S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

08/28/2016 - 00:20

అభినందన్ తను రాసే పేపర్ని నలిపి, లేచి వెళ్లి చెత్తబుట్టలో పడేసి, మళ్లీ వచ్చి కూర్చున్నాడు. ఇంకో కాగితం తీసుకుని మళ్లీ ఏదో రాయడం గమనించిన తల్లి అడిగింది.
‘ఏమిటి? ఇందాకటి నించి కాగితాలతో కుస్తీ పడుతున్నావు?’

08/27/2016 - 23:13

భారతదేశం ఎంతోమంది మహాపురుషులకు, సాధువులకు, స్వాములకు నిలయం. దక్షిణా పథంలో ఒక గ్రామంలో ఒక స్వామి చిన్ననాటనే వెలుగులోకి వచ్చారు. క్రమంగా ఆయన కీర్తి రాష్ట్రం ఎల్లలు దాటి, దేశం నలుమూలలా వ్యాపించి, ఆఖరికి ప్రపంచం నలుమూలలా విస్తరించింది. వారి మహిమలు అపారం. అందువలన వారికి దేశీయ, విదేశీయ భక్తులు పెక్కులుండేవారు. కాపాడమని వారిని ఆశ్రయించేవారు.

08/27/2016 - 22:35

డైరీలు రాసే అలవాటు చిన్నప్పుడు ఎక్కువగా ఉండేది. ఉద్యోగ బాధ్యతల్లో పడిన తరువాత తగ్గిపోయింది. కాని రాస్తే బాగుండునని అన్పిస్తుంది. ఉద్యోగంలో చేరినప్పుడు రాసిన పేజీ మాత్రం ఉండిపోయింది. న్యాయవాదిగా ఉండి న్యాయమూర్తిగా పరిణామం చెందిన క్రమం అందులో కనపడింది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లభించింది.

08/27/2016 - 22:34

మనిషి జీవితం విచిత్రమైనది.. యవ్వనంలో సమయం, శక్తి ఉంటుంది
కానీ డబ్బు ఉండదు. మధ్యవయసులో అయితే డబ్బు, శక్తి ఉంటాయి
కానీ సమయం ఉండదు
వృద్ధాప్యంలో సమయం, డబ్బు ఉన్నా.. కష్టపడే శక్తి ఉండదు.

08/21/2016 - 05:45

ఎవ్వరూ మిమ్మల్ని నమ్మడం లేదనిపించినపుడు నిరుత్సాహపడవద్దు. ముందు మిమ్మల్ని మీరు నమ్మడం అలవరచుకోండి.
అందుబాటులో వున్న వనరులతో మీరు ఏమి చేయగలరో ఆలోచించుకుంటూ ఊహాలోకాల్లో విహరించక మీరు ఏమి చేస్తారో నిర్దిష్టంగా నిర్ణయించుకోండి.

08/21/2016 - 05:11

పూర్వం విష్ణు భక్తుడైన సుఫల రాజ్యానే్నలే హరికేతుడనే రాజుకి పిల్లలు లేకపోవడమనే కొరత తప్ప మరే కొరతా లేకుండా ఉండేది. రాజుగారు అనేక పూజలు, హోమాలు చేయగా సంతృప్తుడైన విష్ణువు ఒకనాడు రాజుగారి కలలో సాక్షాత్కరించి నీ తోటలో అన్నిటికన్నా మేటియైన మధుర ఫలమును రాణి మధూలికతో తినిపించిన యెడల సంతానప్రాప్తి కలుగుతుందని వరమొసగాడు.

08/21/2016 - 04:48

బత్తాయిలు అమ్మేవాడు ఇలా అమ్మసాగాడు. విడిగా కొంటే కాయ రూపాయి, ఐదు డజన్లు కొంటే 20 ఉచితం, రెండు డజన్లు కొంటే 7 ఉచితం, ఒక డజను కొంటే 3 ఉచితం, అర డజను కొంటే 1 ఉచితం. సోము 133 కాయలు కొనాలంటే ఎలా కొంటే ఎక్కువ ఉచితంగా తక్కువ రేటులో పొందవచ్చు? ఒక్కొక్క బత్తాయి రేటు ఎంత?

08/21/2016 - 00:12

వేసవి సెలవుల్లో అంతా అమ్మమ్మ, తాతయ్యల ఊరు వెళ్లాలని నిర్ణయించుకున్నాక ఉద్ధవ్‌కి సమ్మర్ క్లాసెస్ మొదలవుతాయని తెలిసింది. దాంతో ఉద్ధవ్‌ని తీసుకెళ్లాలా? వద్దా అన్న చర్చ ఇంట్లో మొదలయింది. ఆ క్లాస్‌లకి హాజరవడం మంచిదని చివరికి ఉద్ధవ్ తండ్రి నిర్ణయించాడు. వాడిని చూసుకోవడానికి తను ఆగిపోవాలని కూడా నిర్ణయించాడు.

08/20/2016 - 21:08

చిన్నపిల్లలకి బహుమతులంటే చాలా ఇష్టం. పెద్దవాళ్లు పట్టణానికి వెళ్లి తిరిగి వచ్చినప్పుడు ఏదో బహుమతి తెచ్చేవాళ్లు. పిల్లలు వాటి కోసం ఎంతో ఎదురుచూస్తారు.
నేను పదవ తరగతి పాస్ కాగానే మా అన్నయ్య నాకు ఓ చేతి గడియారాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఆ బహుమతిని తీసుకున్నప్పుడు ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందం.

08/20/2016 - 21:00

వౌనం యొక్క ఫలితం ప్రార్థన ప్రార్థన యొక్క ఫలితం నమ్మకం
నమ్మకం యొక్క ఫలితం ప్రేమ ప్రేమ యొక్క ఫలితం సేవ.. సేవ యొక్క ఫలితం సంతృప్తి

Pages