S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

01/27/2018 - 23:53

ప్రపంచ తెలుగు మహాసభలు...
పుస్తక ప్రదర్శన...
నాగోబా జాతర...
మేడారం జాతర...
అన్నీ జాతరలే.
అన్నీ ప్రజల సమూహాలే!
సందర్భం వేరు. స్థలం వేరు.

01/27/2018 - 23:50

వనదేవతలు సమ్మక్క-సారక్కల జాతరకు మేడారం సిద్ధమైంది. రారండంటూ దండకారణ్యంలోని మేడారం స్వాగతిస్తోంది. నిలువెత్తు చెట్లు, దట్టమైన అటవీ ప్రాంతం, జలజల పారే సెలయేరు, కనువిందు చేసే గిరిజన సంప్రదాయాలూ ఒకచోట కొలువైన మేడారం జాతరకు ఈసారి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. 1996 నుంచి ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న రాష్ట్ర పండుగ మేడారం జాతర.

01/27/2018 - 21:48

ఆదివాసి, జానపద వీరుల చరిత్ర చుట్టూ దట్టమైన కాల్పనిక పొరలు ఆవరించుకుని ఉంటాయి. వాటిలో వాస్తవికత దాగి ఉంటుంది. దానిని గుర్తించడానికి చాలా శ్రద్ధ అవసరం. పైగా ఆ వ్యక్తులు, సంఘటనల గురించి లోతుగా తెలుసుకోవాలి. వాటిని క్రమరీతిలో అవగాహన చేసుకోవాలి. ఇతర కాలాలను, సంఘటనలను తరచి చూసి జరిగిన సామాజిక రాజకీయ సాంస్కృతికాంశాల నేపథ్యాలను ఒక్కొక్కటే బేరీజు వేయాలి.

01/27/2018 - 21:43

మేడారం జాతరలో ప్రధాన ఘట్టాలైన సమ్మక్క, సారలమ్మ దేవతలను గద్దెపైకి తీసుకురావడం ఓ అద్వితీయమైన అనుభూతి. ఆ అనుభూతిని వర్ణించలేం. లక్షలాది మంది భక్తులు తమ హృదయంలో సమ్మక్క-సారలమ్మను నింపుకొని మొక్కుబడులు చెల్లించే దృశ్యాన్ని చూడాలి తప్ప వర్ణించలేం. సమ్మక్క, సారలమ్మ పూజారులను అధికారులు ఒప్పించి అమ్మవారి గద్దెకు తీసుకువస్తారు.

01/27/2018 - 21:36

ఒకవైపు ఆదివాసులు ‘మా అడివిని ద్వంసం జేస్తున్నరు. మా సమ్మక్క, సారక్క జాతర నుంచి మమ్మల్ని యెల్లగొట్టే కుట్రలు జరుగుతున్నయి. గీ పట్నము, హిందుత్వ లెక్కలన్నీ మామీద రుద్దొద్దు. మా జాతరను మా ఆదివాసీ నాగరికతగానే జరుపుకుంటము. మా రీతిరివాజులే సాగాలి. బైటోల్లొచ్చి మా మేడారాన్ని బరిబాతల జెయ్యొద్దు. మా అడివి మాదే. మా సమ్మక్క సారక్క జాతరని తెలంగాణ ‘కుంభమేళా’ అని ప్రచారము కొత్తగ మొదలుబెడ్తున్నరు.

01/27/2018 - 21:32

తెలంగాణలో వందలాది సంవత్సరాల నుండి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మాఘ పౌర్ణమి మొదలుగా వరుసగా మూడు రోజులపాటు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర జరుపుకోవడం ఆనవాయితీ. ముఖ్యంగా సంక్రాంతి పండుగ తదుపరి వ్యవసాయదారులకు, గ్రామీణ ప్రజలకు వ్యవసాయ ఉత్పత్తులు పూర్తయి సంతోషంగా ఉన్న సందర్భంలో కుటుంబ సభ్యులంతా సామూహికంగా ఈ జాతరలో పాల్గొంటారు.

01/27/2018 - 21:30

కాకతీయుల సైన్యంతో జరిగిన పోరాటంలో వారికి చిక్కకుండా సంపెంగవాగులో దూకి ఆత్మార్పణం చేసిన జంపన్నకు గుర్తుగా సంపెంగవాగును జంపన్నవాగుగా పిలుస్తున్నారు. మేడారం జాతరకు వచ్చే ప్రజలు చిన్నాపెద్దా అంతా జంపన్నవాగు నీటిలో స్నానమాచరించిన తరువాతే దర్శనాలకు వెళతారు. మొక్కులు తీర్చుకుంటారు. వాగులో పసుపుకుంకుమలు కలిపి కత్తెరలు ఇచ్చి సమ్మక్క-సారలమ్మలను తలచుకుంటారు. పూర్వం సహజసిద్ధంగా జంపన్నవాగుకు నీరందేది.

01/27/2018 - 21:27

మేడారం జాతరకు హాజరయ్యే భక్తులు మొదట దర్శించుకునేది గట్టమ్మతల్లిని. వరంగల్‌కు 104 కిలోమీటర్ల దూరంలో ఉండే గట్టమ్మ తల్లి గుడివద్ద ఎలాంటి సౌకర్యాలు లేకపోయినప్పటికీ భక్తులు ఆమెను మరచిపోరు. మేడారం-హనుమకొండ
రహదారిపై ప్రేమ్‌నగర్ ప్రాంతంలోని గద్దెలపై ఈ గట్టమ్మ గుడి ఉంది. జాతరకు వెళ్లే ఏ
వాహనమైనా ఇక్కడ ఆపి
ప్రయాణికులు పూజలు చేసి

01/27/2018 - 21:23

ఎర్రటి దుమ్ముతో ఉన్న ఇరుకైన రహదారులు... పచ్చటి చెట్లతో కూడిన దట్టమైన అడవులు... నల్లటి పొగతో కూడిన పరిసరాలు.. మట్టి వాసనతో మొదటి రోజు.. పొగసూరిన వాసనలతో కూడిన రెండవ రోజు... నల్లటి మొహాలతో దుర్గంధంతో కూడిన మూడవ రోజు... ఉదయమే భరించలేని దుర్వాసనలతో నాల్గవ రోజు... ఇలా 1994లో మేడారం జాతరలో విధులు నిర్వర్తించే అధికారులు ఎదుర్కొన్న పరిస్థితులు... ఈ విధమైన పరిస్థితులు దాదాపు 2004 వరకు ఉన్నాయి.

01/27/2018 - 21:17

మానవ జీవితంలో మార్పు కీలకమైంది. కాలం తెచ్చే మార్పులతో మానవ నాగరికత విరాజిల్లుతూ వస్తోంది. కాలం-మార్పులు కలిసే ప్రయాణిస్తుంటాయి. ప్రయాణానికి సంబందించి కూడా సమాజంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కాలం మహిమే అలాంటిది. ఒకప్పుడు ఎడ్లబండ్లు ప్రధాన ఆకర్షణగా జరిగే మేడారం మహాజాతర నేడు హెలికాప్టర్ ప్రయాణానికి చేరుకుంది.

Pages