S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

02/11/2016 - 21:48

చూడచక్కని రాతిగుట్టలతో పర్వత శ్రేణుల మధ్యలో సహజసిద్ధంగా ఏర్పడిన ఓడరేవు రియో. ఇక్కడ మైలు పొడవున పర్వతాల నడుమ వున్న ఖాళీ ప్రదేశం నుంచి సముద్రం 18 మైళ్ల లోపలకు చొచ్చుకు వచ్చింది. 12 మైళ్ల వెడల్పుతో ఉండే ఈ అఖాతం ఎంతో లోతైంది. ప్రపంచంలోనే అతి పెద్దదిగా పేరొందిన నౌకలు సైతం సురక్షితంగా సునాయాసంగా రియో హార్బర్‌లో లంగరేస్తాయి.

02/11/2016 - 21:11

‘నువ్వు లాకర్‌ని తెరవగలవా ఎడ్డీ?’ వారెన్ ప్రశ్నించాడు.
వారెన్ అండ్ కోల్స్ ఫార్మాస్యుటికల్స్ కంపెనీకి వారెన్ ప్రెసిడెంట్. బూడిద రంగు సూట్‌లోని వారెన్, ఆఫీస్‌లోని తన ప్రైవేట్ రూమ్‌లో ఖరీదైన బల్ల వెనుక కూర్చుని ఉన్నాడు. అతని ఎదురుగా కూర్చుని ఉన్న ఎడ్డీ గోధుమ రంగు చవక సూట్‌ని ధరించాడు.
వారెన్ వెనక ఉన్న గోడలోని పెద్ద సేఫ్‌ని చూసి ఎడ్డీ చెప్పాడు.

02/10/2016 - 00:32

పాము అంటే ఎవరికైనా భయమే. ముఖ్యంగా బాగా లావుగా ఉండే కొండచిలువని చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. కానీ చైనాలోని డోంగ్‌యాన్ అనే గ్రామానికి చెందిన ఓ కుటుంబం గురించి 2013లో ప్రపంచ పత్రికలన్నీ రాశాయి. కారణం, ఆ కుటుంబానికి చెందిన అజాహీ ల్యూ అనే పదమూడేళ్ల కుర్రాడి సహచరి సాక్షాత్తు కొండచిలువ. బర్మాకి చెందిన ఈ కొండచిలువ పొడవు 15 అడుగులు! పాకే ఈ జీవి అజాహీకి బెస్ట్ ఫ్రెండ్!

02/09/2016 - 23:54

బి.రావు (ఆముదాలవలస)
ప్రశ్న: ఉత్తరం ముఖద్వారం కలిగిన ఇళ్లకు పూజ గదిని హాలులో ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి?
జ: ఉత్తరం ముఖద్వారం కలిగిన ఇళ్లకు వంటగది తర్వాత తూర్పు మధ్యభాగంలో పూజ గదిని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే దేవుని ఫొటోలు పడమర ముఖంగా, పూజ చేసేవారు తూర్పు ముఖంగా పూజను చేయాలి.
శ్రీకాంత్ (సిరిసిల్ల)
ప్రశ్న: మా ఇంటికి వాయవ్యంలో సెప్టిక్ ట్యాంకు వున్నది. అలా ఉండవచ్చునా?

02/08/2016 - 08:44

స్కూల్ నించి తిరిగి వచ్చిన రూపసి తల్లితో ఉత్సాహంగా చెప్పింది.
‘ఇవాళ క్లాస్ నాకు బాగా నచ్చింది. అగ్నిపర్వతాల గురించి నేర్చుకున్నాను’
‘ఓ! చిన్నప్పుడు వాటి గురించి నేనూ చదివిన గుర్తు. ప్రకృతిలోని ఆకర్షణీయమైన వాటిలో అవొకటి’ తల్లి చెప్పింది.

02/08/2016 - 08:36

ప్రపంచ వ్యాప్తంగా భౌతిక శాస్తవ్రేత్తలందరూ గర్వించతగిన వ్యక్తిగా, స్ఫూర్తిదాతగా సి.వి.రామన్‌ని చెప్పుకుంటారు. రామన్ కంటే ముందు భౌతిక శాస్త్ర పరిశోధనలు గావించినవారు ఎక్కువమందే ఉన్నా రామన్ రాకతో కొత్త ఉత్సాహం, కొత్త ఆవిష్కరణలకు నాంది పలికినట్లయిందని చెప్పవచ్చు.

02/08/2016 - 08:34

అనీల్‌ని ఇంట్లో వాళ్లంతా ‘సిసింద్రీ’ అనే పిలుస్తారు. ‘ఒరేయ్! నీ పేరేంట్రా అంటే, పొరపాటున సిసింద్రీ అని చెప్పేసి - వాడికి వాడే బుర్ర మీద ఒక్కటిచ్చుకోవడం కూడా కద్దు.
అనీల్ అల్లరి పట్టడం కష్టమై పోయింది వాడి అమ్మానాన్నలకి. ‘నాన్నా! చిన్నప్పుడు నువ్వు అల్లరి చేసేవాడివి కాదా?’ అని ఎదురుప్రశ్న వేసేవాడు కూడా.

02/08/2016 - 08:31

జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకొని దానిని సాధించుకొన గలిగే వరకు ఎన్ని అవరోధాలనైనా, కష్టాలనైనా, అవమానాలనైనా సహించగలిగేవారు మిగతా అందరికన్నా మహా శక్తివంతులై దైవత్వాన్ని సాధించుకుంటారు.

02/08/2016 - 08:12

కొవ్వొత్తి రెండు వైపులా మండితే వేగంగా అది కాలిపోతుంది. ఈ రోజున పెక్కుమంది యువత ఈ విధంగానే పనిచేస్తూ తమ ఆయుష్షును తగ్గించేసుకుంటున్నారు. ఒక గొప్ప విషయం ఏమిటంటే వైద్య శాస్త్రం పుణ్యమా అని మనిషి సగటు ఆయుష్షు పూర్వీకుల కంటే పెరిగింది.

02/08/2016 - 08:01

ప్రపంచంలోని మిగతా జాతులకి మనుషులకి ఉన్న భేదం భాష. చెట్లకి, జంతువులకి కూడా భాష ఉందని కూడా చెబుతారు. వాటికి భాష ఉందో లేదో తెలియదు కానీ కొన్ని విషయాలని అవి గ్రహించగలవు. భాష వల్ల మనిషకి మిగతా జాతులకి భేదం ఏర్పడింది. భాష వల్ల మనిషికి మనిషికి మధ్యనే విషయాలు తెలియపరచుకునే పరిస్థితి ఏర్పడింది. భాష ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది మనకు తెలియకపోవచ్చు. కానీ భాష వల్ల మనిషి ప్రత్యేకంగా మారినాడు.

Pages