా.

01/07/2017 - 22:22

చాలా విషయాల్లో మన అభిప్రాయాలతో ఇతరులు ఏకీభవించకపోవచ్చు. అదే విధంగా ఇతరుల అభిప్రాయాలతో మనం కూడా ఏకీభవించకపోవచ్చు. ఏకీభవించకపోయినా గౌరవించాలి. ఈ అభిప్రాయంతో చాలాకాలం నుంచి చాలా మంది ఉన్నారు. కానీ ఈ ఫేస్‌బుక్‌ల కాలం వచ్చిన తరువాత ఈ పరిస్థితి మారిపోయింది. తమ అభిప్రాయాలతో ఏకీభవించని మిత్రులని చాలామంది అస్నేహితునిగా మారుస్తున్నారు.

12/31/2016 - 19:43

కొత్త సంవత్సరం వస్తుందంటే ఎన్నో ప్రణాళికలు వేస్తుంటారు. కానీ అవి పూర్తి చేయక ముందే కొత్త సంవత్సరం పాతబడిపోతుంది. మరో కొత్త సంవత్సరం వస్తుంది.
కొత్త సంవత్సరం అయినా పాత సంవత్సరం అయినా అందరూ కోరుకునేది ఒక్కటే అదే ‘సంతోషం’.

12/31/2016 - 19:04

శతానందుడు రాముడికి విశ్వామిత్రుడి గురించి చెప్పేది ఇలా కొనసాగించాడు.

12/31/2016 - 19:02

పాత నీరుపోయి కొత్త నీరురావాల్సిందే! పాత జ్ఞాపకాల దొంతరలకు మరొ కొత్త పొర చేరాల్సిందే! అందుకే కొత్త ఎప్పుడైనా కొత్తేననడం నానుడి. కొత్తదనంలో ఉన్నంత తీయదనం, రుచిచూసిన పాతదనంలో ఉండదు. కొత్త రుచులు, కొత్త సినిమాలు, కొత్త ప్రపంచం, విశ్వ గతిని మార్చే కొత్త ఆవిష్కరణలు, మనిషి ఆలోచనలను రోదసీ లోతుల్లోకి తీసుకెళ్లే సరికొత్త పరిశోధనలు.. ఇలా దేనిపైనైనా ఆసక్తి పెరగాలంటే, అనురక్తి ఇనుమడించాలంటే..

12/31/2016 - 18:57

రాజయ్య ఆ ఊరిలో అంతో ఇంతో ఉన్నవాడు. మంచి మనసున్నవాడు అని పేరుంది. అందరూ అతడిని గౌరవిస్తారు. అతనికి లేకలేక కలిగిన ఒకే ఒక్క కొడుకు శ్రీహరి అంటే ప్రాణం. అల్లారుముద్దుగా పెంచుకొన్నాడు. గారాబం చేశాడు కూడా. దీంతో శ్రీహరికి ఆడింది ఆట పాడింది పాటగా సాగింది. శ్రీహరి పెరిగి పెద్దవాడవుతూనే.. ఇంట్లో గారాబం కారణంగా చెడు వాసాల వైపు మళ్లాడు. చదువు వొంటబట్టలేదు. ఏదైనా పని చెయ్యాలన్న ధ్యాస లేదు.

Pages