S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

10/08/2016 - 23:18

1945 డిసెంబర్‌లో మిల్టన్ రెనాల్డ్స్ బాల్‌పాయింట్ పెన్‌ను రూపొందించి అమెరికాలో ప్రవేశపెట్టాడు. దానిలోని కొన్ని లోపాలను పాల్ సి ఫిషర్ తొలగించి సంపూర్ణం చేశాడు. పారిశ్రామికవేత్త అయిన ఫిషర్ ఈ కొత్త వ్యాపారంలోకి ప్రవేశించాడు. పాల్ విశ్వాసం అతని మాటల్లోనే. ‘బాల్‌పెన్ పరిశ్రమలో సాంకేతిక తొలి వ్యక్తిగా మంచి పెన్ ప్రజలకు అందిస్తాను.’ 1948లో ఆయన చిన్న పెన్‌ను డిజైన్ చేశారు.

10/08/2016 - 22:31

మా భీమన్న గుడిలో ఓ తోట వుండేది. దాని తోటమాలి పోచెట్టి. గుడిలో పూచిన పూలని తెంపి రాజరాజేశ్వర స్వామికి పంపించడం, ఆ తోటని జాగ్రత్తగా చూడటం అతని విధి. ఆ తోటలో రెండు జామచెట్లు తప్ప అన్నీ పూల చెట్లే.
ఇంట్లో పిల్లలని చూసినంత ప్రేమగా ఆ చెట్లని చూసుకునేవాడు. బాగా పూలు పూచినప్పుడు అతని మనస్సు పొంగిపోయేది.

10/08/2016 - 22:28

దయార్ద్ర హృదయంతో ఇతరులకు మేలు చేయడం మంచిదే కానీ,
సర్వజీవులను భగవత్ స్వరూపులుగా భావించి సేవించడం ఇంకా మంచిది.

10/08/2016 - 21:36

ఇతరులకు తమకు తెలిసిన విషయాలు చెప్పే అవకాశం ప్రతి ఒక్కరికి వస్తుంది. అప్పుడు ప్రతి ఒక్కరు తమకు తెలియకుండానే ఉపాధ్యాయుడు పాత్రలో ప్రవేశిస్తూ ఉంటారు. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి శిక్షణ ఇవ్వాల్సి వస్తుంది. లేదా మీకు ఇష్టమైన క్రీడల గురించి ఇతరులకు చెప్పాల్సి వస్తూ ఉంటుంది.
తరగతి గదిలో పాఠాలు చెప్పడం మాత్రమేగాక, ఇతరులకు తరగతి గది ప్రమేయం లేకుండా విషయాలు చెప్పవలసిన పరిస్థితులు వస్తాయి.

10/08/2016 - 21:22

మానవులు తమ నిత్య జీవితంలో ఎప్పుడూ ఆరాటాలు, పోరాటాలతోనే సతమతమవుతూ ఉన్నారు. అటువంటి వారిని ఆదుకుని నిలిచిన వారినే ఆరాధిస్తారు. దైవీశక్తిగా పరిగణిస్తారు. ఆ శక్తిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. తమ జీవితాలలో చీకట్లు తొలగి వెనె్నల కాంతులు విరజిమ్మాలని కాంక్షిస్తారు. అటువంటి వెలుగులు ప్రసాదించేది శరదృతువు.

10/08/2016 - 21:10

పండుగలు, ఉత్సవాలు, ఆచారాలు దేశంలో ఎన్నో ఉన్నాయి. పండుగలు అంటేనే సంతోషాన్ని తెచ్చి పెడతాయి. అయితే బన్ని ఉత్సవం మాత్రం భయాన్నీ, గగుర్పాటును కలిగిస్తాయి. రక్త్ధారల మధ్య జరిగే బన్ని ఉత్సవాన్ని భక్తులు ఎంతో భక్తిప్రపత్తులతో జరుపుకుంటారు. వందల సంవత్సరాల నుంచి ఈ ఆచారం కొనసాగుతూనే ఉంది. కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ దేవరగట్టులో జరిగే బన్ని ఉత్సవం భక్తి, భయం మధ్య సాగుతుంది.

10/02/2016 - 05:34

ఉత్తర అట్లాంటిక్, ఉత్తర అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో కన్పించే సీబర్డ్...గనె్నట్. సముద్ర తీర ప్రాంతాల్లో జీవించే ఈ పక్షి మిగతా సముద్ర పక్షులకన్నా భిన్నమైన లక్షణాలతో ఉంటుంది. వీటి కళ్లు బైనాక్యులర్ విజన్‌కు వీలుగా ముఖంపై చాలా దిగువకు ఉంటాయి. వీటి నాసికారంధ్రాలు ముఖం లోపలిభాగంలో ఉంటాయి. ముఖం, ఛాతీలో చర్మం వెనుక గాలిసంచులుంటాయి.

10/02/2016 - 00:23

సుమతి బాగా పాటలు పాడుతుంది. చాలా కచేరీలు ఇచ్చేది. కానీ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైంది. పాటలు పాడటం ఆపేసింది. ఓ సంవత్సరం పాటు బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఆమె జీవితంలో గొప్ప గాయని కావాలని అనుకొంది. అనారోగ్యం వల్ల సాధన పూర్తిగా పోయి తాను పాట పాడలేనన్న స్థితికి వచ్చేసింది. జీవితం మీద నిరుత్సాహం వచ్చేసింది. బతకాలన్న కోరిక కూడా తగ్గిపోయింది.

10/02/2016 - 00:19

జీవితమంటే జననానికి మరణానికి మధ్య ఉన్న చిన్న ఖాళీ మాత్రమే.
ఈ చిన్న ఖాళీలో మీరు వీలైనంత వరకు సంతోషంగా ఉండండి.

10/01/2016 - 02:55

ఇటలీ దేశపు ప్రొఫెసర్ లూగీ గల్వానీ పరిశోధనలను గూర్చి చదివిన ఆ దేశపు భౌతిక శాస్తవ్రేత్త ఆలెసాండ్రో వోల్టా ఎంతో ఉత్తేజితుడయ్యాడు. ఎలక్ట్రోస్టాటిక్ ఛార్జ్ చేసిన ఫలకాన్ని కప్ప నాడులను స్పర్శించగానే దాని కండరాలు సంకోచిస్తాయని గల్వానీ గుర్తించాడు. దీనిని ఆధారం చేసుకుని ఆయన కప్ప శరీరంలో కొంత మొత్తంలో విద్యుత్ ఉంటుందని సిద్ధాంతీకరించాడు. గల్వానీ ప్రకటించింది అసత్యమని నిరూపించేందుకు వోల్టా పూనుకున్నాడు.

Pages