S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

11/09/2019 - 18:37

స్వేదపు బొట్టు చెమ్మటి వాసన
పరిమళమవుతూ
ఇష్టాయిష్టంగా ఉబికి జారుతూ ఆవిరవుతూ
జీవితం చిన్నదని చెప్పకనే చెప్పి
ఇమిడిపోయింది
రక్తపు బొట్టు గాయమై నొప్పించి
కమ్ముతూ బాధించి
రుధిరమే జీవమని జారుతూ
అందరం సమానమని
అందరిలో ప్రవహించేది ఒక్కటేనని చెప్పి ఆవిరయ్యింది.

11/09/2019 - 18:36

నిన్ను చూసిన క్షణాలు ఉవ్వెత్తున ఎగసిన
ఉద్వేగ సంద్రం
ఎద చుట్టూ చెలియలి కట్టలా చుట్టుకున్న
చేతులను దాటలేక కన్నుల ఆకసాన్ని చేరి
కంటిపాపకు ముందు.. కన్నీటి యవనికగా
మారిన దృశ్యం - నీ దృష్టిని దాటిపోయిందా?
మెడకు చుట్టుకున్న ఉరిత్రాడు
కాళ్లకు తగులుకున్న ముళ్లకంపలు
తొలగించమని ప్రాధేయపడ్డ భావాల నిట్టూర్పులు
నీ వీనుల చుట్టూ వీవనలు కాలేదా?

11/09/2019 - 18:29

ఎలా ఊరేదో నీరు?!
ఊట బావి తీరు
ఉదయిస్తున్న తొలి బింబాన్ని
బొట్టు దిద్దుకున్న
పాతకాలపు కథానాయికలా
నిండుగా నవ్వేది చెరువు.

పొలానికి ఆకలి వేసినపుడల్లా
ఆగని స్తన్యపు మధు ధారల్ని
మదుంలోకి ఒంపి
కొంగు కప్పి పిల్లకి పాలు తావిస్తున్న
తల్లిలా కనపడేది.

11/09/2019 - 18:21

ఇతరుల గురించి మన అంచనాలు ఎక్కువగా వుంటాయి.
అవి స్నేహితుల గురించి కావొచ్చు.
బంధువుల గురించి కావొచ్చు.
ఇంట్లో వాళ్ల దగ్గర నుంచి కావొచ్చు.
ప్రభుత్వం నుంచి కావొచ్చు.
నాయకుల దగ్గర నుంచి కావొచ్చు.
ఇలా మన అంచనాలు ఎక్కువగా వుంటాయి. అందరి దగ్గర నుంచి మనం ఎక్కువగా ఆశిస్తాం. ఆ విధంగా లేకపోవడం వల్ల నిరాశ చెందుతాం.

,
11/02/2019 - 20:29

అధిక్షేపించడం ఆమె నైజం. ఇతరులను ఆలోచింపజేయడం ఆమెకు ఇష్టం. మనుషులు మన్నుతిన్న పాముల్లాగాక నిత్య చైతన్యంతో నిప్పు కణికల్లా మంచి సమాజం వైపు సమష్టిగా సాగాలనేది యువ చిత్రకారిణి ‘స్వాతి’ స్వగతం. పూర్తి స్వతంత్ర భావాలుగల ఆమె పరిసరాలకు, చుట్టూ జరిగే సంఘటనలకు వేగంగా స్పందిస్తుంది. ఆ స్పందనను రంగుల్లో బహిరంగంగా గోడలపై, కట్టడాలపై అందరి దృష్టికి వచ్చేలా శ్రమిస్తుంది.

11/02/2019 - 20:23

తారీఖులు, దస్తావేజులు కచ్చితంగా పాటిస్తే కిందటి సంవత్సరమే రజతోత్సవం జరిగిందనో, జరుపుకున్నామనో సంస్థ వారు భావించవచ్చు. కానీ తెలుగునాట 2020లో వారు నిర్వహించే తెలుగు పండుగ ఇరవై ఆరోదని అనాలి. అనుకోవాలి. ఏమంటే ఓం ప్రథమం ఈ ఉత్సవం అమెరికాలో జరిగింది. అప్పుడింత ఆనందాతిశయ సంరంభ సభావేదిక ఉండి ఉండదు. నాలుగు రోజుల పాటూ జరిగి ఉండదు.

11/02/2019 - 20:23

నిజమండీ.. ఆ ఊర్లో బిడ్డను కంటే ఎనిమిది లక్షలు రూపాయల బోనస్ ఇస్తారు. ఫిన్లాండ్‌లోని ఒక ఊరిలో జనాభా భారీగా తగ్గిపోతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే కొన్నాళ్లకు యువత లేకుండా అందరూ వృద్ధులే మిగిలిపోయే ప్రమాదం ఉందనుకుంది స్థానిక పాలకవర్గం. దీనికి పరిష్కారం చూపేందుకు ఒక ఆలోచన చేసింది. తమ ఊరిలో పిల్లలను కనేవారికి పారితోషికంగా 10, 000 యూరోలు ఇవ్వాలని నిర్ణయించింది. అంటే భారత కరెన్సీలో అక్షరాలా.. రూ.

11/02/2019 - 20:19

సౌందర్యపు తోటలో పూసిన
సున్నిత పుష్పం
అసాంఘిక హస్తాల్లో నలుగుతున్న
కన్నీటి శిల్పం
కాలం సంకెళ్లు త్రెంచుకున్న
గెలుపు బావుటా
వికృత ఆలోచనల పంజాదెబ్బకు
విలవిల్లాడుతున్న మనోనిబ్బరం
వివక్షతా అగాధాల్లోకి నెట్టివేయబడుతున్న
చైతన్య సామర్థ్యం
ప్రణాళికల రూపకల్పనలో
అద్భుతాలను సృష్టించగల మేథ
సమాజపు తలలో నాలుకై

11/02/2019 - 20:11

మాది చాలా పోష్ లొకాలిటీ అని ఛాతీ మీద చెయ్యి వేసి చెప్పుకోగలరందరు. అంతా కాంక్రీట్ జంగిల్ అని కూడా చెప్పుకోవడం కూడా వింటుంటాం. అప్పుడప్పుడు కొందరి నోట, ఆ చోట.. ఈ చోట.. ఆ పూట ఈ పూట.. వాళ్లంతా ఛాందసులు అనుకోని సందర్భాలు లేకపోలేదు. ఇప్పుడిప్పుడే కోట్లకి.. గేటెడ్ కమ్యూనిటీలకి, విల్లాలకి అలవాటైన యువత నోట. ఏదైనా తలో మాట ప్రతినోట.

11/02/2019 - 20:08

వేయాలి కవి మెడలో
వాస్తవ స్పందనలతో
సువాసనల పూలదండ

అతి పొగడ్తలతో
తగిలించకూడదు
కవికి గుదిబండ

కప్పిన నిరాడంబరపు
శాలువలే కవికి మెరుపుల
శోభాయమాన గండభేరుండ

సంయమన కవిత్వమే
కవికితేనెల నిండుకుండ
కవిని కొనియాడదగు
బంగారుకొండ

కుప్పలు తెప్పలుగ
రాసిన రాశీ కవిత్వం
కవి సాహిత్యానికి
ఓ విమర్శనాస్త్రాల సవతి

Pages