S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

11/24/2018 - 19:02

పరీక్షల కాలం వచ్చేస్తోంది. ఇటీవల ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసి ఫిబ్రవరి 28 నుండి పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడియెట్ బోర్డ్ సన్నద్ధమవుతోంది. విద్యార్థులు ఏటా పరీక్షలు ఎదుర్కోవడం సహజం. ఈ క్రమంలో కొందరు ఒత్తిడికి గురవుతుంటారు. మంచి మార్కులు సాధించగలనా? ఎలాంటి ప్రశ్నలు వస్తాయో? సరైన సమాధానాలు రాయగలనా? ఆశించిన మార్కులు రాకపోయినట్లయితే పరిస్థితి ఏమిటి?

11/24/2018 - 18:54

‘చతుర సంభాషణ ప్రవీణ’ జంధ్యాల శాస్ర్తీగారు తానే సంపాదకుడుగా తాను నడుపుకుంటున్న ‘అపూర్వార్థ ప్రకాశిక’ మాస పత్రిక ప్రథమ వార్షికోత్సవం జరుగుతోంది. వరుసగా మూడు రోజులపాటు జరుప తలపెట్టిన ఆ వార్షికోత్సవంలో అది మూడవ రోజు సాయంత్రం, ఆఖరి అంశ సమావేశం.

11/24/2018 - 18:43

గీ॥ అది లసత్తర తారకా హారపంక్తి
చారు తర శరద్రాత్రి విశాల దాత్రి
కవల మినే్నట వెనె్నల అలలదేలి
అల్లనల్లగ సాగే జాబిల్లి నావ

గీ॥ రమ్యకానన గిరి శిఖరములనుండి
కెరలివల గొనుసెలయేటి తరగలందు
చలువ జాబిల్లి వెనె్నల జల్లుకురియ
మించె వెనె్నల కారు శోభించెజగతి

11/18/2018 - 03:20

చిన్నప్పటి నుంచి విన్న మాట-
అనగనగా..
అనగనగా వినని పిల్లలు చాలా అరుదు.
అనగనగా ఒక చేప వుండేది. అనగనగా ఒక రాకుమారుడు ఉండేవాడు. అనగనగా ఓ పేదరాశి పెద్దమ్మ వుండేది.
చిన్నప్పుడు మనలో చాలామంది విన్న కథలు ఇలాగే మొదలయ్యేవి.
అలా మొదలైన కథ రాక్షసుడు రాకుమార్తెను ఎత్తుకుపోవడం, ఆమె అనే్వషణలో రాకుమారుడు అడవిలోకి వెళ్లడం.

11/17/2018 - 19:25

మీరు చదివింది నిజమే.. ప్రపంచంలోని అనేక చెట్ల జాతులు వేగంగా అంతరించిపోతున్నాయి. ప్రస్తుతం ఉన్న చెట్లలో ఐదింట ఒకటి అంతరించిపోయే ప్రమాదం ఉంది. దీంతో శాస్తవ్రేత్తలు వాటిని పరిరక్షించడంపై దృష్టి సారించారు. దానిలో భాగమే టెస్ట్‌ట్యూబుల్లో చెట్లను పెంచడం. అటవీ వృక్షాల పరిరక్షణలో భాగంగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇలాంటి వృక్షాలను ఉత్పత్తి చేయడానికి ప్రయోగాలు జరుగుతున్నాయి.

11/17/2018 - 19:06

భారత సాహిత్యంలో గజల్‌కు విశేష ప్రాచుర్యముంది. కాస్త నెమ్మదిగానైనా తెలుగులో కూడా గజల్ సాహిత్యానికి పెద్ద పీట లభించింది. దక్షిణ భారతంలో మొట్టమొదటగా ఉర్దూ - పర్షియన్ భాషల్లో గజల్స్ సృష్టించింది నెల్లూరీయుడు జూకా. జూకా కలం పేరు. యావత్ దక్షిణ భారతదేశంలో గాలిబ్ మహాకవి ఏకలవ్య శిష్యుడితనే. ఉర్దూ, పర్షియన్ భాషల్లో గాలిబ్ శిష్యులు ఇంకెవరూ ఈ ప్రాంతం నుండి లేరు. జూకా మరణించింది 1875వ సం.లో.

11/17/2018 - 18:29

మొదటి దృక్కోణం :-
రాజా! ‘‘్భగవంతుడైతే మాత్రం లోకధర్మాన్ని అతిక్రమించి నడవవచ్చా?’’ అని అడుగుతున్నావు. భగవంతుడైన శ్రీహరితో పోల్చి చూస్తే, కశ్యపప్రజాపతి, దక్షప్రజాపతి, మొదలైనవారంతా అతి సామాన్యులు. అట్టివారు కూడా ఒక్కొక్కప్పుడు లోకహితం కోసం, లోకధర్మాన్ని అతిక్రమించడం కనిపిస్తూనే వున్నది. దానిని పెద్దలంతా హర్షిస్తూనే వున్నారు. ప్రజాపతులకే ఇటువంటి హక్కు వుంటే, భగవంతుడైన శ్రీహరికి వుండదా?

11/17/2018 - 18:23

ఈజిప్షియన్లు పునర్జన్మలను నమ్ముతారు. మరణం తరువాత ఆత్మ ఉండటానికి ఓ దేశం కావాలని వారు భావిస్తారు. అందుకే చనిపోయిన తరువాత కూడా మమీల రూపంలో శరీరాన్ని భద్రపరచడానికి ప్రయత్నిస్తారు. కానీ ఇలా చేయడమనేది ఓ పెద్ద మిస్టరీనే.. ప్రపంచంలోని ఎన్నో మిస్టరీల్లో మమీల తయారీ ఒకటి. ఇప్పుడిప్పుడే ఆ చిక్కుముడి వీడుతోంది. ప్రాచీన ఈజిప్ట్‌లో శవాలు కుళ్లిపోకుండా ఉండేందుకు వాడిన పద్ధతులేంటో తెలుస్తున్నాయి.

11/10/2018 - 20:10

ఒక పులి..వంద తుపాకులు. ప్రత్యేక కెమేరాలు..ఆధునిక డ్రోన్‌లు..ఇదేదో సినిమా స్క్రిప్ట్ కాదు. ఓ ఆడపులిని పట్టుకునేందుకు నెలల తరబడి సాగిన ‘మహా’వేట. పులుల్ని రక్షించండి మొర్రో అంటూ సంరక్షణ కార్యకర్తలు వాదిస్తూంటే..ఓ పులిని పట్టుబెట్టడానికి చట్టపరంగా జరిగిన ప్రయత్నమిది. ఇది మామూలు పులి కాదు. జంతువుల మాంసం తింటుంది. మనిషి రక్తం తాగుతుంది. ఇందుకోసం చుట్టూ జంతువులున్నా పట్టించుకోదు.

Pages