S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినదగు!

09/09/2017 - 21:11

మనకంటూ ‘అహం’ ఉంది.. ‘వ్యక్తిత్వం’ ఉంది. ‘స్వ ఇచ్ఛ’ ఉంది.. ‘ఆశ’ ఉంది.. ‘కోరిక’ ఉంది - ఇవన్నీ బలంగా ఉన్నంతకాలం మనది సామాన్య బ్రతుకే! మన ఆంతరిక బలాన్ని, ఆత్మధర్మాన్ని ఈ బాహిర ఆకర్షణలు కప్పిపుచ్చుతున్నంత కాలం మనం ఒకరి వెంట అనుచరులుగా అడుగులు వెయ్యవలసిన వారమే!

07/22/2017 - 21:36

‘సుఖ దుఃఖే సమేకృత్వా లాభాలాభౌ జయాజయా
తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి’
- ఇది కృష్ణ ఉవాచ. నాయకుడికి ఉండవలసిన ప్రథమ లక్షణాలను ఈ కృష్ణ గీత విశదపరుస్తోంది. రాగద్వేషాలకు అంటే భావోద్విగ్నతలకు అతీతం కాగల నాయకతత్వం అవసరం అన్న ఉద్బోధ కృష్ణుడి మాటలలో కానవస్తుంది.

07/08/2017 - 23:40

విరుద్ధతులు లేని సృష్టి లేదు. విరుద్ధత చోటు చేసుకోని మానవజన్మ లేదు. విరుద్ధతకు అవకాశం ఇవ్వని సంఘటనా లేదు. ఇలా చూసినప్పుడు ఎంతటి మహిమాన్విత నాయకుడికైనా, ఎంతలా ప్రామాణిక నాయకుడనిపించుకున్నా అంతటి ఆదర్శ మార్గదర్శికి సైతం బాహ్యం, అంతరంగం అనేవి ఉండకపోవు. ఈ రెండూ ఒకే నాణేనికున్న బొమ్మాబొరుసుల్లా నాయకతత్వంపై బాహ్యం, ఆంతర్యం ప్రభావం చూపిస్తూనే ఉంటాయి.

06/24/2017 - 21:34

‘కుతస్త్వా కశ్శల మిదం విషమే సముపస్థితమ్
అనార్యజుష్ట మస్వర్గ్య మకీర్తికర మర్జున’

06/17/2017 - 23:43

సంకల్పించటం నాయక తత్వం. అయితే ఆ సంకల్పాలు కార్యాచరణలో కొత్త పుంతలు తొక్కుతుంటాయి. కొన్ని మసిబారుతుంటాయి. కొన్ని కాంతి కాగడాలవుతుంటాయి. కాబట్టి సంకల్పించినవన్నీ ఆచరణలో ఫలవంతమవుతాయనుకోవటం పొరపాటు. కొన్ని సాధ్యం కావచ్చు. కొన్ని సాధ్యం కాకపోవచ్చు. అయితే ఈ సాధ్యాసాధ్యాలను బేరీజు వేయటంలోనే నాయకత్వ ప్రతిభ దాగి ఉంది.

06/10/2017 - 21:32

‘ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్’
కామధేనువును నేనే.. వజ్రాయుధాన్ని నేనే.

06/04/2017 - 02:11

కొన్ని ఆలోచనలు, ఇంకొన్ని సూచనలు, మరికొన్ని దృక్పథాలు... వెరసి నాయకత్వ ప్రతిభ. ఈ ప్రతిభకు అక్షర దర్పణం భగవద్గీత. ముఖ్యంగా సమకాలీన నాయకత్వానికి కావలసిన లక్షణ తరంగాలపైన మనం ప్రయాణించగలిగితే కృష్ణోపదేశంలో అంతర్లీనంగా వలసినంత నాయకత్వ చైతన్యం మనల్ని తడుపుతుంది. మోడర్న్ డే లీడర్‌కి కావలసిన ‘మేనేజిరియల్ కాన్షియస్‌నెస్’ గీత నిండా పరచుకుని కనిపిస్తుంది.

05/14/2017 - 19:06

భగవద్గీత అంటే మేనేజ్‌మెంట్ సైన్స్. ఇది ఫిలాసఫీ క్లాస్‌లా అనిపించే సైన్స్ ల్యాబ్. ప్రయోగ ఫలితం రియలైజేషన్ అండ్ ఎనలైటెన్‌మెంట్. ఇదంతా సరికొత్త జీవితానికి సరియైన రీతిన సంసిద్ధం కావటానికే!!

04/22/2017 - 23:24

నవ జీవితం ఎన్ని కొత్త పుంతలు తొక్కుతున్నా, ఎంతలా ఆధునికత్వాన్ని వొడిసి పట్టుకుంటున్నా అర్థవంతమైన పాఠాలు నేర్చుకోవటానికి సంసిద్ధమయ్యే ఉంటుంది. ఆ సంసిద్ధతకు ఏ మత గ్రంథమైనా ఒక్కటే.. విలువలను అందించే సిద్ధాంతాలు ఆ విశ్వ రచనల నుండి వెలికి రావాలి. ఈ బాటలో భగవద్గీతకు తొలి తాంబూలం లభిస్తూనే ఉంది.

04/17/2017 - 01:12

సేవ, సహృదయతలే నిజమైన నాయకత్వ లక్షణాలు. సేవాతత్పరత నెలకొన్న చోట నాయకత్వం నిలదొక్కుకుంటుంది. అంటే స్వార్థం లేని చోటనే సర్వెంట్ లీడర్‌షిప్ సాధ్యవౌతుంది. అసలు ఇంకొకరికి సేవ చేయటం చిన్నతనంగా భావించే వ్యక్తిత్వంలో అసలైన నాయకత్వం కాగడా పట్టి వెతికినా కనిపించదు. సన్యాసులు, తపోధనులు సర్వస్వాన్ని త్యజించి తమ లక్ష్యం వైపుగా మగ్నమై ఉంటారు.

Pages