S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

07/28/2018 - 19:00

మన దేశంలో సాదాసీదా చాయ్‌వాలాలు చరిత్ర సృష్టిస్తున్నారు.. గుజరాత్‌కు చెందిన నరేంద్ర మోదీ చాయ్‌వాలాగా పనిచేసి, ప్రధాని పీఠాన్ని అధిష్ఠించగా, ఇంకెందరో ‘టీ’ అమ్ముకునే వ్యక్తులు పరోపకారంలోనే జీవిత పరమార్థం ఉందని తమకు చేతనైంతగా సామాజిక సేవలో నిమగ్నమయ్యారు. ఒడిశాకు చెందిన అజయ్ బహదూర్ సింగ్ డాక్టర్‌గా పేదలకు సేవలందించాలని చిన్నప్పటి నుంచి కలలు కనేవాడు.

07/28/2018 - 18:59

చిన్నప్పుడెప్పుడో చదువుకున్న లేదా పెద్దలద్వారా విన్న కాకి కథ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఓ కాకికి దాహం వేసి వెతగ్గా.. వెతగ్గా.. ఓ కుండ కనిపించిందనీ.. దానిలో అడుగున నీళ్లు ఉన్నాయని, కాకి వాటిని తాగాలనే ధ్యేయంతో తెలివైన ఆలోచన చేసి ఒక్కొక్కటిగా గులకరాళ్లను వేసి నీళ్లను పైకి తెచ్చుకుని తాగుతుందనేది కథ. విపత్కర పరిస్థితుల్లో తెలివిగా ఎలా ఆలోచించాలి అనేది కథాసారాంశం.

07/28/2018 - 18:33

ఆ రోజు ఆదివారం. ఆ సాయంత్రం అయిదు గంటలకు ఆదర్శనగర్‌లోని ఆంధ్ర కేసరి పార్కులో ‘అపూర్వార్థ చతుర విన్యాస ప్రౌఢోక్తి’, ‘వక్రోక్త్యుద్ఘాటనా చక్రవర్తి’ ‘విచిత్రార్థ ప్రవచన పంచానన’ ఇత్యాది బిరుదాంకితులైన జంధ్యాల శాస్ర్తీగారు ‘్భషలో తమాషాలు’ అనే అంశం గురించి ఉపన్యసించబోతున్నారని తెలిసి జనం తండోప తండాలుగా పార్కుకు చేరుకున్నారు.

07/28/2018 - 18:08

లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్ అనే ఫ్రాన్స్ దేశపు ప్రఖ్యాతి పొందిన సైకిల్ క్రీడాకారుడికి కేన్సర్ వ్యాధి సోకింది. డాక్టర్లు అతడు బతికే అవకాశం నలభై శాతం మాత్రమే ఉన్నట్లు తేల్చారు. అంతేకాదు, అతడు ఇక మీదట సైకిల్ తొక్కరాదని కూడా హెచ్చరించారు. అతనికి మిన్ను విరిగి మీద పడ్డట్లూ, తనకు మరణమే శరణ్యమన్నట్లూ అనిపించింది.

07/21/2018 - 21:26

చాలామంది తాము ఉదయం నిద్రలేవలేమని, రాత్రిపూట ఎంతసేపైనా మెలకువతో ఉండి పనులు చేసుకోగలమని అంటూ వుంటారు.
‘రాత్రి పక్షులు’ ‘ఉదయం పక్షులు’ అనే విధంగా వ్యక్తులు ఉంటారా?
త్వరగా పడుకోవడం, త్వరగా నిద్రలేవడం వల్ల మనిషి ఆరోగ్యంగా, తెలివిగా, ధనవంతునిగా ఉంటాడని బెంజమిన్ ఫ్రాంక్లిన్ అంటాడు. బ్రహ్మ ముహూర్తంలో పనులు చేస్తే చాలా మంచిదని మన పెద్దలు చెబుతారు.

07/21/2018 - 21:04

భారతదేశం గర్వించదగ్గ ఇంజనీర్, అత్యంత మేధావి, భారతీయులలో అగ్రగణ్యులు, ఎన్నో ఇంజనీరింగ్ అద్భుతాలను తన మేధస్సుతో ఆవిష్కరించిన మోక్షగుండం విశే్వశ్వరయ్యగారి జీవితాన్ని పరికిస్తే.. ఆయన జీవితం పూలబాట కాదని, ఎన్నో వొడిదుడుకులతో కూడుకున్నదని అర్థమవుతుంది. కష్టాలను గరళ కంఠుడిలా తన కంఠంలోనే మింగుకుని గుండె నిబ్బరంతో అనుకున్నది సాధించగలిగారీయన.

07/21/2018 - 20:27

శ్రీనాథుడు తన కావ్యాలలో శృంగారానికి వనె్న తెచ్చాడు. అలాగే అనేక మంది కవులు చేమకూర వెంకటకవి మొదలు, ఈనాటి అనేక మంది రచయితల వరకూ, శృంగార రసానుభూతిని కలిగించే రచనలు చేశారు. అవన్నీ మానసికానందాన్ని ఇస్తూనే ఉన్నాయి. చదివిన కొద్దీ చదాలనిపిస్తూనే వున్నాయి.

07/21/2018 - 19:27

మహాభారతంలో విలు విద్యా గురువు ద్రోణాచార్యుడు కౌరవ, పాండవులకు ఇచ్చిన శిక్షణను దూరంగా చూస్తూ అన్ని రంగాల్లో తిరుగులేని పాటవాలను నేర్చుకున్న ఏకలవ్యుడి ప్రావీణ్యం ఎంత నిజమో.. ఎలాంటి గురుశిక్షణ లేకుండా తనకు తానుగా కొండంత ఎతె్తైన బొమ్మలను గోటితో గీయడంలో తిరుగులేని నైపుణ్యాన్ని సాధించి ఎన్నో విలువైన రికార్డులు స్వంతం చేసుకుంటున్నాడు బస్వరాజ్ రాజవౌళి.
*

07/14/2018 - 21:49

భారతదేశంలో మేధావులకు కొదవలేదు. ఎక్కువ మంది అట్టడుగు స్థాయినుంచే వచ్చినవారున్నారు. చిన్నతనం బాధలు, గొప్పవారవ్వాలనే లక్ష్యంతో కష్టాలుకోర్చి ఉన్నతత్వాన్ని సాధించారు. అలాంటి కోవలోకి చెందిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన, దేశం గర్వించదగ్గ ఇంజనీర్లలో ఒకరు ఆధునిక కాలపు అపర భగీరథుడు అనిపించుకున్న ఘనుడు కె.ఎల్.రావు. (కానూరి లక్ష్మణరావు). 1902 జూలై 15న విజయవాడ సమీపంలో ‘కంకిపాడు’లో జన్మించారు.

07/14/2018 - 18:59

నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అయిదు క్రీడలకు మూలాలు భారత్‌లోనే అంటే ఒకింత ఆశ్చర్యం కలగొచ్చు.. కానీ, ఇది ముమ్మాటికీ నిజం. మన నాగరికతలో చదరంగం, పోలో, కబడ్డీ, బ్యాడ్మింటన్, క్యారమ్ క్రీడలకు చారిత్రక ఆధారాలున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఆధునిక కాలంలో రమేష్‌బాబు ప్రజ్ఞానంద, విశ్వనాథన్ ఆనంద్ వంటి మేటి క్రీడాకారులు చదరంగంలో భారత కీర్తిపతాకాన్ని విశ్వవేదికపై రెపరెపలాడించారు.

Pages