S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

02/24/2018 - 22:59

ఈ మధ్య ఆర్.టి. నోబుల్ జీవితయానం అనే పుస్తకం వచ్చింది. ఆయన పూర్తి పేరు రాబర్ట్ టర్లింగ్‌టన్ నోబుల్. ఈ పుస్తకాన్ని ఆయన తమ్ముడు జాన్ నోబుల్ రచించాడు. 1866 కేంబ్రిడ్జ్ సస్సెక్స్‌లో ఇది అచ్చైంది. మచిలీపట్నం గురించిన ప్రస్తావన రాగానే ముందుగా నోబుల్ కళాశాల గుర్తు వస్తుంది. ఆర్.టి. నోబుల్ 1841 జులై 4వ తేదీన మద్రాస్ (చెన్నపట్నం)లో ఓడ దిగాడు.

02/24/2018 - 22:10

కార్మోడి ఆ రేడియో ప్రసారాన్ని వినలేదు. అతను పక్క మీద కూర్చుని చేతిలో పెన్సిల్, నోట్‌బుక్‌లతో టేప్ రికార్డర్ లోంచి వచ్చే పాటని వింటున్నాడు. అతను ఆ పాటలోని మాటలని జాగ్రత్తగా విన్నా అర్థం కావడంలేదు.

02/24/2018 - 21:42

డాక్టర్ కె. ప్రశాంత్ గొప్ప తబలా వాద్యకారుడు. చక్కటి గాత్ర సంగీతకారుడు. ఇంకా రంగస్థల నటుడు. వృత్తిగా యశోదా హాస్పిటల్‌లో సైకాలజిస్టుగా పనిచేస్తున్న ప్రశాంత్- ప్రవృత్తిగా కళలకు ఎంతో సేవ చేస్తున్నారు. వారితో ముఖాముఖి ఇలా ...
ప్రశ్న: మీ బాల్యం గురించి చెప్పండి..

02/24/2018 - 21:31

జిల్లా కేంద్రంగా ఆవిర్భవించి, తెలంగాణలోనే ప్రత్యేకతను సంతరించుకున్న సిద్దిపేటలో కోమటి చెరువు కొత్త అందాలను సంతరించుకుంది. తెలంగాణ రాష్ట్రానికి ఇది ఓ కొల్లేరు సరస్సులా ప్రసిద్ధి చెందుతోంది. కాకతీయ రెడ్డి రాజుల కాలంలో సాగునీటిని అందించడానికి తవ్వించిన కోమటి చెరువు ప్రాంతంలో ఒకప్పుడు రైతులు నడయాడితే ఇప్పుడు పర్యాటకులు సేద తీరుతున్నారు.

02/18/2018 - 05:56

కాఫీ తాగడానికి ఆ కేఫ్‌కు వెళితే సర్వర్లు, వెయిటర్లతో పని లేదు. అక్కడి రోబోలే మనకు చక్కగా అతిథి మర్యాదలు చేసి ఆప్యాయంగా కాఫీ అందిస్తాయి. జపాన్ రాజధాని టోక్యోలోని డౌన్‌టౌన్ బిజినెస్ ఏరియాలో ‘హెన్నా కేఫ్’లో ‘కాఫీ ప్రేమికుల’కు రోబోలు స్వాగతం పలుకుతాయి. వెండింగ్ మిషన్ ద్వారా కస్టమర్లు కొనుగోలు చేసిన టిక్కెట్‌ను స్కాన్ చేయడం, రుచికరమైన కాఫీని కలిపి అందించడం వంటి పనులను రోబోలే చేస్తాయి.

02/18/2018 - 05:54

చైనాకు చెందిన ప్రఖ్యాత మొబైల్ కంపెనీ ‘క్సియోమీ’ రెండు అధునాతన స్మార్ట్ఫోన్లను రంగంలోకి దించుతోంది. ఎంఐ మిక్స్-2ఎస్, ఎంఐ-7 అనే పేర్లతో ఇవి మార్కెట్‌లోకి ప్రవేశించబోతున్నాయి. ఎంఐ-7 రకం స్మార్ట్ఫోన్‌లో ప్రత్యేకతలకు సంబంధించి ఇప్పటికే కొన్ని వార్తలు వెలుగుచూశాయి. ఇందులో ఆకట్టుకునే ఫీచర్లు:

02/18/2018 - 05:14

ఆ గదిలో కాంతి చాలా మంద్రంగా ఉండటంతో, చూడగానే అది ఖాళీగా ఉంది అనిపిస్తుంది. కొన్ని క్షణాల తర్వాత బల్ల వెనక కుషన్ కుర్చీలో కూర్చున్న ఆయన ఫోన్ రిసీవ ర్ని అందుకున్నాడు. నంబర్ చూడకుండానే ఆయన దాని బటన్స్‌ని నొక్కాడు. అవతలి వైపు రిసీవర్ ఎత్తేదాకా వేచి ఉన్నాడు.
‘హలో’ ఓ వృద్ధురాలి కంఠం వినిపించింది.
‘మిసెస్ హానా జెల్బ్‌మేన్?’ ఆయన నెమ్మదిగా, మృదువుగా అడిగాడు.

02/18/2018 - 04:49

ఈ ఏడాది మార్చి 10వ తేదీ ఆ ఇద్దరు మహిళల జీవితాల్లో నిజంగా మరపురానిది, మధురమైనది.. ఓ ‘గ్లైడర్’లో గగన వీధుల్లో విహరించి 80 రోజుల్లో 21 దేశాలను సందర్శించేందుకు వారు సాహసయాత్రకు సన్నద్ధం కావడం ఓ సంచలనం.. ఆ ఇద్దరూ తల్లీకూతుళ్లు కావడం మరో విశేషం..

02/18/2018 - 04:48

డాక్టర్ అనుపమ కైలాశ్ అత్యుత్తమ కూచిపూడి, విలాసినీ నృ త్య కళాకారిణి. దశాబ్దాలుగా కళకు అంకితమైన అనుపమ సౌందర్య రాశి. నర్తకిగా, గురువుగా, తల్లిగా, గృహిణిగా ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తూ నృత్యంలో పరిశోధన చేసి, ‘అన్నమయ్య పదములు - నాయికలు’ అనే అంశంతో పిహెచ్.డి చేశారు. ఆ పుస్తకాన్ని ప్రచురించి అందరి మన్ననలు పొందారు. ఇప్పుడు సిలికాన్ ఆంధ్రా యూనివర్సిటీలో బోధన చేస్తున్నారు డా.అనుపమ కైలాశ్.

02/18/2018 - 04:40

రాఘవాపురంలో నివసించే రామయ్యకు ఎండుకట్టెలే జీవనాధారం. వాటి కోసం కష్టపడి అడవంతా గాలిస్తాడు. దొరికిన కట్టెల్లో చిన్నవాటిని విరిచి, పెద్ద దుంగల్ని గొడ్డలితో నరికి మోపులు కడతాడు. ఏ రోజు ఏరుకున్న కట్టెలు ఆ రోజే అమ్మేసి వచ్చిన సొమ్ముతో సంతృప్తిపడి ఇంటికెళ్లిపోతూ ఉంటాడు.

Pages