S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

12/17/2017 - 01:05

ఆయనో విశ్రాంత ఉద్యోగి.. అయితే సామాజిక బాధ్యతలో అవిశ్రాంత యోధుడు! నలుగురిలా ఉద్యోగ విరమణ అనంతరం ఖాళీగా ఇంట్లో కూర్చోవడం ఆయనకిష్టం లేదు... తన వంతు బాధ్యతగా సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలన్న సదాశయంతో రెండు ముఖ్యమైన సామాజిక అంశాలను లఘు చిత్రాలుగా రూపొందించారు. ఆయనే కాకినాడ నగరానికి చెందిన విశ్రాంత మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ చిక్కం రామచంద్రరావు.

12/17/2017 - 00:41

ప్ర కటనలు చేయడం సులువు.
ప్రతిరోజూ చాలామంది ఎన్నో ప్రకటనలని చేస్తూ వుంటారు.
మా మిత్రుడు ఒకడున్నాడు. అతను భోజనప్రియుడు. కొంచెం బరువు పెరగగానే రేపటి నుంచి నేను డైటింగ్ చేస్తున్నానని ప్రకటన ఇస్తాడు. కానీ అమలు చేయడంలో ఇబ్బంది పడుతూ ఉంటాడు. కొద్ది రోజులు డైటింగ్ చేస్తాడు. ఆ తరువాత మళ్లీ మామూలే.

12/17/2017 - 00:40

జీ వితం చాలా చిన్నది.
అది ఎప్పుడు ముగుస్తుందో తెలియదు.
అందరికీ ఈ విషయం తెలుసు. కానీ తమ విషయంలో అలా కాదని అనుకోని అహంకారపూరితంగా ఉంటారు. ఎవరినీ లక్ష్యపెట్టరు.
మా మిత్రుడు ఒకడు ఇలాగే వుండేవాడు. ఓసారి ఓ భయంకరమైన యాక్సిడెంట్ అయ్యి బతికి బయటపడ్డాడు. అప్పటి నుంచి అతని జీవిత సరళి మారిపోయింది.
అందరితో మంచిగా ఉండటం మొదలుపెట్టాడు.
ప్రేమపూర్వకంగా వుండటం ప్రారంభించాడు.

12/17/2017 - 00:38

మనలో చాలా మందికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. కొందరు బాగా పాడగలరు. మరి కొందరు బాగా మాట్లాడగలరు. ఇంకొందరు బాగా చిత్రాలు గీయగలరు. దేవుడిచ్చిన ఇటువంటి క్వాలిటీస్‌ని కొద్దిగా సాధన చేసి చాలా మంది ప్రముఖంగా పేరు తెచ్చుకుంటారు. మధ్యప్రదేశ్‌కి చెందిన అరుణ్ రైక్వార్ కూడా అందరినీ ఆశ్చర్యపరిచే ఒక ప్రత్యేకత కలిగిన వ్యక్తే.

12/17/2017 - 00:38

సప్తగిరీశుని నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రాజు అచ్యుత రాయలు ఉత్సవాలను ఘనంగా నిర్వహించదలిచాడు.

12/17/2017 - 00:37

మనలో ప్రేయసీప్రియుల మధ్య బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం మామూలే. ఒక్కోసారి విజేతలకు, పిల్లలకు పుట్టినరోజునో, పెద్దలకు పెళ్లిరోజనో ఏదో ఒక సందర్భంలో బహుమతులు ఇవ్వడం మనకు అలవాటే. యువతలో ఎక్కువమంది ప్రియురాలి ప్రేమను పొందడానికో, ప్రేమను తెలియజేయడానికో బహుమతులు ఇస్తూంటారు. అలాగే డాల్ఫిన్లు కూడా బహుమతుల మార్గాన్ని ఎంచుకుంటున్నాయని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది.

12/17/2017 - 00:35

మన దేశం ఆచారాలకు, సంప్రదాయాలకు పెట్టింది పేరు. ఇక్కడ చెట్టును, పుట్టను, రాయిని, రప్పను కూడా పూజిస్తారు. తాము ఆరాధించే దేవతలకు మనవారు రకరకాల నైవేద్యాలు పెడతారు. ఈ ఆచారాలు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ప్రత్యేకమని చెప్పాలి. తరచి చూస్తే ఇలాంటి ఆచారాల వల్ల కొన్ని ప్రాంతాల్లోని దేవుళ్లు, దేవతలు ఎంతో ప్రసిద్ధి చెందారు. ఆ కోవకి చెందిన దేవతే కేరళలోని అలప్పుజ బాల మురుగన్.

12/17/2017 - 00:35

విశ్వనాథం మాస్టారు క్లాసులో పాఠం చెప్తూ పిల్లల వైపు పరీక్షగా చూశారు.
వరుణ్ పక్కన కూర్చున్న శంకర్ తన పుస్తకంలో కాకుండా, వరుణ్ పైకి ఒరిగిపోయి వాడి టెక్స్ట్‌బుక్‌లో చూస్తూ కూర్చున్నాడు. మాస్టారికి కోపం వచ్చింది.
‘శంకర్..!’ అని గద్దించారు.
శంకర్ ఉలిక్కిపడి సర్దుకుని కూర్చున్నాడు.
‘నేను గొంతు చించుకుని పాఠం చెప్తుంటే నువ్వు వరుణ్‌తో ముచ్చట్లేంటి?’ అని ప్రశ్నించారు.

12/17/2017 - 00:34

మనిషికి భావోద్వేగాలు ఎక్కువ. ఎదుటివారిని చూసి వారి మానసిక పరిస్థితిని అంచనావేయడంలో మానవులకు అపరిమితమైన శక్తి ఉంది. నిజానికి మానసిక శాస్త్రంలో అది ఒక ఆయుధం. మనిషి హావభావాలు, కదలికలు, శరీరభాషను బట్టి వారు ఏం ఆలోచిస్తున్నారో, ఏ స్థితిలో ఉన్నారో పసిగడతాం. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. కానీ తాజా అధ్యయనాలలో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.

12/10/2017 - 01:41

ప్రపంచ తెలుగు మహాసభల ఆలోచన, కార్యాచరణ, పరిణామ క్రమం
*

Pages