S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

03/11/2018 - 05:07

కొడుకుల్లు పుట్టన్ని కడుపేమి కడుపు?
కుల ముద్ధరించన్ని కొడుకేమి కొడుకు?
కన్నకానుపులెల్ల కడుచక్కనయితె,
కన్నుల్ల పండుగే కన్నతల్లికిని.
లాభమ్మ లాభమ్ము ఏమి లాభమ్ము?
కొడుకులను గంటేను కోటి లాభమ్ము
గోరంతదీపమ్ము కొండలకు వెలుగు
గోపాలకృష్ణమ్మ గోవులకు వెలుగు
మాడంత దీపమ్ము మేడలకు వెలుగు
మారాజు అబ్బాయి మా కళ్ల వెలుగు

03/11/2018 - 05:06

అక్కడక్కడ బంతి
అంతరాల బంతి
మద్దూరి సంతలోన
మాయమైన బంతి

జవాబు: -సూర్యుడు

03/11/2018 - 05:05

నువ్వు నిరుపేదవని అనుకోవద్దు. ధనం నిజమైన శక్తి కాదు, మంచితనం, పవిత్రతలే నిజమైన శక్తి
-స్వామి వివేకానంద

03/11/2018 - 05:03

నీళ్లలోన మొసలి నిగిడి యేనుగు బట్టు
బయట కుక్క చేత భంగపడును
స్థానబలిమి కాని తన బల్మి కాదయా
విశ్వదాభిరామ వినుర వేమ
- మొసలి నీళ్లలో ఉన్నపుడు ఏనుగునైనా పట్టుకుంటుంది. బయటకు వస్తే కుక్క చేత కూడా భంగపాటు చెందుతుంది. అది స్థానబలం అవుతుంది కానీ తన బలం కాదు.

03/11/2018 - 05:01

* మంచి కొంచెమైనా చాలు విత్తనం చిన్నదైనా చాలు
* మా ఇంటికొస్తే మాకేం తెస్తావు? మీ ఇంటికొస్తే మాకేమి ఇస్తావు?
* వెఱ్ఱి వేయి విధాలు పైత్యం పదివేల విధాలు
* సూర్యుని మొగాన దుమ్ము చల్లితే ఎవరి కంటబడుతుంది?
పాత సామెత - కొత్త సామెత
* ఇంటి పేరు కర్పూరం వారు - ఇంట్లో గబ్బిలాల కంపు
- పేరు సత్యారావు - చెప్పేవన్నీ అబద్ధాలు
- పేరు సుందరి - చూడబుద్ధి రాదు

03/11/2018 - 04:57

ఇద్దరు ఆడపిల్లలు కాని నలుగురు కాని ఈ ఆట ఆడుతుంటారు.
నలుగురు ఆడినప్పుడు ఇద్దరిద్దరు ఒక జట్టుగా ఉంటారు. నలుచదరపు గీత ఒకటి గీస్తారు. అందులో మళ్లీ ఆరు గళ్లు అంటే ఒకవైపు మూడు మరోవైపు మూడు ముందు ఒక గడి ఉండేవిధంగా అడ్డుగీతలు గీస్తారు. మొత్తానికి ఏడు గళ్లు ఉంటాయ. ఈ గళ్లనే ఒక్కో ప్రాంతంలో గుండాలు అని కూడా అంటారు.

03/11/2018 - 03:18

చమత్కారంగా సంభాషించడం ఓ కళ నాటికీ నేటికీ.
నాడు రాజుల వద్ద కొలువు సంపాదించేందుకు ఇలాంటి ప్రజ్ఞాపాటవాలే ప్రదర్శించేవారు. తెనాలి రామకృష్ణులు కూడా రాయలవారి కొలువులో ప్రాపకం సంపాదించినదీ ఇలానే...
అలాంటి ఉదంతమే ఇదీ..

03/10/2018 - 22:28

1.ఇదివరలో వేర్వేరు ప్రపంచ దేశాలు వేర్వేరు తేదీలలో మహిళా దినోత్సవం జరుపుకొనేవి. ఐక్యరాజ్యసమితి మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పటి నుంచి మొదటిసారిగా జరిపింది?
ఎ.1954 బి.1919
సి.1968 డి.1975
2.అవిభక్త ఆంధ్రప్రదేశ్‌కు తొలి మహిళా గవర్నర్‌గా 1977-78లో ఎవరుండేవారు?
ఎ.మార్గరెట్ ఆల్వా
బి.శారదా ముఖర్జీ
సి.అరుణ అసఫ్ అలీ

03/10/2018 - 22:14

ప్రతిరోజూ ఎన్నో పనులని చేద్దామని అనుకుంటాం. కానీ చేయలేకపోతాం. ప్రయత్నించి చేయలేక పోవడం వేరు. ప్రయత్నం చేయకపోవడం వేరు.

03/07/2018 - 02:59

ఒక్కో విషయాన్ని ఒక్కో వ్యక్తి ఒక్కో విధంగా దర్శిస్తారు. అది విషయంలోనే కాదు- వస్తువుల విషయంలో, ప్రాణుల విషయంలో, వృక్షాల విషయంలో కూడా వర్తిస్తుంది.
చెట్టు నా ఆదర్శం అన్నాడు కవి ఇస్మాయిల్. ‘చెట్టుని దాటుకుంటూ’ వచ్చానని అంటాడు కవి మిత్రుడు జూకంటి. చెట్టులా వౌనంగా ఉండాలని ఉంటుంది కానీ ఈ ప్రచండ గాలులు నన్ను వౌనంగా వుండనివ్వవు. అక్రమాలు అన్యాయాలు నన్ను వౌ నంగా ఉండనివ్వవు అంటాడు మరో కవి.

Pages