S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

03/23/2019 - 19:57

అటతి యద్భవానహ్ని కాననం
త్రుటిర్యుగాయతే త్వామపశ్యతామ్
కుటిల కుంతలం శ్రీముఖం చ తే
జడ ఉదీక్షతాం పక్ష్మకృద్దృశామ్ ॥
15

03/23/2019 - 19:53

తెలుగులో రాయటమన్నా, మాట్లాడటమన్నా చాలా కష్టం అనే భావం మనలో చాలామందిలో ఉంది. అందుకనే, ఎందుకొచ్చిన గొడవనీ, తేలిగ్గా ఉంటుందనీ శుభ్రంగా ఇంగ్లీషులో మాట్లాడేసుకుంటాం. ఆ ఇంగ్లీషు అయినా బాగా మాట్లాట్టం, రాయటం వచ్చా అంటే అదీ లేదు. ఏదీ, ఇంగ్లీషులో మంచి కథ కానీ, నవల కానీ రాసిన తెలుగు వాళ్లని చూపించండి. నూటికో, కోటికో ఒక వ్యక్తి ఉంటే ఉండొచ్చేమో కానీ నాకు ఇప్పటి వరకు ఎవ్వరూ తారసపడలేదు.

03/23/2019 - 19:45

సనాతనము అనగానేమి? హిందుత్వము సనాతన ధర్మమా? సనాతన మతమా? ధర్మము అంటే? సనాతన సత్యధర్మము అంటే ఏమిటి? వేద సహిత సనాతన ధర్మం ఎట్లు ఏర్పడింది?

03/23/2019 - 19:03

ఆమె అంటే
ఎందుకో ఎలానో
తెలీని అభిమానం

చూసిన కళ్లు
పదేపదే పాపలపై
కదలాడే ఆమెని
రెప్పలమాటున దాచేస్తున్నాయి

ఆమె రెటీనా నుండి
మనసు కేంద్ర లోలకంలో
అలాఅలా ఊగుతూ
స్థిర నివాసమేర్పరచుకుంది

అస్థిరం కాదిక
మరోమాటే లేదిక
ఆమెదే ఆ స్థానం
పదిలమిక
తొణకని మనసు

03/23/2019 - 18:37

మౌనం
ఓ పదునైన ఆయుధం!
మాటల్లేని
విజ్ఞాన సర్వస్వం!
వౌనంగా మెరుస్తున్నందుకే కాబోలు...
చుక్కలంత అందంగా కనిపిస్తాయి!
వౌనంగా వెనె్నల కురిపిస్తున్నందుకే కావొచ్చు...
చంద్రునికంత ప్రకాశం!
భాషంటూ లేనిది
వౌనం!
మానవ సంబంధాలకు
ఆలంబనగా నిలిచేదీ వౌనమే!
మాట జారి...
చేటు తెచ్చుకోకుండా ఉండాలంటే...
వౌనాన్ని ఆశ్రయించక తప్పదు!

03/23/2019 - 18:36

సాహిత్యం
సరసమైన, సరళమైన సత్యం
అనునిత్యం ఫాఠక లోకాన్ని
అలరించి చేస్తున్న నృత్యం
ప్రాచీనమైనా, ప్రస్తుతమైనా
సత్యం సత్యమే
కవి సర్వ స్వతంత్రుడు
సమాజాన్ని చూసి భయపడడు
తాననుకొన్నది సహజంగానే
చిత్రీకరించి ఏదో ఓ పత్రికలో
చిత్రిక పడుతూనే ఉంటాడు
గరళమైనా, అమృతమైనా
ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి
అవుతుంది ప్రజానీకం

03/16/2019 - 22:01

చాలామందిలో సృజనాత్మకత ఉంటుంది.
కొంతమందిలో కథలో రాసే నేర్పు, మరి కొంతమంది కవిత్వం రాసే ఉత్సాహం ఇలా ఎన్నో..
బొమ్మలు కావొచ్చు.
పాటలు పాడటం కావొచ్చు.
ఇట్లా ఎన్నైనా చెప్పవచ్చు.
వారిలో వున్న ఉత్సాహాన్ని చాలా మంది తొక్కివేస్తారు. అణచివేస్తారు.

03/16/2019 - 19:59

తెలంగాణలో కాన్వాసుపై కన్నా ముందు సిల్క్ వస్త్రంపై దేశీయ రంగులతో చిత్రాలు గీశారు. రాచరికం రోజుల నుంచి ఈ మాధ్యమంలో చిత్రకళ పరిఢవిల్లింది. ఇప్పటికీ ఆ వారసత్వం హైదరాబాద్ పాత నగరం (ఓల్డ్ సిటీ) దూద్‌బౌలి (పాలబావి) ప్రాంతంలోని ఓ వీధిలో కొంత కనిపిస్తుంది. ఆ వీధి పేరే ‘నక్కాశీగల్లీ’. నాజూకుతనం, నయనానందకరం, సృజనాత్మకత, నాణ్యత, నైపుణ్యం ఆ చిత్రాల్లో దర్శనమిస్తుంది.

03/16/2019 - 19:43

కొత్త మాటలని పుట్టించటం అనేది నేనిప్పుడు కొత్తగా సృష్టించిన ప్రక్రియ ఏమీ కాదు. కొత్త పదాల అవసరం అలా పుట్టుకొస్తూనే ఉంటుంది. ఈ విషయం గురించి నేను ఇది వరలో - వ్యాసాలలోను, బ్లాగులలోను - ఎన్నో కోణాల నుండి చర్చించాను. ఇప్పుడు మరొక కోణం నుండి పరిశీలిద్దాం. ఉదాహరణకి ఈ దిగువ జాబితాలో తెలుగు పేర్లు చూడండి. మిరప, సపోటా, సీతాఫలం, రామాఫలం, బొప్పాయి, జామ, మొక్కజొన్న, పొగాకు, బంగాళాదుంప మొదలైనవి.

Pages