S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

10/28/2016 - 23:17

మా మిత్రునికి సైన్స్ చదువు ఇష్టం లేదు. కానీ వాళ్ల నాన్నకి డాక్టర్ చదివించాలని కోరిక. అందుకని ఇంటర్మీడియెట్ (సైన్స్ గ్రూప్)లో చేర్పించాడు వాళ్ల నాన్న. అత్తెసరు మార్కులతో ఇంటర్మీడియెట్ పాసయ్యాడు. బిఎస్సీ చదివిన తరువాత డాక్టరీ చదివిద్దామని బిఎస్సీలో చేర్పించాడు మళ్లీ వాళ్ల నాన్న. ఇప్పటి పిల్లల్లా తాము ఏమి చదవాలని అనుకుంటున్నారో అలా చెప్పే పరిస్థితి అప్పుడు లేదు.

10/28/2016 - 23:16

ఆరుసార్లు భూ ప్రదక్షిణం చేయడం.. వందసార్లు సముద్ర స్నానం చేయడం
వేయిసార్లు కాశీలో గంగాస్నానం చేయడం.. ఇలాంటి వాటి వలన కలిగే పుణ్యం..
తల్లిని భక్తిపూర్వకంగా ఒక్కమారు.. నమస్కరిస్తేనే లభిస్తుంది.

10/23/2016 - 00:51

ఆరోగ్యం బాగులేని వ్యక్తులను మార్పు కోసం స్థల మార్పు చేయమని సలహా ఇస్తారు. ఒత్తిడిలో వున్న వ్యక్తులు అలా బయటకు మార్పు కోసం వెళ్తుంటారు. స్థల మార్పు జరిగితే వాళ్ల ఆరోగ్యంలో, అదే విధంగా మానసిక ప్రవర్తనలో మార్పు వస్తుందని డాక్టర్లు చెబుతుంటారు.

10/23/2016 - 00:49

విశ్వాసం అనేది కొద్దిపాటి గాలికి వాలిపోయేది కాదు. అది అచంచలమైనది. హిమాలయాలంత స్థిరమైనది.

10/22/2016 - 22:56

సహోద్యోగుల్లో ప్రేరణ కల్గించడం కొంచెం కష్టమైన పని. ఎందుకంటే వారంతా మీతో సమాన హోదా గలవారు. పైగా మీ ఆజ్ఞలను, బోధనలను వినడానికి తయారుగా ఉండరు. అంతేకాదు తమకన్నా ఎక్కువ పలుకుబడి గలవారి మాటలు వినడానికి మాత్రమే ఇష్టపడతారు.
అసలు మీ మాటలు వినాల్సిన అవసరం వారికేంటి? పై అధికారులను కదిలించగల పలుకుబడి ఉండే మీ సహోద్యోగులు వారి ప్రాముఖ్యతను మాత్రమే చూసుకుంటారు.

10/22/2016 - 22:51

సుబ్బయ్య ఎగ్జిబిషన్‌కి వెళ్లి తన దగ్గర ఉన్న సగం సొమ్ముతో కేరమ్ బోర్డు కొన్నాడు. మిగిలిన సొమ్ములో 20% పెట్టి పిల్లలకి బుక్స్ కొన్నాడు. మిగిలిన సొమ్ములో 40% పెట్టి ఇతర తినుబండారాలు కొన్నాడు. మిగిలిన సొమ్ములో 30% పెట్టి కాఫీ బిస్కెట్లు తిన్నాడు. ఆటోలో ఇంటికి వెళ్లేసరికి మీటర్ 83 రూపాయలు అయింది. ఇంట్లోకెళ్లి జేబులో చూసుకుంటే ఒక్క రూపాయి మిగిలింది. ఎంత సొమ్ముతో సుబ్బయ్య ఎగ్జిబిషన్‌కి వెళ్ళాడు?

10/22/2016 - 22:49

మర్నాడు ఉదయం విశ్వామిత్రుడు రాముడికి తను ఇచ్చే అస్త్రాల వివరాలు ఇలా చెప్పాడు.

10/22/2016 - 22:41

పరమాణువు, పరమాణు అంతర్భాగాల స్థాయిలో పదార్థం ప్రవర్తించే తీరును అధ్యయనం చేసే శాస్త్ర విభాగమే ‘క్వాంటమ్ మెకానిక్స్’. సంప్రదాయ భౌతిక శాస్త్రం కొన్ని దృగ్గోచర విషయాలను వివరించటంలో విఫలమైన పరిస్థితిలో 1920ల్లో ఈ శాస్త్రం వచ్చింది. సుప్రసిద్ధ భౌతిక శాస్తవ్రేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ తన సాధారణ సాపేక్ష సిద్ధాంతంలో భాగంగా ‘్ఫటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్’కు ఇచ్చిన వివరణలో మొదట ఈ శాస్త్రానికి నాంది జరిగింది.

10/22/2016 - 22:40

ఇంగ్లీషు భాషలో స్కూల్ అంటే పాఠశాల అని అర్థం కదా!. అది నిజమే. కానీ ‘స్కూల్’ అన్న పదానికి మరో అర్థం కూడా ఉంది. చేపపిల్లల సమూహాన్ని ‘స్కూల్’ అని పిలుస్తారు. శత్రువునుంచి రక్షణకు వేలాది చేపలు ఒకేచోట గుంపుగా తిరుగుతూంటాయికదా! ఆ గుంపును ఇంగ్లీషులో ‘స్కూల్’ అని పిలుస్తారు. ఒకరకంగా ఇది నామవాచకం. ఇది సాధారణంగా చేపలజాతిని ఉద్దేశించిన పదం.

10/22/2016 - 22:38

అనగనగా ఒక ఊరు. ఆ ఊరి పక్కనే ఒక ఏరు. ఆ ఏటిలో ఎప్పుడూ నీరు సమృద్ధిగా ఉండేది. ఆ ఊరి వారందరికీ అదే ప్రాణాధారం.
ఆ ఊరిలో సమ్మయ్య, సారయ్య అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. వారు చిన్ననాటి నుంచీ ప్రాణ స్నేహితులు. ఆ ఊళ్లోనే చదువుకొని అక్కడే ఉద్యోగాలు సంపాదించుకొని జీవనాన్ని కొనసాగిస్తున్నారు.
సమ్మయ్య, సారయ్య ఇళ్లు పక్కపక్కనే ఉండేవి.

Pages