S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

12/31/2016 - 18:37

సత్యకామ జాబాలి శిష్యుడు ఉపకోశలుడు. ఎందరో శిష్యులు సత్యకామ జాబాలి ఆశ్రమంలో వుండేవాళ్లు. ఉపకోశలుడు ప్రత్యేకమైనవాడు. తన దగ్గర చేరిన శిష్యులకు విద్యాబుద్ధులు నేర్పించి సత్యకామ జాబాలి వాళ్లని వాళ్ల ఇంటికి పంపేసేవాడు. సంవత్సరం ఉండి కొంతమంది, రెండేళ్లు ఉండి మరి కొంతమంది, మూడేళ్లు ఉండి కొంతమంది విద్య ముగించుకుని వెళ్లేవాళ్లు.

12/25/2016 - 00:39

మా ఊరి రోడ్డు మీద, చౌరస్తాలలో విగ్రహాలు తక్కువ. రోడ్డు మీద ఓ ఇంటి మూల మీద ఓ జైనుని విగ్రహం ఉండేది. ఆ విగ్రహాన్ని చూసినప్పుడల్లా ఎన్నో ప్రశ్నలు మాలో ఉదయించేవి. పెద్దవాళ్లతో మాట్లాడి మాలో వచ్చిన ప్రశ్నలకి జవాబులని వెతుక్కునేవాళ్లం.

12/25/2016 - 00:38

ఏ వ్యక్తి పవిత్రమైన ఆలోచనలతో మాట్లాడినా లేక పనిచేసినా ఎప్పటికీ
విడువని నీడలాగా ఆనందం అతని వెన్నంటే ఉంటుంది.

12/24/2016 - 22:32

ఆ రోజు ఆశే్లష హరికథకి వెళ్లిన నిమిషానికే హరిదాసు కథని చెప్పడం ఆరంభించాడు. ఆశే్లష అందరితోపాటు శ్రద్ధగా విన్నాడు.
‘రాముడ్ని చూడగానే గౌతముడి పెద్ద కొడుకు సదానందుడి శరీరం గగుర్పాటు చెందింది. విశ్వామిత్రుడు చెప్పింది విని అతను ఇలా ప్రశ్నించాడు.

12/24/2016 - 22:17

ఒక రైతు కొడుకు పదేళ్లవాడు పొలం పక్కన ఆడుకుంటున్నాడు. వాడికి ఆ పొలంలో ఒక ఎర్రటి గుండ్రపు రాయి దొరికింది. దాన్ని గోళీకాయలా ఆడుకుంటున్నాడు. ఆ దారిన వెళ్తున్న ఒక రత్నాల వ్యాపారి ఆ కుర్రాడు ఆ రాయితో గురిచూసి వేరొక బండను కొట్టడం చూశాడు.
‘బాబూ! ఈ రాయి నీకు ఎక్కడ దొరికింది?’ అని అడిగాడు.
‘మా పొలంలో’ అన్నాడు కుర్రవాడు.
అది మామూలు రాయి కాదు. వజ్రం అని వ్యాపారి పోల్చుకున్నాడు.

12/24/2016 - 22:10

ప్రపంచాన్ని మనం పరిశీలిస్తే అందరూ దైవచింతన వున్నవాళ్లే మనకు కనిపించరు. మనం ఈ సృష్టిలో నాగమని, అనంతశక్తి మనల్ని నడిపిస్తోందని, దానికి మనం అవనతం కావాలని కొంతమందే భావిస్తారు. జీవితంలో జనన మరణాలు దైవ ప్రసాదాలుగానే వాళ్లు స్వీకరిస్తారు.

12/18/2016 - 05:59

ప్రేరణకు ఎందుకు
దూరం అవుతారు?

ఉద్యోగులు ప్రేరణకు దూరం అవడానికి
అనేక కారణాలు ఉంటాయి.

12/18/2016 - 04:50

ఆ యువకుడు అమాయకుడు. చిన్నప్పుడే అతని తల్లిదండ్రులు చనిపోయారు. అతనికి వున్న ఆస్తి అంతా ఒక పాడుపడిన ఇల్లు. ఏవో చిన్న పనులు చేసుకుంటూ జీవించేవాడు. ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడు. నవ్వేవాడు. నవ్వించేవాడు. అందరికీ తలలో నాలుకలాగా మెలిగేవాడు.

12/18/2016 - 02:26

ఆ రోజు ఆదివారం. ఐదవ తరగతి చదువుతున్న చింటూ టీవీ చూస్తూ కూర్చున్నాడు. చింటూ అమ్మ సాయంత్రం టిఫిన్ కోసం దోసెల పిండి కలుపుతోంది.
ఇంతలో తలుపు తట్టిన చప్పుడైంది. ‘చింటూ! నాన్న వచ్చినట్లున్నారు. చూడు’ అన్నది.
చింటూ లేచి తలుపు తెరచి చూసి కెవ్వున అరిచాడు.
ఎదురుగా కోతి నిలబడి ఉంది. అది గభాలున ఇంట్లోకి వచ్చి గినె్నలన్నీ వెతికింది. చింటూ అమ్మకి ఏం చేయాలో తోచలేదు. పెద్దగా అరిచింది.

12/18/2016 - 02:20

వృషణాలు పడిపోయిన దేవేంద్రుడు ఋషులు, చారణులతో, అగ్ని మొదలైన దేవతలతో ఇలా చెప్పాడు.
‘గౌతముడికి కోపాన్ని, అతని తపస్సుకి విఘ్నాన్ని కలిగించాను. అలా అతను నాకు, అహల్యకి శాపాలు పెట్టడం ద్వారా అతని తపశ్శక్తిని ఖర్చు చేసేశాను. ఇప్పుడు మీరు తిరిగి నాకు వృషణాలు వచ్చేలా చేయండి’

Pages