S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

03/17/2018 - 21:15

అరె! ప్రకృతి సోయగాలు కొత్తగా
హృదయాలను పులకింపజేస్తున్నాయెందుకో?
సుమధుర గానాలాపన చెవులకింపై
మదిని పరవశింప జేస్తోందేలనో?
నలుదెసలా వ్యాపించిన సుగంధ పరిమళాలు
మనసును మత్తెక్కిస్తున్నాయెందుకబ్బా?
కోటి సూర్యప్రభలు చంద్రప్రభలై చల్లగా
హాయిగా గొలుపుతున్నాయేం మాయో?
రోజూ వినిపించే కష్టాల కడగండ్లు
దూదిపింజల్లా తేలికై మోయగల
భారమనిపిస్తున్నాయ్

03/17/2018 - 21:02

ఒక కొత్త వేకువ కోసం
కళ్లపూలను విప్పార్చి
ఆశగా
ఎదురుచూస్తున్న వేళ
చెట్లు పచ్చగా పిలుస్తుంటాయి
ఎర్రని లేత చివుళ్ల సందుల్లోంచి
తెల్లని వేపపూత
ముక్కుల్ని పలకరిస్తుంటుంది
మావికొమ్మల మాటు నుండి
మామిడిపిందెలు తొంగిచూస్తూ
నోరూరిస్తుంటాయి
ప్రక్కనున్న మావిచెట్టు పైనుండి
ఉషోదయాన
కోయిలొకటి
షడ్జమస్వరంతో

03/17/2018 - 21:00

వంచిన తల యెత్తకుండా
దీర్ఘాలోచనలో ఉన్నాడు విరించి
విపంచిపై సరిగమలు పలికిస్తూ
క్రీగంట పతిని గమనిస్తూనే ఉంది పలుకులమ్మ
గతంకన్న మిన్నగా తెలుగు లోగిలి వెలగాలని
మనోగతం వెలిబుచ్చాడు బ్రహ్మయ్య
సతిపతులిద్దరొక్కటిగా
నిశ్చయించారు ‘విలంబ’ని భువికి పంపాలని
కమలభవుని నోట మాట రాగానే
తన పరివారాన్ని సిద్ధం చేశాడు వసంతుడు

03/17/2018 - 20:59

ఉగాది పురుషా
ఈ వేసవిలో మరీచికలు రానివ్వకు
జలసంపన్న ఋతుపవనాలతో
జలజల వానలతో
పుడమి తల్లి పొంగిపోవాలి
వాన చినుకులతో
మట్టి వాసన మనసుల నలరించాలి
పూత పూసే చెట్లు చిరునవ్వులు చిందాలి
సస్యశ్యామలానికి నాంది పలకాలి
శ్రీ విలంబీ నీకు స్వాగతం
సంవత్సరాలు దశాబ్దాలుగా
దశాబ్దాలు శతాబ్దాలుగా
పరుగెడుతుంటాయి

03/17/2018 - 20:58

ఏడాదికోసారి పలుకరించే
అతిథీ నీకు స్వాగతం
నీ రాక కోసం మేమంతా
వేయి కన్నులతో వేచి చూస్తున్నాం
మామిడి పూతలు తిన్న
కోయిలలు నిన్ను
మధురంగా స్వాగతిస్తున్నాయి
చైత్రమాస ప్రారంభపు
నులివెచ్చటి కిరణాలు
నిన్ను సాదరంగా ఆహ్వానిస్తున్నాయి
జీవితంలోని చేదుని తీపిని
సమానంగా స్వీకరించాలని
ఉగాది పచ్చడి ద్వారా తెలుసుకుంటూ

03/17/2018 - 20:57

ప్రకృతి క్రొత్త క్రాంతితో
కాలంతో పరుగు
మట్టి గుండెలో చిగురు వెలుగులు
కోకిలమ్మ పాటతో
మానవతా సుగంధం వికసిస్తోంది
పువ్వు నవ్వులా

03/11/2018 - 06:01

చక్రవర్తులు, రాజులు, సామంత రాజులు, సంస్థానాదీశులు, దేశ్‌పాండేలు తదితరుల నేతృత్వంలో సాగిన పాలనల్లో మెదక్ జిల్లా అల్లాదుర్గం సంస్థానం ప్రత్యేక ముద్ర వేసుకుంది. ఆయా సంస్థానాల మాదిరిగానే అల్లాదుర్గం సాదాసీదా ఏ మాత్రం కాదు. అనేక ప్రత్యేకతలను సంతరించుకున్న గొప్ప సామ్రాజ్యం. గ్రామంలో ఆధ్యాత్మికత అడుగడుగునా ఉట్టి పడుతోంది.

03/11/2018 - 05:54

‘శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తిగానం రసం ఫణిః’ - అంటే సంగీతాన్ని శిశువులు, పశువులు, పాములు కూడా సంతోషంగా ఆస్వాదిస్తాయి. కృష్ణుడు కూడా తీయని వేణుగానం ఆలపించేవాడు. సంగీతం, కూచిపూడి నృత్యంలో ప్రవీణులు డి.ఎస్.వి.శాస్ర్తీ ప్రఖ్యాతి చెందిన కళాకారుడు. వీరు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, సరోజినీనాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో నృత్యశాఖలో సంగీతకారుడుగా పని చేస్తున్నారు. వారితో ముఖాముఖి...

03/11/2018 - 05:48

ఉదయానే్న కాఫీ తాగడం చాలామందికి అలవాటే. కానీ, కమ్మటి కాఫీకి బానిసైన ఆ యువకుడు ఎప్పుడు పడితే అప్పుడు ‘కుదిరితే కప్పు కాఫీ’ అంటాడు. రుచికరమైన కాఫీని ఆస్వాదించేందుకు ఎక్కడికైనా వెళుతుంటాడు, ఎంతటి ఖర్చుకైనా ‘సరే’ అంటాడు. కాఫీ తాగితే అద్భుతమైన రుచి ఓ మధురానుభూతిలా ఉండాలంటున్న కేరళకు చెందిన 28 ఏళ్ల బిన్నీ వర్గీస్ దేశవ్యాప్తంగా ఎన్నో కాఫీ షాపులను సందర్శించాడు.

03/11/2018 - 05:09

గ్రామంలోని ప్రజల ఆస్తిపాస్తులకు కరణీకం చేసే వ్యక్తి కరణం. ఆ కరణానికి కొడుకు, కోడలుండేవారు. తన తరువాత ఒకడే దస్త్రం కట్టవలసి ఉంటుంది. కొడుకు లెక్కలు వ్రాయుట భూముల వివరాలు చెప్పుట మొదలెట్టాడు. కొన్ని రోజుల తరువాత ఆ కొడుకు విసిగిపోయి తలకట్టు కొన్నాడు. తలకట్టుకొనుట అంటే భీష్మించుకొనుట.

Pages