S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

03/17/2018 - 22:18

సహనం అనే గుణం మానవునికి ఆభరణం వంటిది. అది లోపించడం వలన అనేక వైషమ్యాలు కలుగుతున్నాయి. కలహాలు జరుగుతున్నాయి. సహనం అంటే క్షమా ఓర్పు అని కూడా చెప్పవచ్చు. పరీక్షన్మహారాజు వేటకై అడవికి వెళ్లిన సమయంలో దాహం వేసింది. చుట్టుపక్కల పరికించగా ఒక ముని ఆశ్రమం కనపడింది. అక్కడ శమీకుడనే ఋషి యోగనిష్ఠలో ఉన్నాడు. రాజు అతనిని సమీపించి మంచినీరు ఇవ్వమని కోరగా బాహ్యస్మృతిలో లేని కారణంగా ఋషి స్పందించలేదు.

03/17/2018 - 22:16

* ఏ రాయి అయితేనేమి పళ్లూడగొట్టుకొనడానికి
* కల్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగవు
* కొంగ జపము చేపల కొరకే
* కొత్త బిచ్చగాడు పొద్దెరగడు
* గబ్బిలాలు మొగం నవ్వినా ఒకటే ఏడ్చినా ఒకటే
* చదివేది రామాయణం పడగొట్టేది దేవాలయం
* తింటే ఆయాసం తినకుంటే నీరసం
* తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోవు
* దానాలలోకెల్లా నిదానం శ్రేష్ఠం
* దున్నను పోతే దూడల్లోనూ,

03/17/2018 - 22:00

ఆకాశంలో
పాలపుంతలా
మామిడమ్మ
ఒళ్లంతా నిండుగా పూత!

కాకి పొదిగిన
కోయిల తన ఉనికిని
చాటుతూ కుహూల
కచేరీ మొదలుపెట్టింది!

వ్యయానికి తగ్గ
ఆదాయాన్ని పెంచి
అవమానాలను తృంచమని
పంచాంగ శ్రవణం హెచ్చరిస్తోంది!

శరీరంలోని
చేదుని వదిలించుకోమని
వేప్పువ్వు
చెట్టంతా విరబూసింది!

03/17/2018 - 21:56

ఈ మధ్య అక్షరాలే కవిత్వం రాసుకొంటున్నాయి
కవులేమో అనువాదకులుగా మిగిలిపోతున్నారు..!
ప్రపంచం ఏయేటికాయేడు ఆశావహంగా.. ప్రజలు
భీతావహంగా రూపాంతరం చెందుతున్నారు
ఈస్ట్రోజన్ తరిగి కొలెస్ట్రాల్ ఖనులు పెరిగి
ఆలోచనలన్నీ అసహనంగా ఒళ్లు విరుచుకొంటున్నయ్
హేవలంబ పోతే విలంబ మలుపు తిరిగితే వికారి
నీరు పల్లమెరిగినట్టు ఆయుష్షు రూపేణ కాలం కరిగిపోతునే ఉంటుంది

03/17/2018 - 21:43

హేవిలంబ నుంచి వీడ్కోలు
తీసుకొని అలా రుతు రాగాల నుంచి
విలంబ వచ్చిందో లేదో
కుహుకుహు అంటూ కోయిలలూ
ఆహ్వానం పలికాయి

షడ్రుచుల జీవితానికి
ఏది తక్కువైనా వొప్పేది లేదంటూ
మనిషిని నడిపించే కాలాల సాక్షిగా
ఆశని రంగరిస్తుంది.

03/17/2018 - 21:37

ఆగమించె ఆగమించె
విలంబ నామ వత్సరం
అందించెను వసుంధరకు
ఆనందపు ఉత్సవం

చివురాకుల దివ్వెలెత్తి
మావితరువు నిలిచింది
వాసంతుని స్వాగతించి
కోయిలమ్మ పిలిచింది

విచ్చుకున్న ప్రతి పువ్వూ
ముచ్చటపడి చూసింది
చేరవచ్చు మధుపానికి
తేనెవిందు చేసింది.

వేడుకతో వేపచెట్టు
గుత్తులుగా పూసింది
వగరు వగరు చూపులతో
వగలు ఒలకబోసింది

03/17/2018 - 21:32

పచ్చని ఆకులతో, పుష్పాలతో, ఫలాలతో వృక్షాలు, పచ్చిక బయళ్లు, లేతమామిడి చిగుళ్లు తిని కుహూ కుహూ అంటూ పంచమ స్వరంతో కూసే కోయిల, పువ్వులలో నుండే మధువును గ్రోలి ఝంకారం చేసే తుమ్మెద, పురివిప్పి నృత్యం చేసే నెమలి, రామణీయకతతో ఆనంద సౌందర్యంతో, వింత సోయగంతో నున్న ప్రకృతి కాంత మ్రోడు వారిని మానవ హృదయాలలో వసంతోదయం కలుగజేస్తుంది. సృష్టిలో నవజీవనం వసంత కాలాగమనంతో ప్రారంభవౌతుంది.

03/17/2018 - 21:29

విలంబ వత్సరేశ్వరుండు పృథ్వినేల వచ్చెనే
విలంబమేల స్వాగతంబు వేడ్కతోడ పల్క, కో
కిలంబ కూజితాలు సల్పుకింశుకాల భక్షణన్
భళీ! యటన్న పాలనంబు భాగ్యమందజేయగన్

విజేతవై, భవత్సహోదరాళి వెల్గుమా! విలంబరో!
విజృంభణంబుతోడ శాంతివృద్ధి చెంది ధాత్రిపై
భజింపగా వసంత సౌఖ్యమట్లు స్వాంతమందునన్
ప్రజల్, సుఖంబునందు భవ్యపాలనంబు సల్పుచున్

03/17/2018 - 21:26

కాలచక్రమొక
నిర్దిష్ట గమన శకటం
అదొక కాలమానం
కాలమొక అనివార్యం
కాలం నడిచే దిశలో
‘విలంబ’ రానే వచ్చింది
ఎన్నో ఆశల తోరణాలతో
ప్రపంచ గమనాన్ని
శాసించడానికి రానే వచ్చింది
ఉగాదిని మోసుకొచ్చింది
ఉషస్సులు పంచడం చూడు
మామిడిపిందెల నాట్యాలు
షడ్రుచుల విందులు
అపతి ఇంటా కనిపించాలి
తారతమ్యాలు వైషమ్యాలు వదిలి

03/17/2018 - 21:16

నేనొక కలల బేహారిని
కాలాతీత విహారిని
ఋతువుల కోసం ఋత్వికుడనై
కవితా క్రతువులు చేస్తాను
ఎడారి బ్రతుకుల్లో
ఎల కోయిల రాగాలు పలికిస్తాను
నిశి రేయిని ప్రసరించిన శశికిరణంలో
పసిప్రాయపు ప్రకృతి దరహాసం కోసం
ప్రభాత సంధ్యలు ప్రతిబింబించే వర్ణాలలో
ప్రతిధ్వనించే కలస్వనాల కోసం
శీతల హేమంతపు పులకింతలలో
భూతల వేదికపై విరిసిన పూబంతుల కోసం

Pages