S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

01/13/2018 - 21:26

*సంక్రాంతి అని పిలిచినా ఇది నాలుగు రోజుల పండుగ. అందుకే దీనిని పెద్దపండుగ అంటారు. నిజానికి మిగతా పండుగలతో పోలిస్తే కుటుంబాలన్నీ ఒకసారి తప్పనిసరిగా కలుస్తూండటం ఈ పండుక ప్రత్యేకత. మొదటి రోజు భోగి ఆధ్యాత్మికతతో కూడినదైతే సంక్రాంతి వేడుకతో కూడినది. మూడోరోజు పశువుల పండుగ. నాలుగోరోజు విందులుతో గడుపుతారు.

01/13/2018 - 21:19

అసలు సంక్రాంతి అంటేనే పల్లె పండుగ. పండుగ వైభవ ప్రాభవాలన్నీ పల్లెల్లోనే వెల్లివిరుస్తాయి. గ్రామ జీవన ఆత్మీయ మానవీయ బంధాలన్నింటినీ దృశ్యమానం చేసే కనుల పండుగ మనసు నిండుగ సంక్రాంతి పండుగ. ఆరుగాలం శ్రమిస్తూ భూమిని నమ్ముకుని ఉన్న నేలకే బ్రతుకు ముడుపు గట్టిన రైతులకు పంటలు చేతికొచ్చే కాలం.

01/13/2018 - 21:15

తెలుగు వారికి ప్రాణప్రదమైన పండుగ సంక్రాంతి. జనవరి 13, 14, 15 తేదీలలో వచ్చే ఈ పండుగ వాతావరణం నెల రోజుల ముందే నెలకొంటుంది. ధాన్యలక్ష్మి ఇంటికి వచ్చి రైతన్నలకు సిరులు చేకూర్చే శుభ సమయం. తెలుగింటి ఆడపడుచులు లోగిళ్ళను గొబ్బెమ్మలతో అలంకరించి సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలకటం, కోయిల కుహు..కుహు..

01/13/2018 - 21:08

హిందూ సంస్కృతికి సంబంధించిన గొప్ప పండుగ సంక్రాంతి. దీనిని పెద్ద పండుగ అంటారు. జనవరి నెల నుండి డిసెంబర్ నెల వరకు వచ్చే హిందూ పండుగలలో అతి పెద్ద పండుగ ఇది. కొన్ని చోట్ల నాలుగు రోజులు - భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ - అను నాలుగు పండుగలు జరుపుకుంటారు. కొందరు మూడు రోజులే అంటే - భోగి, సంక్రాంతి, కనుమ - పండుగలే జరుపుకుంటారు. స్వగ్రామం నుండి పొరుగూళ్లు వెళ్లే వాళ్లు కనుమ పండుగనాడు ప్రయాణం చేయరు.

01/13/2018 - 21:07

చెలియ సింగారి ముగ్గుల చీరగట్ట
ఇంటి యల్లుడు ‘గొబ్బెమ్మ’ వంటయింట!
దాసు డెజమాని గన! ‘హరిదాసు’డవ్వ?
‘గంగిరెద్దులె’ ‘పిల్లలు’ గడపలోపు

ఉత్తరాయణ కిరణాల కొత్తదనము
మంచుగురియగ! సుమముల యంచులన్ని

వజ్ర వైఢూర్యమట్లుగ వనె్నగూర్చ!
పిండివంటల మంటలే మండుచుండ!

01/13/2018 - 21:01

సంక్రాంతి అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి ఇంటి ముందు రంగవల్లులు, ఆకాశాన గాలిపటాలు, భోగిపళ్ల సందడి, నువ్వుల మిఠాయిల తియ్యదనం, హరిదాసు పాటలు, బసవన్న ఆటలు.. మరీ వీటిలో ముగ్గుల ప్రాశస్త్యం ఏమిటో చూద్దాం.
ముగ్గుల పురాణం

01/13/2018 - 20:58

సంక్రాంతి పండుగ ఇంకా నెల రోజులు ఉందనగానే తెలుగు వాకిళ్లు ముగ్గులతో కళకళలాడుతుంటాయి. అసలు, ఈ ముద్దులొలికే ముగ్గులలోనే సంక్రాంతి శోభంతా ఇమిడి ఉందేమో ననిపిస్తుంది. సంధ్యా సమయంలో తెలుగింటి ఆడపడుచులు తలారా స్నానం చేసి, ముగ్గు గినె్నలను చేతబట్టుకుని వాకిళ్లలో ఏకాగ్ర చిత్తంతో ముగ్గులను తీర్చిదిద్దే దృశ్యం కన్నుల పండువుగా ఉంటుంది. ముగ్గులు వేయడంలో మగువలది అందెవేసిన చేయి.

01/13/2018 - 20:53

సమ్యక్ క్రాంతి.. సంక్రాంతి. అంటే పవిత్రమైన మార్పు. కాలమానం ప్రకారం సూర్యుడు ఉత్తరాభిముఖంగా ప్రయాణం చేస్తూ ప్రకృతిలో అందం, ఆనందంతో కూడిన మార్పును తీసుకొనివస్తాడు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినపుడు ‘మకర సంక్రాంతి’ అంటారు. సంక్రమం అంటే ఒక సంవత్సర కాలంలో సూర్యుడు ఒక్కొక్కొ నెల ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తాడు. ఆ రీతిగా ప్రవేశించిన దినమే సంక్రమణం. ఒక సంవత్సర కాలంలో పనె్నండు సంక్రమణాలుంటాయి.

01/13/2018 - 20:42

మా చిన్నప్పుడు కొత్త సంవత్సరం కన్నా సంక్రాంతి మీద ఇష్టం ఎక్కువ ఉండేది. కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్, అప్పుడు అంతగా లేవు. సంక్రాంతి ఇష్టం కావడానికి ప్రధానమైన కారణం.. ‘సకినాలు’.
ఇప్పటిలా కాదు. సకినాలు సంక్రాంతి పండుగ ముందు మా ఇంట్లో తయారుచేసేవాళ్లు. మా ఇంట్లోనే కాదు. అందరి ఇళ్లల్లోనూ అప్పుడే తయారుచేసేవాళ్లు. ఇంట్లో ఎవరిదైనా పెళ్లి అయినప్పుడు ప్రత్యేకంగా ‘సారె సకినాలు’ చేసేవాళ్లు.

01/06/2018 - 21:06

మత సంస్కృతి రాజ్యాధికారంలోని, భారత పౌరాణిక ఇతిహాసపు చీకటి కోణాలతో, వర్తమాన అధునాతన సాంకేతిక సమాజాన్ని చిత్తభ్రాంతితో విస్మయపరచగల అద్భుత కథాకథనం బాహుబలి విశ్వరూపం, ఒక చారిత్రక వాస్తవం. ఆజానుబాహుడు, ఉన్నత వక్షస్థలం, ఉంగరాల కేశసంపద, కోటేరు ముక్కు..

Pages