S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

12/10/2019 - 23:18

‘పాట పాడాలని అనుకునేవాడికి ఏదో ఒక పాట దొరుకుతుంది’ ఇది ఒక సామెత.
ఇది మన జీవితానికి అన్వయించుకోవచ్చు.
మనం ఎవరినైనా విమర్శించాలని అనుకుంటే ఒక్క కారణం కాదు. లక్ష కారణాలు దొరుకుతాయి.
మెచ్చుకోవాలంటే లక్ష కారణాలు కాకపోయినా కొన్ని కారణాలు దొరుకుతాయి.
మనం అదృష్టవంతులం అని అనుకోవడానికి ఎన్నో కారణాలు దొరుకుతాయి.

12/02/2019 - 23:37

కాన్వాస్, కాగితంపైగాక కొత్త తీరాలకు చిత్రకళ చేరుకుందని, ఆ నూతన తీరాలను తాకడమే నేటి చిత్రకారుల కర్తవ్యమని భావించి, ఆ సరికొత్త వేకువ వెలుగులను ముద్దాడాలని తహతహలాడే వినూత్న భావాల, విశేష అవగాహన గల చిత్రకారులకు వర్ధమాన చిత్రకారిణి ‘వేకువ’ ప్రాతినిధ్యం వహిస్తోంది.

12/02/2019 - 23:31

డిసెంబర్ 2 సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా...
*
ఆదిదంపతులు పార్వతీ పరమేశ్వరుల రెండవ కుమారుడు సుబ్రహ్మణ్య స్వామి (కుమారస్వామి). ఆయన అన్న వినాయకుడు విఘ్నాధిపతి అయితే కుమారస్వామి విజయాధిపతిగా లోకం స్తుతిస్తుంది. తరిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామిని సకల దేవతా స్వరూపునిగా, జ్ఞాన స్వరూపుడిగా సర్వజగత్తు ఆరాధిస్తుంది.
కారణజన్ముడు

12/02/2019 - 23:29

అన్నపూర్ణ లాంటి దేశం
ఆకలి దేహమై చిక్కిపోతున్నపుడు
ఆకాశమంత విస్తరి పరిచి
ప్రేమగా పంచ భక్ష్యాలూ వడ్డిస్తావు!
మంచి నీళ్లను మాత్రం ముట్టకూడదంటావు.

, ,
12/02/2019 - 23:20

డిసెంబర్ 4న ఘంటసాల జయంతి
*

11/30/2019 - 23:23

వాడిని మెడ మీది కెత్తుకొని అద్దంలో చూస్తే
వాడి తల కింద నేనున్నట్లుగా అనిపిస్తుంది
వాడు నా తలదనే్న వాడిలా కనిపిస్తాడు
వాడిని నేను ఎత్తుకుంటాను
వాడు నన్ను హత్తుకుంటాడు
ఆ హాయి దేహాన్ని దాటి
నా మనసును తడిమేస్తుంది
నిదుర ముంచుకొచ్చినపుడు
నా భుజం వాడి తలగడౌతుంది
ఆ పాల బుగ్గల పసిడి కళలు
నా కళ్లు చాలని అందాలు

11/30/2019 - 23:16

పుట్టు పూర్వోత్తరాలు ఎరుగనోళ్లు
కూడు, గూడు, గుడ్డకు నోచనోళ్లు

విశాల భారతావనిలో తమకంటూ
సెంటు ‘జాగ’ కరువైన అభాగ్యులు
ఊరూరా తిరుగు ‘సంచార’ జాతులు

ఆవాసాలకు దూరంగా..
చెత్తకుప్పలకు చేరువగా..
చిరిగిన ‘గుడారా’ల్లో చితికే జీవనం
భిక్షాటనతో ‘పొట్ట’ నింపుకునే వైనం

11/30/2019 - 23:13

కోతకొచ్చిన పైరు
వర్షం ధారలో తడిసి ముద్దయినపుడు
రైతు కన్నీరు భూమిని
పవిత్రమో అపవిత్రమో చేస్తుంటే
ఏముంది భూమిలో!
రైతు కన్నీరు తప్ప
దేవుని కోపమా
ప్రకృతి శాపమా
తెలియదు
చెట్లు నరకటమా ఇసుక తోడటమా
భూమి పొరలు మదమెక్కిన
మనుష్యులతో
వేడివేడిగా మారి పొరలుగా మారటమా
సూర్యుని తాపమా
సాగర ఆగ్రహమా

11/30/2019 - 22:59

శ్రమించని వ్యక్తికి చరిత్రలో చోటు లేదు. చాలా మంది శ్రమించకుండా చరిత్రలో వుండాలని అనుకుంటారు. అది సాధ్యం కాదు.
రెండూ కావాలని అనుకోవడం అసమంజసం.
రెండింటిలో ఏదో ఒకదాన్ని మనం ఎంపిక చేసుకోవాలి.
చాలామంది శ్రమించరు. కానీ పేరు ప్రఖ్యాతులూ డబ్బూ కావాలని కోరుకుంటారు.
అది సాధ్యమా?
చాలా మంది జీవిత చరిత్రలను పరిశీలిస్తే అది సాధ్యం కాదని తెలిసిపోతుంది.

Pages