S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

11/26/2019 - 23:25

పెన్ను, పెన్సిల్‌తోనే కొందరు చిత్రకారులు తమ సృజనను, ‘సత్తా’ను చాటుతారు. అలాంటి వారిలో గాలి అర్చన ఒకరు. ఆమె వాటర్ కలర్స్, అక్రలిక్ రంగుల్తో బొమ్మలు సృజించినా బాల్‌పెన్నుతో, రంగు పెన్సిళ్లతో, ఆమె గీసిన చిత్రాలు, పొట్రేట్స్ వీక్షకుల్ని విశేషంగా ఆకర్షిస్తాయి. అందులో ఆమె నైపుణ్యం (క్రాఫ్ట్) స్పష్టంగా కనిపిస్తుంది.. అబ్బురపరుస్తుంది.

,
11/26/2019 - 23:19

* నవంబర్ 25 జంతువుల హక్కుల దినోత్సవం

11/26/2019 - 23:15

ఈ నా ఘటం ఉన్నన్నాళ్లు.. ఈ ఘట్టం ఇలా సాగవలసిందే.. మీ గొంతులెంత మోగుతున్నా.. మీ పెదవులు దాటటం మాత్రమే జరుగుతుంది.. కానీ చెవుల్ని దూసుకుపోలేవు, ననే్నమాత్రం శాసించలేవు.. ననె్నంత మాత్రం మార్చలేవు.. నేను ఏ విషయంలోనైనా నిర్ణయం చేస్తే పూర్వాపరాలు ఆలోచించి మాత్రమే చేయడం జరుగుతుంది. ఇక ఈ విషయంలో నా మాటే శాసనం.. అంటూ పరంధామయ్యగారు తీర్మానించి.. ఫాంహౌస్ వైపుగా సాగిపోయారు కారులో..

11/26/2019 - 23:14

గిరిజనం
మునిగినా
గిరిజన గూడేల ముంచినా
నోరు మెదపని మైదానోళ్లం

పోలవరం కట్టేద్దాం
డబ్బులు వెదజల్లుదాం
సంస్కృతిని నాశనం చేద్దాం
వాడి ఉనికినే పాతరేద్దాం

వాడు మాత్రం అదే లోయల్లో
పైకో కిందికో జరుగుతూ
అక్కడే ఆవాసం
అడవి వాడి సావాసం

11/26/2019 - 23:13

దీపం వెలిగించి దిగులు మరిచే
నిరుపేదల గుమ్మం చూడని
ఇనే్నసి దివ్వెల వెలుగులు
నాకెందుకని కన్నులు అమావాస్య
మసకలు మూకుమ్మడిగా కమ్మేసాయి
పట్టెడు అన్నం మింగని వాయిలు
వేల సంఖ్యలో వీధులపై ఉంటే
పరమాన్నపు అరిటాకులు నాకెందుకని
నోరు వౌన వ్రతం పాటించింది.
టపాకుల వెలుగుల మిరిమిట్ల
మధ్యన తాటాకుల గుడిసెల
గుండె మంటలు చూడలేక టప్పున

11/24/2019 - 00:00

బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యంగారి సీతానగరం సత్యాగ్రహాశ్రమంలో మహాత్మాగాంధీ ఒకటో, రెండో రోజులు బస చేశాడు. ఆశ్రమ కార్యకలాపాలను, నిర్వహణ పద్ధతులను ఆయన ఎంతో మెచ్చుకున్నట్లు సుబ్రహ్మణ్యం గారిని గూర్చి రాసినవారు అక్షరీకరించారు.

11/23/2019 - 23:40

అందరిని గమనించే
ఈ కళ్లతో నిన్ను
నేను చూడలేదెప్పుడు!
కావాలంటే మల్లెపువ్వులాంటి
నా స్వచ్ఛమైన మనసును
అడిగి తెలుసుకో
నిజమేమిటో అది చెబుతుంది!
ఎవరికీ కనిపించని
నా మనోనేత్రంతో తదేకంగా
నీ రూపాన్ని వీక్షిస్తూనే ఉంటాను
ఎప్పటికీ!
అందుకే ఎవరికి నీవెలా కనపడినా
నా కంటికి మాత్రం
అపరంజి బొమ్మలా కనిపిస్తావు!

11/23/2019 - 23:38

‘నాకు ఒక్క నిముషం విశ్రాంతి నివ్వక మహా ప్రణయమారుత వేగం పైనో అగాథవియోగ భారం కిందనో చీల్చి, నలిపి, ఊపిరాడక నా జీవితాన్ని పాలించే స్ర్తి లోకానికి నివేదితము’ ఇది చలంగారు ‘స్ర్తి’కి రాసిన అంకిత వాక్యం. దీనిలో చలం వ్యక్తిత్వం, శైలి, నైతిక తృష్ణ, ఆదర్శం, ప్రతిభ గోచరిస్తాయని.. ప్రతి వాక్యంలోనూ.. ఇంకా చెప్పాలంటే ప్రతి అక్షరంలోనూ స్వేచ్ఛను రంగరించుకుని ఉండేదే చలం సాహిత్యం.

11/23/2019 - 23:29

కన్నతల్లి ప్రేమ కనబడుతుంది
కానీ కన్నతండ్రి కష్టం, బాధ్యత కనిపించదు
తల్లి మమకారం, ఆప్యాయత కనబడుతుంది
కానీ తండ్రి వేదన, ఆవేదన కనిపించదు
ప్రతిక్షణం పిల్లల మీద కన్నతల్లి
ఎంతో ఆప్యాయతానురాగాలు చూపిస్తుంది
ఎందుకంటే తన బిడ్డ తన పొత్తిళ్లలోకి వచ్చినప్పట్నుండి
అంతటి ప్రేమను పంచటం అలవాటయి పోతుంది ఆ తల్లికి.
కానీ అదే తండ్రి ఆ బిడ్డ భూమీద పడటానికి

11/23/2019 - 23:24

పగిలిన కాళ్లు ప్రశ్నిస్తున్నాయి
అదేమంటే శీతాకాలం కదా అందుకే
పగిలాయని నాన్న జవాబు!

చీలిన పెదాలు హెచ్చరిస్తున్నాయి
ఎండన తిరిగి వేడిచేసి చీలాయి లేరా అని నాన్న జవాబు!

చిరిగిన చొక్కా పేదరికాన్ని చూపెడుతున్నది...
ఈ వయస్సులో ననె్నవరు మెచ్చుకోవాలి లేరా అని
నాన్న జవాబు!

Pages