S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

03/04/2018 - 21:38

పార్వతీపురం రాజధానిగా చేసుకుని కిరణ్ గజపతి పాలించేవాడు. అతడు ధర్మ పరిపాలకుడుగా పేరు పొందాడు. మంత్రి సుధాముడు తగు సలహాలనిచ్చి పాలనలో తన వంతు విధులు నిర్వహించేవాడు. ఒకనాడు రాజుగారికి ఓ సందేహం కలిగింది. మంత్రిని పిలిపించి ‘నిజాయితీ అంటే ఏమిటి? నిజాయితీ పరుడెవరు?’ అని అడిగాడు.

03/04/2018 - 21:26

ఆధ్యాత్మిక అంశాల్లో భారతదేశానికి అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. సనాతన ధర్మం కోసం పాటుపడే మహానుభావులకు భరతఖండం పుట్టినిల్లు. భగవంతుడు మనిషి రూపంలో జన్మించాలంటే ఈ పుణ్యభూమినే ఎంచుకుంటూ వస్తున్నాడు. రాముడు, కృష్ణుడు, దత్తాత్రేయుడు, వేంకటేశ్వరస్వామి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పేర్లు ఉంటాయి. అలాగే ఒక వివేకానందుడు, రామకృష్ణుడు, రమణమహర్షి తదితరులంతా భగవత్ అంశతో జన్మించినవారే.

03/04/2018 - 21:25

ప్రపంచంలో శాంతి నెలకొనేందుకు విశ్వయోగి విశ్వంజీ ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా ఆధ్యాత్మిక గురువులు కేవలం మతప్రచారంలో ఎక్కువగా మక్కువ చూపుతుంటారు. విశ్వంజీ మాత్రం మతం మనిషిని ఉన్నతస్థితికి తీసుకుపోయే ఒక మార్గమేనని, అది జీవన విధానమని అంటారు. 2018 మార్చి 5 న 74 వ జన్మదినోత్సవం జరుపుకుంటున్న విశ్వంజీ ఆంధ్రభూమి ప్రతినిధికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ వివరాలు ఇలా ఉన్నాయి.

03/04/2018 - 20:23

వ్యక్తులు రెండు రకాలు. చెప్పింది చేసేవారు మొదటి కోవకు చెందుతారు. తాము ఆచరించకుండా ఇతరులకు చెప్పి చేతులు దులుపుకునేవారు రెండో రకం. ఈయన మాత్రం మొదటి కోవకు చెందుతారు. హైదరాబాద్ మహానగరంలో ఆయనను దగ్గరగా గమనించిన వారు ఆయనలోని రెండో పార్శ్వాన్ని చూసి ఆశ్చర్యపోక తప్పదు. కారణం స్వతహాగా ఆయన రైతుబిడ్డ అయినా ప్రధాన వ్యాపకం ముద్రణ రంగంలో తలమునకలై ఉండటమే. దానికి తోడు తాను పుట్టి పెరిగిన పల్లె నేపథ్యం.

03/04/2018 - 20:22

పసుమర్తి రామలింగ శాస్ర్తీగారు ప్రఖ్యాత కూచిపూడి, భరతనాట్యం కళాకారుడు. వీరు నృత్యశాఖలో ప్రొఫెసర్. డీన్- సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ కమ్యూనికేషన్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. దశాబ్దాలుగా ఎం.ఏ. మరియు పిహెచ్.డి కళాకారులకు సంప్రదాయ నృత్యం నేర్పిస్తున్న నాట్య కళాధరుడు. వీ రితో జరిపిన ముఖాముఖిలో కొన్ని ము ఖ్యాంశాలు...
ప్ర: మీ ప్రస్థానం నాట్యంలో ఎలా జరిగింది?

02/24/2018 - 23:38

విషాదం నుండే విద్వాంసులు పుడతారని లోకోక్తి. ఈ మాట పుట్టడానికి కారణం ఏదైనా, ఎవరైనా అది నిజమే అనిపిస్తుంది రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కి చెందిన కివరాజ్ గుర్జార్‌ని చూస్తే. అరవై ఎనిమిదేళ్ల గుర్జార్ జీవితంలో అతి పెద్ద విషాదాన్ని చవి చూసిన వ్యక్తి. 4 నవంబర్ 2014లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో అతని భార్య, కుమారుడు, మనవడు దుర్మరణం పాలయ్యారు.

02/24/2018 - 23:16

రెండు దేశాలు ఏదైనా ఆట ఆడుతున్నపుడు ఆ దేశవాసులు తమ జట్టు గెలవాలని అనుకుంటారు. అది సహజం. మంచిది కూడా. ఆటగాళ్లు ఓడిపోతే చాలా నిరుత్సాహం కూడా చెందుతారు.
క్రికెట్ ఆటలో మన వాళ్లు ఓడిపోతే మన దేశవాసులు చాలా నిరుత్సాహపడతారు. క్రికెటర్లని టమోటాలతో కొట్టిన సందర్భాలు కూడా వున్నాయి.

02/24/2018 - 23:12

దూరతీరాల నుండి ఏటా క్రమం తప్పకుండా వచ్చే విదేశీ అతిథులు ఈసారి కూడా పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. ఎక్కడో సైబీరియా దేశం నుండి వేల మైళ్ల దూరాన్ని గగన మార్గంలో ప్రయాణించి తుంగతుర్తి మండలానికి వచ్చే విదేశీ పక్షులను చూసేందుకు ఎంతోమంది ఆసక్తి చూపుతుంటారు.

02/24/2018 - 23:07

తల్లిదండ్రులూ జాగ్రత్త వహించండి.

02/24/2018 - 23:05

లక్కవరపు మాణిక్యాంబ (తాడేపల్లిగూడెం)
ప్ర: శని దోషాలు పోవాలంటే - కాలసర్ప దోషాలు పోవాలంటే ఏం చేయాలి?
జ: శనీశ్వరుని ముందు నువ్వుల నూనె - ఆముదం - నెయ్యి కలిపి, తెలుపు నలుపు పసుపురంగు దారాల వత్తి వేసి దీపం వెలిగించండి. కాకులకు నల్ల నువ్వులు కలిపిన అన్నం పెట్టండి. కాలసర్ప దోషానికి దుర్గాదేవికి గాని, సుబ్రహ్మణ్యేశ్వరునికి కాని నిమ్మ పండ్లు ప్రతి మంగళవారం సమర్పించండి. శుభం జరుగుతుంది.

Pages