S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

12/10/2017 - 01:31

గుడిలేని ఊరు నీరులేని ఏరు
గుడిలేని వాడ దయ్యాల మేడ
గుళ్ళు-గోపురాలు, శిలలు-శిల్పాలు ఒక స్వర్ణ యుగాన్ని అనుభవించిన సువర్ణ్భూమి త్రిలింగ భూమి. ఈ తెలుగునాడు మొత్తాన్ని కళల కాణాచిగా, కాంచన కాశ్యపీ ఖండంగా ప్రపంచానికి ఆవిష్కరించి చూపిన కమనీయ కాలం కాకతీయ యుగం.

12/10/2017 - 01:31

తెలుగు సాహిత్యానికి ఆదికవి నన్నయ అని, ఆయన అనువాదంగా రచించిన ‘మహాభారతము’ ఆదికావ్యమని మనం భావిస్తున్నాం. అయితే, నన్నయకు ముందు తెలుగు నుడి ఎంతవరకూ ఎదిగింది? అప్పటికి గ్రంథ రచన, కావ్యరచన జరగలేదా? అనే ప్రశ్నలుదయిస్తాయి. అప్పటికే తెలుగు భాష అభివృద్ధి చెందింది. కాని సమగ్ర కావ్యం మాత్రం తెలుగులో రచింపబడలేదు.

12/10/2017 - 01:30

కాకతీయులు మొదట జైన మతస్థులు. తర్వాత శైవులు. శివుణ్ణి శైవులు 1.లింగరూపములో 2.కరచరణాది అవయవములగల మానవ రూపంలో 3.మంత్ర - అక్షర రూపములో 4.బిందు రూపము (శ్రీ చక్రము)లో ఉపాసిస్తారు. ఈ సృష్టి దేనినుండి పుట్టి దేనిలో పెరిగి దేనిలో లయము అవుతున్నదో దానికి లింగము ఈ పేరు.
త్రిలింగము: మూడు ప్రాంతముల మధ్య భూమి.
1.కాళేశ్వరము 2.్భమేశ్వరము 3.మల్లికార్జునము.

12/10/2017 - 01:30

తెలుగు భాషకు వేల సంవత్సరాల చరిత్ర ఉన్నప్పటికీ భారతీయ ప్రాచీన భాషల జాబితాలో ఇటీవలే చోటు లభించింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చేసిన న్యాయ పోరాటం ఫలితంగా దక్కిన గుర్తింపు ఇది. కేవలం తెలుగుకు ప్రాచీన హోదా దక్కడం విషయంలోనే కాదు, ఇంకా అనేక రాజకీయ, నైసర్గిక కారణాల వల్ల రెండు వేల ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన తెలుగు భాషకు రావాల్సినంత గుర్తింపు రాలేదు.

12/10/2017 - 01:28

తెలుగు వెలుగులీనింది తెలంగాణ గడ్డపైనే. అమ్మభాషను ప్రేమిస్తూ సుసంపన్నం చేసిన మహనీయులు మన తెలంగాణ అక్షర యోధులు.

12/10/2017 - 00:42

తెలుగు భాషా వికాసానికి
పుట్టినిల్లు తెలంగాణ
ద్విసహస్ర వసంతాల వెనె్నల సొన
మన ఘన సాహితీ తెలంగాణ

అందమైన అలంకారాలు
హృద్యమైన పదాలు
యతి యాస ప్రాసలు
సాహితీ మణిపూసలు

కొలమానాలకందని సాహిత్య
సంపద కొలువు తీరింది
కవులెందరినో కవన మార్గాన
కదిపి కావ్య కర్మాగారమయింది

11/25/2017 - 21:35

ఎప్పుడో చిన్నప్పుడు పాఠ్య పుస్తకాలలో చదివి, కనిపించీ కనిపించనట్టుగా ఫొటోలో చూసిన ఎవరెస్టు శిఖరాన్ని ప్రత్యక్షంగా చూడటం.. ఉద్వేగం.. ఆనందం.. ఉత్సాహంతో మనసు మంచుబిందువులా మారిపోతుంది. శిఖరాల మధ్య శూన్యంలో విమానం నిలిచిపోవడం ఒక అద్భుతమైతే, నిలిచిన విమానం నుంచి ఎవరెస్టు శిఖరాన్ని చూడటం మహాద్భుతం.

11/25/2017 - 21:14

ప్రపంచ దేశాల్లో భారత్‌ది ఉతృష్టమైన స్థానం. ఇక్కడ వేల ఏళ్ల నాటి నుండి అనేక కళలు, విద్యలు విరాజిల్లాయి. ఈ నేల మీద జీవించిన వారికి రాని విద్యంటూ లేదని ప్రతీతి. వేల ఏళ్లనాడే మానవుడికి నౌకాయానంపై పట్టుంది. మన దేశం కూడా నౌకాయానంలో పేరెన్నిక గన్నదే. అంతే కాదు అనేక దేశాల వారు నౌకలను అప్పట్లో ఎక్కడెక్కడి నుండో కొనుగోలు చేసుకుంటుంటే మన దేశంలో మాత్రం స్వదేశీ పరిజ్ఞానంతో కావలసిన నౌకలను తయారు చేసుకునేవారు.

11/25/2017 - 21:12

శాంతిపురంలో సోమయ్య అనే ఓ పేదవాడు ఉండేవాడు. అతడికి ఎవ్వరూ లేరు. అతడు ప్రతిరోజూ అడవికెళ్లి కట్టెలు కొట్టుకుని తెచ్చి గ్రామంలో అమ్ముకుని జీవించేవాడు. కష్టపడితేనే తిండి. ఒక్కోరోజు కట్టెలకు తగిన వెల కూడా దొరికేది కాదు. ఓమారు అలా మూడు రోజులు కట్టెల మోపు మోసుకుంటూ ఊరంతా తిరిగినా ఎవ్వరూ కొనలేదు. పొట్టనిండా నీరు తాగి పడుకున్నాడు. మూడు రోజులు కడుపులోకి ఏమీ పడక సోమయ్యకు కళ్లు తిరగసాగాయి.

11/25/2017 - 21:11

క్రికెట్ ప్రపంచ ప్రఖ్యాత క్రీడ. ఇది తొలుత ఇంగ్లండ్‌లో పుట్టిందని అంటారు. కానీ అంత కంటే ముందే ఇది మన దేశంలో విశేషమైన ప్రాచుర్యం పొందిందని, మన దేశాన్ని ఏలిన బ్రిటిష్ వారు ఆ క్రీడను చూసే కొద్ది మార్పులతో క్రికెట్ ఆడేవారని అంటారు.

Pages