S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

12/10/2017 - 01:40

ప్రపంచ తెలుగు మహాసభలపై శాసనసభలో ముఖ్యమంత్రి ప్రకటన
*

12/10/2017 - 01:39

తెలంగాణలో దివ్యమైన తేట తెలుగు మాటల ఊటలు బోలెడున్నాయి. ఈ ప్రాంత భాషలో సవ్యమైన, స్వచ్ఛ స్ఫటిక స్పష్టమైన శబ్దాలకు కొదవే లేదు. వందలాది తెలుగు పదాలను అలవోకగా పలికే జనపదాలకు అందరమూ వందనాలు చెల్లించవలసిందే! ముఖ్యంగా అక్షర జ్ఞానం లేని పల్లె ప్రజల నోట అచ్చ తెలుగు మాటల మూటలు దొరుకుతాయి.

12/10/2017 - 01:39

గోదావరీ తీర ప్రాంతంలో వేంగీ ప్రభువు రాజరాజ నరేంద్రుడు తెలుగు భారతికి పల్లకీ ఎత్తటానికి సుమారు శతాబ్ది ముందుగానే, తెలంగాణ మాగాణంలోని వేములవాడ చాళుక్య సంస్థానం, తెలుగు ముఖ్యంగా సంస్కృత, కన్నడ భాషా సరస్వతికి నీరాజనాలు అందించారు.

12/10/2017 - 01:38

ప్రాచీన కాలంలో తాటాకులు, తాళ పత్రాల్లో నమోదు చేసి భద్రపరిచిన తెలుగు సాహిత్యం అక్షర సంపదంతా నిక్షిప్తమైనటువంటి వందల గ్రంథాలు బొందల్లో సమాధమవుతున్న సమయాన, తెలుగు భాష మట్టిలో కలిసి కనుమరుగయ్యే కాలాన, తెలుగు సాహిత్యానికి పట్టిన చెదలును దులిపించి, తెలుగు వాఙ్మయాన్ని బ్రతికించి రక్షించి దీవించి, తన జీవితంలో తెలుగును ఒక భాగంగా పెంచి పోషించిన మహనీయుడు సి.పి.బ్రౌన్.

12/10/2017 - 01:37

మనిషికి ఎరుక కల్గినప్పటినుంచే సాహిత్యం వుందని స్థూలంగా చెప్పవచ్చు. సమాజ పరిణామక్రమంలో లిపి ఏర్పడి శిష్ఠ సాహిత్యంగా ఒక పాయగా రూపొందింది. శిష్ఠ సాహిత్యానికి ప్రతిగానే జానపద సాహిత్యం కొనసాగింది. అనేక సామాజిక కారణాలవల్ల ఇవ్వాళ జానపద సాహిత్యం కనుమరుగయ్యే స్థితి ఏర్పడింది. ఉపయోగంలోనే, పుట్టుక, మార్పు, అభివృద్ధి జానపద సాహిత్యానికి ఉంటుంది.

12/10/2017 - 01:36

గుడి కూలును నూయి పూడును
వడి నీటను చెరువు తెగును వనమును ఖిలవౌ
చెడనిది పద్మమొక్కటే
కుడి యెడమల కీర్తిగన్న గువ్వల చెన్నా!
*

12/10/2017 - 01:35

ఒక శతాబ్దపు పూర్తి వృత్తాన్ని చూసిన వ్యక్తి అదృష్టవంతుడు. ఆ వ్యక్తి రచయిత కూడా అయితే, దాని నిండుదనం వేరు. ఆ మనిషి నిండుకుండ వంటి నింపాది స్వభావి అయితే, ఆ సందర్భం ఉత్కృష్ట శీలమైనది అవుతుంది.

12/10/2017 - 01:34

1910లో ‘ఆంధ్రభారతి’ అనే మాసపత్రిక ప్రారంభమైంది. సంపాదకులంటూ ప్రత్యేకంగా ప్రచురించని ఈ పత్రికలో ఒక పుటలో లేఖకులంటూ రచయితల చిట్టాని, పోషకులు అంటూ పత్రిక ప్రచురణకు తోడ్పడిన దాతల చిట్టా - ప్రతీ సంచికలో విడవకుండా ముందు పుటలుగా ప్రచురించారు.

12/10/2017 - 01:33

అంతరాయ తిమిరోప శాంతయే శాంత పావన మచింత్య వైభవం
తం నరం వపుషి కుంజరం ముఖేన్మహే కిమపి తుందిలం మహః
(ఊహింపనలవి కాని వైభవము కలవానిని, నర శరీరముతో, ఏనుగు ముఖముతో బొజ్జతో ప్రకాశించే మహా తేజస్సుని (వినాయకుని) విఘ్నాలను చీకటిని పోగొట్టుటకు మాటిమాటికి తలుస్తాను. ఇది మల్లినాథుడు రచించిన వినాయక ప్రార్థన.)
* * *

12/10/2017 - 01:32

తెలుగు భాషకు పుట్టినిల్లు తెలంగాణ ప్రాంతమేనని రుజువు చేసినం. తెలంగాణ భాషకు మూడు వేలేండ్ల ప్రాచీనతుందని నిరూపించినం. తెలుగు భాషకు ప్రాచీన హోదా వచ్చుటానికి తెలంగాణ నుంచే తిరుగులేని ఆధారాలు చూపినం. నన్నయకు ముందే తెలంగాణలో లిఖిత సాహిత్య సంపదుందని ఘంటాపథంగ చెప్పినం. మొదటి కందపద్యం, శాసనభాష, తెలుగులో మొదటి కథ, మొదటి నవల, మొదటి వ్యాకరణ శాస్త్రం తెలంగాణలోనే పుట్టినయని సగర్వంగా చెప్పుకున్నం.

Pages