S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

11/16/2019 - 23:40

భారతీయ ప్రాచీన లోహ పరిశ్రమకు కలికి తురాయిగా నిలిచిన తెలంగాణ ఇనుము ఉక్కు కుటీర పరిశ్రమపై ఒకవైపు ప్రపంచ శాస్తజ్ఞ్రుల దృష్టి కేంద్రీకృతం కాగా, ఈప్రాంత ప్రజలకు దాని విలువ తెలియక, ప్రాచీనత్వ ప్రాధాన్యత అర్థంకాని స్థితిలో సంబంధిత అపురూప ఆనవాళ్ళు కనుమరుగవుతున్నాయి.

11/16/2019 - 22:58

మనకు చాలా విషయాలు తెలుసు.
కానీ వాటిని మరిచిపోతూ ఉంటాం.
నేను క్రింద చెప్పే విషయాలు అలాంటివే.
కానీ మనం మరిచిపోయాం. అవి ఇలా వుంటాయి.
ఒక తప్పు చేస్తే మళ్లీ మళ్లీ చేయాలని లేదు.
ఒకసారి నష్టం వస్తే మళ్లీ మళ్లీ నష్టపోవాలని లేదు
ఒకసారి అపజయం లభిస్తే మళ్లీ
అపజయం లభించాలని లేదు
ఇవి గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

,
11/09/2019 - 19:49

ఖమ్మం పట్టణానికి చెందిన చిత్రకారిణి భార్గవి తెలంగాణ రాష్ట్ర చిహ్నాలైన పాలపిట్ట, తంగెడు పూవు, బతుకమ్మ, జమ్మిచెట్టు బొమ్మలను చిత్రించి కొంతకాలం క్రితం ప్రదర్శించి ప్రశంసలందుకున్నారు. అంతేగాక తాను పని చేసిన గోల్కొండ పబ్లిక్ స్కూల్‌లో 8 ఇంటు 6 అడుగుల పెద్ద సైజులో గోల్కొండ కోటను సహజత్వం ఉట్టిపడేలా చిత్రించారు.

11/09/2019 - 19:28

నీ పాటల పల్లకిలో
పట్టపు రాణినై ఊరేగాలి

నీ నవ్వుల తోటలో
పారిజాత పువ్వై పరిమళించాలి

నీ గుండె గూటిలో
పసిపాపనై ఒదిగిపోవాలి

నీ నిండు మనస్సులో
పండు వెనె్నలై కురవాలి

నీ చేతి స్పర్శలో
సిగ్గుమొగ్గై మురవాలి

నీ పలుకుల సరిగమలో
దేవనర్తకినై నాట్యమాడాలి

నీ ఆలంబనల కొమ్మకు
ఆత్మీయ తీగనై అల్లుకోవాలి

11/09/2019 - 19:27

ఈటీవీలో ఇష్టమైన పాట స్వరాభిషేకంలో రమ్యబెహ్రా మరియు సమీరా భరద్వాజ్ పోటాపోటీగా.. ఇద్దరూ.. గాత్రాల్ని సమన్వయం చేసుకుంటూ చాలా హుషారుగా, ఉల్లాసంగా.. శృతిబద్ధంగా.. మాధుర్యప్రదంగా.. శ్రావ్యంగా గానం చేస్తున్నారు. ఏయే పనులున్నా, అన్నింటిని ఆపేసుకుని కూర్చుంది టీవీ ముందు సుభద్ర.. తనకెంతో ఇష్టమైన ‘సుందరాంగ మరువగలేను..’ -సంఘం’ చిత్రంలోని పాట. ఆ పాటకున్న మధురిమలేమోగానీ.. తియ తీయని తేనియ ఊటలు తొణికిసలాడేవి.

11/09/2019 - 19:22

నవ మాసాల గండం నుంచి
గట్టెక్కెందో లేదో
నిమిషం నిమిషం
మృత్యుద్వారం ముందు
ఎదురుచూపులు
ఆడపిల్లగా పుట్టడమే
శాపమైన దేశంలో దినామూ
వొక సంఘర్షణే
ఎదిగే సీతాకోక చిలుకని
కబళించడానికి ఎన్ని చేతులో
లాఘవంగా తప్పించుకోని
ఎదిగిన క్రమం కష్టమే
యవ్వనాన్ని దాచలేని
శరీరంతో రాక్షస ప్రేమల నుంచి
రక్షించుకోవడం

11/09/2019 - 19:20

కన్నీరు బరువుండదు
కానీ, ఎంతటి బరువునయినా తనలో
ఆపుకుంటాయి
ఎంతో వేదనను, ఎంతటి బాధనయినా
కనిపించకుండా తనలోనే దాచుకుంటాయి
ఉద్విగ్న భరిత క్షణాల్లో మాత్రమే
అవి ఎద దాటి బయటికి వస్తాయి
తల్లి తన పిల్లల కోసం పడే తపన,
తండ్రి తమ కుటుంబం కోసం అనుభవించే
నరకయాతన
భార్య భర్త కోసం పడే వేదన
భర్త భార్య కోసం పరితపించే తపన

11/09/2019 - 19:08

శాస్ర్తీయ సంగీతానికి కనీసం దగ్గరగానే కాదు దూరంగా కూడా నిలిచే అర్హతలేని పద్ధతి ఈల. ఈల అంటే ఎవరికీ మంచి ఉద్దేశం ఉండదు. చిన్న చూపు మాత్రమే ఉంటుంది. గ్రామాల్లో, సంతలో, సంబరాలో జరిగినప్పుడు గాలిని ఆధారంగా చేసుకొని ఆనందమో, ఆవేశమో లేదా పౌరుషానికో వేళ్ళను పెదవుల మధ్య పెట్టి నాలుక సాయంతో చేసే ధ్వని ఈల.

11/09/2019 - 19:05

ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం అనేది ఒక తీపి జ్ఞాపకం. బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం ఇవి మానవ జీవితంలో ప్రధాన దశలు. ఇందులో కల్లాకపటం తెలియని బాల్యం మధురానుభూతికి ప్రతీక అని చెప్పవచ్చు. స్వేచ్ఛగా విహరించే పిల్లల్ని సుతిమెత్తని పూలు, స్వేచ్ఛగా విహరించే పక్షులు, సుకుమారమైన కుందేళ్లతోను పోలుస్తుంటారు. భగవంతుడు మనిషికిచ్చిన అమూల్యమైన వరం బాల్యం.

11/09/2019 - 18:42

అక్షరాలు ఇప్పుడు చెదిరిపోతున్నై
ఏరుకుందామంటే ఏబీసీడీలు అడ్డం పడుతున్నై
ఒక్కొక్క అక్షరాన్ని పేర్చి అమ్మను చేస్తే
ఇంట్లో పిల్లాడు అమ్మను మమీ అంటున్నాడు
మాతృభాష నేర్చుకోకపోతే భవిష్యత్తు ఉండదంటే
తెలుగు భాష కూడుపెడుతుందా అంటున్నాడు
ఆంగ్ల భాష కూడుపెడితే పెట్టొచ్చు
తెలుగు చందమామ చూపించలేదు
తేడా ఎక్కడొచ్చిందో తెలీదుగాని

Pages