S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

05/23/2016 - 04:24

శంకరపల్లెలోని రామశర్మ తాను సకల శాస్త్ర పారంగతుడననీ, మహా పండితుడననీ గర్వంగా వుండేవాడు. ఊరిలోని వారందరిలో తానే ఉత్తమమైన వాడిననీ, తనకు ఎందులోనూ ఎవరూ సాటిరారని అనుకునేవాడు. పైగా పెద్దలు ఇచ్చిపోయిన ఆస్తిపాస్తులు, గుడిమాన్యాల వల్ల ఊరిలోని ధనవంతుల్లో కూడా అగ్రస్థానంలో ఉన్నాడు. అవన్నీ అతనికి వినయ విధేయతలు, మంచితనం నేర్పక అహంభావాన్ని నేర్పాయి. చిన్నతనం నుండే..

05/23/2016 - 03:39

క్రీ.శ.931లో గుజరాత్‌లోని సోమనాథ్ క్షేత్రం సమీపాన దైహక్‌కోట్ గ్రామంలో పుట్టిన నాగార్జునుడు గొప్ప రసాయనిక శాస్తవ్రేత్త. వైద్యుడు. ‘రసవాది’గా ప్రఖ్యాతుడు. తను దైవ ప్రతినిధిని అన్న ప్రచారానికి నాగార్జునుడు ఈ ఆస్కారం ఇచ్చాడు. ఆయన రచించిన ‘రసత్నాకరం’ అనే గ్రంథం తనకూ దేవతలకూ మధ్య సంభాషణ జరిగినట్టు తెలియపరుస్తుంది.

05/22/2016 - 01:00

ఆంజనేయులు (కరీంనగర్)
ప్రశ్న: మేము ఇటీవల ఒక ‘లే అవుట్’ వేశాం. కానీ అందులోగల స్థలాలను ఒక్కదాన్ని కూడా అమ్మలేక పోతున్నాం. దీనికి పరిష్కారం సూచించగలరు.
జ: దీనికి సంబంధించి కొన్ని ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా పరిష్కారం చేయవలసి ఉంటుంది.
దుర్గాదేవి (ఒంగోలు)
ప్రశ్న: ఆర్థిక పరమైన ఇబ్బందులు చాలా ఉన్నాయి. దీనికి కారణం మేము నివసించే ఇల్లేనా?

05/21/2016 - 22:38

డోంట్ ఫీడ్ ది ఏనిమల్స్-
గోడమీది ఆ బోర్డ్‌ని ఎవరూ చూడకుండా ఉండరు. తల్లిదండ్రులతో జూకి వచ్చిన రాజసిరి కూడా దాన్ని చూశాడు కాని ఏనుగుల ఎంక్లోజర్ దగ్గరికి వచ్చాక ఏనుగు పిల్లకి తన చేతిలోని వేరుశెనగ పప్పుని పెట్టాలని అనిపించింది. ఓసారి అటు, ఇటు తల తిప్పి చూశాడు. తనని ఎవరూ గమనించడం లేదని గ్రహించాక ఓ గుప్పెడు వేరుశెనగ పప్పుని పిల్ల ఏనుగు వైపు విసరబోయాడు.

05/21/2016 - 22:36

హరిత విప్లవం గాలి నుంచో, మబ్బు నుంచో ఊడిపడలేదు. దీని వెనుక ఎన్నో పరిశోధనలు, వాటి పొడిగింపు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నాయి. 1940-70ల మధ్యకాలంలో హరిత విప్లవానికి పునాదులు పడ్డాయి. హరిత విప్లవం వల్ల ప్రపంచవ్యాప్తంగా పంటల దిగుబడి పెరిగింది. ఈ పెరుగుదల 60’వ దశకం చివరలో ప్రారంభమైంది.

05/21/2016 - 22:32

స్పెయిన్‌లో ఒక ఉత్సవం జరుగుతుంది. అది మన దేశంలో కృష్ణాష్టమికి ఉట్టికొట్టే ఉత్సవం లాంటిది. దానిని ‘లామెర్సి’ అంటారు. దీనిని ‘కాటలోనియా సంస్కృతి’ అంటారు. ఉత్సవంలో ఉత్సాహవంతులంతా బృందాలుగా పాల్గొంటారు. వంద నుండి రెండు వందల మంది వరకూ ఉండే ఈ బృందంలోని వారు కలిసి అత్యంత ఎతె్తైన గోపురం నిర్మించాలి. ఏ బృందం ఎతె్తైన గోపురం నిర్మిస్తే వారే విజేతలుగా ప్రకటించబడతారు.

05/21/2016 - 21:46

మన జీవితాన్ని ఆనందంగా సుఖశాంతులతో గడపడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ప్రధానంగా మనిషి జీవితానికి చుక్కాని అతని ఆలోచనలే.
రిమనిషి తన ఆలోచనలతో శాంతి, ఆరోగ్యం, ధైర్యం, ఆశలతో మనసును సుసంపన్నం చేసుకోవాలి.
రిశత్రువులు అనేక కారణాలుగా తయారవుతారు. వారి మీద ద్వేషం పెంచుకుని పగ సాధించాలనే ధోరణి మొదలయితే శత్రువుకు జరిగే హానికన్నా మీకే ఎక్కువ హాని కల్గుతుంది.

05/21/2016 - 21:18

మొక్క నుంచి ప్రత్తిని పూర్వం మనుషులు చేతులతో తీసేవారు. 1793లో అమెరికాకు చెందిన ఇలీవిట్నీ ప్రత్తిని తీసే యంత్రాన్ని రూపొందించాడు. ఇందువల్ల ప్రత్తిని తీయడం, నేతకు అవసరమైన దారాన్ని తీయడానికి అవసరమైన రీతిలో దానిని పింజలు చేయడం సులభమైంది. ప్రతి చెట్టు కాయలో ఉండలు చుట్టుకొని ప్రత్తి గింజలు ఉంటాయి. ఈ ముడి ప్రత్తిని ఈ (జిన్) యంత్రంలో ఉంచితే విత్తనాల నుంచి పత్తిని అది వేరు చేస్తుంది.

05/21/2016 - 21:00

నేను మేజిస్ట్రేట్‌గా ఉద్యోగంలో చేరిన తరువాత ట్రైనింగ్ కోసం హాస్టల్లో వున్నాను. ప్రతి క్లాసుని శ్రద్ధగా విని నోట్స్ రాసుకొని శ్రద్ధగా చదువుకునేవాడిని. ఎప్పుడు ఏ టెస్ట్‌ని పెట్టినా, క్విజ్‌ని పెట్టినా నేను మొదటి ఐదుగురిలో వుండేవాడిని.
ఒకరోజు క్విజ్‌లో చివరి ప్రశ్న ఈ విధంగా ఉంది. ‘రోజూ మీ క్లాస్‌రూంని తుడిచే మనిషి పేరేమిటి?’ ఆ ప్రశ్న ఏదో సరదాగా వేశారేమోనని అన్పించింది.

05/15/2016 - 21:21

మనమంతా ఆరోగ్యంగా ఉండాలంటే కావలసినవి రెండే రెండు. ‘కరకర’ ఆకలి వేసి కడుపు నిండా అన్నం తినడమూ, కంటినిండా ఆదమరచి నిద్రపోవడమూను. ఎంతమందికి ఈ రెండూ లభిస్తున్నాయ్? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఉన్నవాడికీ అరగని జబ్బూ, లేనివాడికీ ఆకలి జబ్బూ అన్నాడో సినీ కవి.

Pages