S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

01/27/2018 - 21:13

మేడారం జాతరలో పూజా విధానం పూర్తిగా గిరిజన సంప్రదాయంలో, అత్యంత విశిష్ఠమైన పద్ధతిలో నిర్వహిస్తారు. రెండేళ్లకోమారు మాఘ శుద్ధ పౌర్ణమి రోజుల్లో జాతర జరుగుతుంది. రెండువారాల ముందు సమ్మక్క-సారలమ్మ గుడులను శుభ్రం చేస్తారు. నూతన పూజా సామగ్రితో కొత్తగా దుస్తులను అలంకరిస్తారు. వారం ముందువచ్చే బుధవారం నాడు పూజలు నిర్వహిస్తారు. పౌర్ణమి నాడు కనె్నపల్లిలోని సారలమ్మ గుడిలో పూజలు నిర్వహిస్తారు.

01/27/2018 - 21:11

* ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరగా మేడారంలో రెండేళ్లకు ఒకసారి జరిగే సమ్మక్క-సారక్క జాతరను చెబుతారు. దాదాపు రెండు కోట్ల మంది భక్తులు ఈ జాతరకు హాజరవుతారని అంచనా. ఐదు రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తారు. జాతర నాలుగు రోజులే జరిగినా అంతకుముందు నుంచే జనం అడవులమీదుగా మేడారం చేరుకుంటారు.

01/27/2018 - 21:07

మేడారం జాతర అంటే
జనారణ్యమే గుర్తొస్తుంది. ఒకప్పుడు
ఏ సౌకర్యాలు ఉండేవి కావు. ఇప్పుడు
అధునాతన సౌకర్యాలు, ఏర్పాట్లు
తోడయ్యాయి. అప్పుడు చెట్టుకిందే వన

01/27/2018 - 20:55

మేడారం జాతర అంటే గిరిజన సంస్కృతి సంప్రదాయాల వైభవం. గద్దెలపైకి సమ్మక్క సారలమ్మను తోడ్కొని వచ్చినపుడు తమపైనుంచి పూజారులు నడచివెళ్లాలని ఇలా భక్తులు పడుకుని ఉండటం ఓ భక్తిపారవశ్యపు సన్నివేశం. గద్దెపై అమ్మవారి (భరిణ)ని చేర్చి పూజించడం జాతరలో కీలక ఘట్టం. అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడంలో ‘బంగారం’ (బెల్లం) సమర్పించడం ఆనవాయితీ. ఈ జాతరవేళ కొందరు పూనకంతో ఊగిపోవడం జాతరలో కనిపించే మరో భక్తితత్త్వం.

01/20/2018 - 23:49

తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం)లో హైదరాబాద్ బుక్ ఫెయిర్ పుస్తక ప్రియులను అలరిస్తోంది. గత ఏడాది నిర్వహించిన పుస్తక ప్రదర్శనకు పది లక్షలమంది హాజరైనారు. ఈసారి మరింత పెద్దసంఖ్యలో పుస్తక ప్రియులు వస్తారని అంచనా. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేశారు. దాదాపు 300 స్టాల్స్‌కు అవకాశం కల్పించారు.

01/20/2018 - 23:48

ప్రపంచం అంతటా ప్రతి ఏటా కొత్త సంవత్సరం.. కుల, మత, ప్రాంత వర్గ దేశ సరిహద్దు ఎల్లలు లేకుండా అందరికీ వస్తుంది. అయితే విజయవాడ నగర వాసులకు మాత్రం ఈ కొత్త సంవత్సరం ఏకంగా పుస్తకాల పండుగనే తన వెంట తీసుకువస్తుంది. ఒకటిరెండేళ్లు కాదు.. గడచిన 29 సంవత్సరాలుగా విజయవాడ పుస్తక మహోత్సవం నగర ప్రజల జీవితాల్లో మమేకమైంది.

01/20/2018 - 23:40

ప్రవస్థ రాజ్యాన్ని చంద్రసేన మహారాజు పాలించేవాడు. పేరుకు తగ్గట్టుగానే చంద్రసేన మహారాజు సౌమ్యుడు. ప్రజల సమస్యలు వింటూ ఎప్పటికప్పుడు వారికి తగిన విధంగా సహాయం చేసేవాడు. చంద్రసేనుడి మంత్రి విరుద్ధుడు. రాజుకి పూర్తిగా భిన్నంగా ఉండేవాడు. అందరూ మహారాజు మంచితనాన్ని ఆసరాగా తీసుకుని అవసరం వున్నా లేకున్నా సహాయం పొందుతున్నారని అతని ఆలోచన.

01/20/2018 - 23:33

లోకంలో ఆధునిక పోకడలు పొడసూపుతున్నాయి. పూర్వకాలంలో అప్పటి అవసరార్థం కనుగొన్న పరిశోధనలన్నీ పాతవవుతున్నాయి. వాటి స్థానంలో కొత్త పరిశోధనలు ఆవిష్కృతమవుతున్నాయి. ఈ పరిశోధనలే మానవుని దిశ దశ మారుస్తున్నాయి. ఎన్ని పరిశోధనలు వచ్చినా అప్పటికీ ఎప్పటికీ మారనిది పుస్తకం మాత్రమే. పుస్తకం అంటే కాయితాల గుత్తి కాదు. విజ్ఞాన భాండాగారం. అందులో ఎన్నో విజ్ఞాన విశేషాలు నిక్షిప్తం అయి ఉంటాయి.

01/20/2018 - 21:10

మరో ప్రపంచం,
మరో ప్రపంచం,
మరో ప్రపంచం పిలిచింది!
పదండి ముందుకు,
పదండి త్రోసుకు!
పోదాం, పోదాం పైపైకి

01/20/2018 - 21:07

మామూలుగా పండుగ ఒక రోజే ఉంటుంది. కానీ పుస్తకాల పండుగ మాత్రం పనె్నండు రోజుల వేడుక. అన్ని పండుగల కంటె నాకు నచ్చిన పండుగ విజయవాడలో జరిగే పుస్తక మహోత్సవం.

Pages