S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

07/30/2016 - 21:55

ఎంత చదివామన్నది కాదు
ఆ చదువు మనకు ఎంత
సంస్కారం నేర్పిందన్నదే ముఖ్యం.

07/24/2016 - 04:34

సజయ్ పుట్టిన రోజుకి వాడి అమ్మమ్మ నించి కొరియర్లో ఓ పెట్టె బహుమతిగా వచ్చింది. స్కూల్ నించి తిరిగి వచ్చిన సజయ్‌కి తల్లి దాన్ని చూపించి చెప్పింది.
‘నీ పుట్టిన రోజు వర్కింగ్ డే వచ్చిందని ఆదివారం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని ఆ రోజు తెరిస్తే బావుంటుందేమో’

07/24/2016 - 04:25

వెల్లంటి అనే ఊరిలో శివయ్య, సీతయ్య అనే వారు ఇరుగుపొరుగున ఉండేవారు. ఆస్థిపాస్తులు బాగానే ఉన్నాయి. అయినా వారికి స్వార్థం, పిసినారితనం మెండు. తమకు కలిగింది మరొకరికి పెట్టడం గానీ ఇతరుల కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం గానీ ఎరుగరు.

07/24/2016 - 01:43

మనకున్న దానిలో సంతృప్తి పడటం ఉత్తమమే కానీ...
మనకున్న జ్ఞానం చాలనుకోవడం అజ్ఞానం.

07/23/2016 - 22:44

‘మత్తు వదలరా నిదుర మత్తు వదలరా?’ అన్న సినిమా పాటలోని చరణం చదువుకునే పిల్లలు వున్న ఇంట్లో తరచూ విన్పిస్తుంటుంది. సినిమాలు చూసినప్పుడు, కథలు వింటున్నప్పుడు రాని నిద్ర చదువు పుస్తకం చదువుతుంటే వస్తుంది. దానికి కారణం చదువు మీద శ్రద్ధ, ఆసక్తి తక్కువగా ఉండటం.

07/18/2016 - 04:08

ఒక పాల వ్యాపారి ఇద్దరు పనివాళ్లను పనిలో పెట్టుకున్నాడు. రోజూ ఇద్దరూ పనివాళ్లు కలిసి పెద్ద పాల డబ్బాలను నింపుతారు. పెద్ద పనివాడికి 22 ఎం.ఎల్. జార్‌తో పాలను, వెంటనే చిన్న పనివాడు 25 ఎం.ఎల్.జార్‌తో నీళ్లను 20 లీటర్ల పెద్ద పాల డబ్బాలో ఒకేసారి నింపమనేవాడు. రోజూ అలాగే చేసేవారు. కానీ ఒక రోజు పెద్ద పనివాడు రావటం లేటైంది. ఈలోపుగా చిన్న పనివాడు 25 ఎం.ఎల్.

07/18/2016 - 03:58

పుట్టిన రోజుకి కొత్త బట్టలు కొనడానికి స్వస్తిశ్రీని తల్లి రెడీమేడ్ దుస్తుల దుకాణానికి తీసుకెళ్లింది. దాదాపు డజను డ్రెస్‌లని చూశాక ఒకటి స్వస్తిశ్రీకి నచ్చింది. కాని దాని ధర అందుబాటులో లేకపోవడంతో తల్లి దానికన్నా తక్కువ ఖరీదైంది కొన్నది.
‘నీ అంత పిసినారివి నువ్వే’ స్వస్తిశ్రీ తల్లిని అన్న మాటలు ఆ దుకాణంలోని అంతా విన్నారు.
ఆమె బదులు మాట్లాడకుండా డబ్బు చెల్లించి బయటకి వచ్చింది.

07/18/2016 - 03:52

మన సూర్యుడి లాంటి నక్షత్రాలు తమ జీవితకాలపు చివరి దశలో కుంచించుకుపోయి వైట్ డ్వార్ఫ్స్‌గా ఏర్పడతాయి. వాటిలో అప్పటిదాకా జరుగుతున్న న్యూక్లియర్ ప్యూజన్ నిలిచిపోవటం వల్ల ఇది జరుగుతుంది. వీటి సాంద్రత నీటితో పోలిస్తే లక్ష రెట్లు అధికంగా ఉంటుందని ఆర్థర్ స్టాన్లీ ఎడ్డింగ్టన్ అనే శాస్తవ్రేత్త 1920లో అంచనా వేశారు.

07/18/2016 - 03:52

అదొక అడవి. ఆ అడవిలో జంతువులన్నీ చాలా హాయిగా, నిర్భయంగా జీవిస్తున్నాయి. అంతా ఎవరి ఆహారం వారు సంపాదించుకుని తింటూ, తోటి వారికి సాయం చేస్తూ, కలిసి కబుర్లాడుకుంటూ, అన్ని జంతువుల పిల్లలూ కలివిడిగా ఆడుకుంటూ ఐకమత్యంగా ఉన్నాయి. దానికి కారణం ఆ అడవిలో పులులూ, సింహాలూ లేకపోవడమే.

,
07/16/2016 - 23:17

ఆర్ష సంస్కృతిలో ‘గురు’ స్థానానికి విశిష్ఠమైన స్థానం ఉంది. తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదే. గురువుకు నిర్వచనం చెబుతూ ‘అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానం ప్రసాదించేవాడనీ, నిర్గుణ పరబ్రహ్మ తత్త్వానికి వ్యక్తరూపమైన సగుణ బ్రహ్మ స్వరూపమే గురువు’ అన్నారు.

Pages