S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

03/07/2018 - 02:57

శీతాకాలానికి వీడ్కోలు పలుకుతూ గోవాలోని హిందువులు ఏటా మార్చి నెలలో జరుపుకునే ‘షిగ్మోత్సవ్’ (శిశిరోత్సవం) జానపద సంప్రదాయాలకు అద్దం పడుతుంది. హిందూ సంస్కృతిని, పురాణగాథల విశిష్ఠతను చాటిచెప్పేలా పల్లెవాసులు ఈ ఉత్సవాన్ని ‘హోలీ’ మాదిరి ఘనంగా జరుపుకుంటారు. గోవాలోని హిందువులు దీనిని పెద్దపండుగలా భావిస్తారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారు జానపద కళారీతులను ప్రదర్శిస్తూ ఆనందోత్సాహాల్లో తేలియాడతారు.

03/06/2018 - 23:23

బోళ్ల కమలాకర్ (గోదావరిఖని)
ప్ర: స్వగృహ యోగం ఉన్నదా? శేష జీవితం ఎలా గడుస్తుంది?
జ: మీకు తప్పకుండా స్వగృహ యోగం కలుగుతుంది. రెండంతస్తుల మేడ కాని రెండు వేర్వేరు ఇళ్లు కాని కడతారు. శేష జీవితం అంటే ఎవరికీ కూడా ‘కాలమొక్కరీతి గడువబోదు’ అని పెద్దలు చెప్పిన మాట. అయితే ధర్మాన్ని దైవాన్ని శాస్త్రాన్ని నమ్మినవాడు ఆచరించినవాడు కాల ప్రభావానికి నిలదొక్కుకోగలడు.

03/06/2018 - 23:22

ఈ రోజు సైన్స్‌లో, సాంకేతికంగా ఆవిష్కరణలలో భారతదేశం సాధించిన పురోగతి వెనుక ఎందరో శాస్తవ్రేత్తల కృషి ఉంది. ప్రపంచ పటంలో భారతదేశాన్ని ఒక సాంకేతిక శక్తిగా మార్చడంలో ఎందరో శాస్తవ్రేత్తలు కీలక పాత్ర పోషించారు.

03/06/2018 - 22:48

నీ తెలుగెవ్వరి పాలుచేసి తిరిగెదవాంధ్రా?-అని నొచ్చుకున్నారు మహా పండితులు శివరామశాస్ర్తీగారు. వీరు శతావధాని. షడ్దర్శన పండితుడు. 20వ శతాబ్దం తెలుగునాట మహాపండితులలో వీరు ఒకరు అని విశ్వనాథ సత్యనారాయణగారి ప్రశంసనార్జించినవారు. ఇక్కడి సురవరం ప్రతాపరెడ్డి గారితో, సామల సదాశివగారితో వేలూరి వారికి ఆత్మీయ సాహిత్య బంధుత్వం ఉండేది.

03/04/2018 - 21:49

అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది
మా ఇంటికొచ్చింది తైతక్కలాడింది?
*
జవాబు: -చల్లకవ్వం

03/04/2018 - 21:48

* పానకములో పుడక
* పిండి కొలది రొట్టె
* పిట్టకొంచెము కూత ఘనము
* పిల్లికి ఎలుక సాక్ష్యము
* చెప్పేవారికి వినేవారు లోకువ
* పువ్వు పుట్టగానే పరిమళించును
* పెదవి దాటిన పృథ్వి దాటును
* పోరునష్టము పొందు లాభము
* బూడిదలో పోసిన పన్నీరు
* మెరిసేదంతా బంగారము కాదు
* ఊళ్లో పెళ్లికి కుక్కల హడావిడి
* అబ్బలేని బిడ్డ మబ్బులేని వాన

03/04/2018 - 21:48

ఇచ్చునదె విద్య, రణమున
జొచ్చునదే మగతనంబు, సుకవీశ్వరులున్
మెచ్చునదే నేర్పు, వాడుకు
వచ్చునదే కీడు సుమ్ము! వసుధను సుమతీ!
- ఇతరులకు కూడా చెప్పగలిగితేనే అది విద్య అవుతుంది. యుద్ధ భూమిలో ప్రవేశించి యుద్ధం చేస్తేనే ధీరత్వం. ఉత్తమ కవులు కూడా పొగిడి మెచ్చుకుంటేనే నిజమైన కవిత్వం. పోట్లాటలు తెచ్చే పని చేయటం చాలా ప్రమాదకరం.

03/04/2018 - 21:47

పప్పు పెట్టి, పాయసం పెట్టి,
అన్నం పెట్టి, అప్పచ్చి పెట్టి,
కూర పెట్టి, ఊరుగాయ పెట్టి,
నెయ్యి వేసి, ముద్ద చేసి,
తినిపించి, తినిపించి,
చెయిగడిగి, మూతిగడిగి,
తాతగారింటికి దారేదంటే,
(అత్తవారింటికి దారేదంటే)
ఇట్లాపోయి, ఇట్లాపోయి,
మోచేతిపాలెం ముందర్నించి,
ఇట్లాపోయి, ఇట్లాపోయి,
ఇదిగో ఇదిగో, వచ్చాంవచ్చాం

03/04/2018 - 21:45

0x9+1=
1x9+2=
12x9+3=
123x9+4=
1234x9+5=
12345x9+6=
123456x9+7=
1234567x9+8=
123456789x9+10=
ఇక్కడ ఉన్న లెక్కలను చేస్తే గమ్మత్తుగా ఒకే అంకెతో సమాధానం వస్తుంది.

03/04/2018 - 21:44

ఆటలు ఆనందానికే కాదు ఆరోగ్యానికి మంచిదే. పిల్లలు కేరింతలు కొడుతూ నలుగురితో కలసి ఆడుకొంటే వారికి ఆనందం, శారీరిక ఆనందంతోపాటుగా మానసిక ఎదుగుదల కూడా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇంతకుముందు బడుల్లో ఆటస్థలం తప్పక ఉండేది. ఇపుడు అపార్ట్‌మెంట్స్ వల్ల ఆట స్థలమే కనుమరుగు అవుతూ ఉంది. దాని వల్ల మన గ్రామీణ ఆటలన్నీ కూడా కనిపించకుండా పోతున్నాయి.

Pages