S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

02/10/2018 - 22:20

పల్లెలో చదువు అయిదవ తరగతి దాకా సాగింది. పల్లెలో నా తరగతిలో నాకంటే తెలివిగలవారు ఎవరూ లేకపోవడం ఆశ్చర్యం కాదు. కనుక నాకు పోటీ లేదు. అయితే అది చదువు వరకు మాత్రమే. ఆటపాటలు నాకు అసలు చేతకావు. పల్లె బడిలో కూడా సంవత్సరానికి ఒకసారి ఆటల పోటీలు ఉండేవి. సెంటర్ స్కూల్ కనుక పక్క పల్లెల వాళ్లు కూడా పోటీలో పాల్గొనేవారు. ఆ పోటీల్లో నాకు పాల్గొనడానికి అవకాశం ఉండేది కాదు.

02/10/2018 - 22:15

గోదావరీ నది దక్షిణ తీరమున పరివ్యాపితమైయున్న కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో, ఉత్తర దక్షిణ భారతీయులకు సేతువై నిలిచిన ఈప్రాంత నాగరికత కాల ప్రవాహంలో కొట్టుకొని పోయినా, ఔత్సాహికులైన చారిత్రక పరిశోధకుల అవిరళ కృషి ఫలితంగా కథలుగా, గాధలుగా, నోళ్ళలో, రాళ్ళలో, ఆకులలో, రేకులలో, ఆక్కడక్కడా నిక్షిప్తమైయున్న చరిత్ర కొంతవరకు వెలుగులోకి రాగలిగింది.

02/10/2018 - 22:12

భక్తులు కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా స్వయంభూ దైవమైన శ్రీరాజరాజేశ్వర స్వామికి పేరుంది. జగిత్యాల జిల్లాలోని సారంగాపూర్ మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతమైన పెంబెట్ల గ్రామం వద్ద గుట్టపైన శ్రీరాజరాజేశ్వరుడు వెలసియున్నాడు.

02/10/2018 - 22:08

దక్షిణ భారతదేశంలోని పురాణ ప్రసిద్ధమైన శైవ క్షేత్రాల్లో దక్షిణ కాశీగా ప్రశస్తి గాంచిన అతిప్రాచీన క్షేత్రం వేములవాడ. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు 150 కిలోమీటర్లు,ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం భక్తుల పాలిట కల్పతరువై, తెలంగాణకు తలమానికమై భాసిల్లుతున్నది. తెలంగాణీయులు ఏముడాల రాజన్నగా కొలుస్తూ నిత్యం కోడెలు కడుతుంటారు.

02/10/2018 - 22:01

ఎతె్తైన కొండలు... గలగల పారే జలపాతాలు... ఆహ్లాదపరిచే వనసంపద.. మధ్యలో పరమేశ్వరుడు ఉమా కోటిలింగేశ్వరునిగా వెలిశాడని ప్రతీతి. దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ ఆలయం విజయనగరం జిల్లా ఎస్.కోటకు సమీపంలో ఉంది. పూర్వం రుషులు తపస్సు చేసి పరమేశ్వరుని సాక్షాత్కారం పొందారు. అనంతరం ఇక్కడ శివుడు లింగరూపంలో ఆవిర్భవించాడని పూర్వీకుల కథనం.

02/10/2018 - 21:55

శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం శ్రీముఖలింగం గ్రామంలో కొలువై ఉన్న శ్రీముఖలింగేశ్వరుని దర్శనం మోక్షానికి మార్గం. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ క్షేత్రం దక్షిణకాశీగా పేరొందింది. రాజులు, జమీందారులతో ఇక్కడి విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి. ఇక్కడ సాక్షాత్తు శివుడే ఉద్భవించి ముఖ దర్శనం ఇచ్చారని అం దుకే ముఖలింగేశ్వరునిగా, మధువృక్షం(విప్పచెట్టు) పూజలందుకుంటుండడంతో మధుకేశ్వరునిగా పిలువబడుతోంది.

02/10/2018 - 21:40

కాసిన్ని నీళ్లుపోసినా సంతృప్తిచెంది కరుణించేది పరమశివుడు. విభూతితో అభిషేకించినా, మారేడు దళములు సమర్పించినా చివరకు శివా నీవేదిక్కని చేతులు జోడించి కొలిచినా సంతుష్ఠుడవుతాడు సృష్టిలయకారుడు, గంగాధరుడు, గౌరీమనోహరుడు. భక్తులపాలిట కొంగుబంగారమై వారికి సకల సౌకల్యానిస్తాడు బోళాశంకరుడు.

02/10/2018 - 21:33

పటాన్‌చెరు నియోజకవర్గంలోని అమీన్‌పూర్ మండలం భీరంగూడ గ్రామ పరిధిలో ఉన్న భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రానికే వనె్న తెచ్చే ఆలయంగా అలరారుతోంది. తెలంగాణలోని ఇతర శివాలయాల కంటే భిన్నంగా అత్యధిక ప్రాచుర్యం సొంతం చేసుకున్న భీరంగూడ శివాలయం భక్తుల కొంగు బంగారంగా దినదినాభివృద్ధి చెందుతోంది. ఓంకార స్వరూపుడైన శివుడు కొలువుదీరిన ఈ పుణ్యక్షేత్రం మహా శైవక్షేత్రంగా విరాజిల్లుతోంది.

02/10/2018 - 21:29

తెలంగాణలోని శివాలయాలలో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నది కొమురవెళ్లి మల్లికార్జునస్వామి దేవాలయం. ఇది సిద్దిపేట జిల్లాలో మండల కేంద్రం అయన కొమురవెళ్లిలో ఉంది. 11వ శతాబ్దంలో ఓ గొర్రెల కాపరికి స్వామివారు కలలో వచ్చి ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలసి ఉన్నానని, తనను దర్శించుకుంటే కోర్కెలు నెరవెరుతాయని చెప్పినట్లుగా చారిత్రక కథనం.

02/10/2018 - 21:27

కాశీనాం మరణాః ముక్త్తి, కాళేశ్వరనాః దర్శనాం ముక్త్తి. కాశీలో ముక్తి ప్రసాదించినట్లు కాళేశ్వరం దర్శనం చేసుకున్నట్లయితే అదే ముక్త్తి లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కాశీ దర్శనం చేసుకోకపోయినా కాళేశ్వరం దర్శనం చేసుకున్నట్లయితే భక్తులకు ముక్త్తి లభిస్తుందనేది భక్తుల అపార నమ్మకం. అందుకే మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు కాళేశ్వరం దర్శనానికి తాపత్రాయపడుతారు.

Pages