S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినదగు!

03/13/2016 - 09:20

‘యేప్యన్య దేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః
తేపి మామేవ కౌంతేయ యజంత్య విధి పూర్వకమ్’
అవును, అవిధిపూర్వక పూజలు అజ్ఞాన ప్రతీకలే! మనం అజ్ఞానానికి ప్రతిబింబాలమైతే ఎలా?! భక్తియోగం అజ్ఞాన యోగం కాకూడదుగా! నిజానికి భక్తి యోగానికి జ్ఞానయోగం జతపడటమే మన గిక జీవితం కర్మయోగంగా రాణించటం. అందుకే భగవద్గీత అంటే ‘జ్ఞానగీత’నే!

03/05/2016 - 21:01

పరమాత్మ అంశనే జీవాత్మ.
విత్తు జీవాత్మ అయితే చెట్టు పరమాత్మ!
విత్తు ముందా? చెట్టు ముందా? అంటే జీవాత్మ నుండి పరమాత్మనా? పరమాత్మ నుండి జీవాత్మనా? అన్న ప్రశ్న వేధిస్తుంది. నిజానికి ఈ వేదన జీవాత్మది.. వేదన లేనిది పరమాత్మ.

02/28/2016 - 17:21

నేను, ఈ ప్రపంచం, నా చేతలు, ఈ ప్రకృతి - ఒక అద్వైత అస్తిత్వం. పైకి ద్వైతంగా అనిపించే అంటే బహుముఖీనమైన అద్వైత తాత్వికత ఈ దివ్యత్వానిది. ఒక్కటే అయిన దివ్యత్వం అనేక తెరగుల మనల్ని కమ్మేయటానికి కారణం మనం ‘అహం’-కరించటమే! మన మనసు చేసే జిమ్మిక్కులన్నీ ఇహానికి చెందిన ఒక అహంలోంచి పుట్టుకొచ్చినవే!

02/14/2016 - 18:39

అనుమానం అసంపూర్ణ పరిణామం.. శంకా రాహిత్యమే పరిపూర్ణత్వం. ఎంతలా ఆధ్యాత్మిక సంపన్నులమైనా, ఎంతలా వరప్రసాదితులమైనా అనుమానం మనల్ని నిర్వీర్యుల్ని చేస్తుంటుంది. అయితే ఇది తెలుసుకోలేక అనుమానాన్ని కూడా ఒక ‘మాయ’కే చేరుస్తుంటారు ఆధ్యాత్మికులు. కానీ ఈ అనుమానాన్ని మాయగా భ్రమించక, అనుమాన తెరలు వీడటమే అసలైన ఆధ్యాత్మికత్వం.. ఆత్మతత్వం. అదే సక్సెస్‌కు, స్పిరిట్యుయాలిటీకి తొలి సోపానం.

02/08/2016 - 08:51

ఆత్మ అజం, అవ్యయం అంటే పుట్టుక, క్షయం లేనిది.
‘వేదా వినాశినం నిత్యం య ఏన మజమవ్యయమ్
కథం స పురుషః పార్థ కం ఘాతయతి సంతి కమ్’

01/23/2016 - 18:10

మనమే గుర్తించని రీతిన మనం తప్పిపోతున్నాం.. మనకు మనంగా మిగలలేక పోతున్నాం. కారణం మనది ఇంద్రియభోగం.. ప్రాపంచిక లాలసత... వస్తు సంపదతో విర్రవీగుతూ ‘ఆత్మ’ సంపన్నతను పట్టించుకోవటం లేదు. భౌతిక సుఖాలు, భౌతిక ఆర్భాటాలు, భౌతిక ఆచ్ఛాదనలు, భౌతిక పలవరింతలు, భౌతిక తాపత్రయాలు - ఇంతేనా భోగ జీవితం.. ఇంతేనా సుఖ సంసారం.

01/14/2016 - 18:20

‘ఉద్ధరేదాత్మ నాత్మానం నాత్మాన మవసాదయేత్’ అంటుంది భగవద్గీత. ఉద్ధరేత్ ఆత్మనా ఆత్మానం - అంటే మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి అని. ఇదీ మన మానవ జన్మ రహస్యం. మనల్ని ఉద్ధరించుకోవటానికి మరొకరి సాయం అవసరమా అంటే అవసరం లేదు అని అంటుంది గీత. ఉద్ధరణ కార్యక్రమంలో మనకు మనమే మిత్రులం! ఉద్ధరించుకోలేకపోతే మనకు మనమే శత్రువులం - ఇదీ మరణ రహస్యం. నిజానికి దేహం తనను తాను ఉద్ధరించుకోలేదు.. కారణం డెపెండెంట్ కాబట్టి.

01/09/2016 - 18:04

‘అంతవంత ఇమే దేహా నిత్య స్యోక్తాః శరీరిణః
అనాశినో మేయస్య తస్మా దుధ్యస్వ భారత’ (2-18)

01/02/2016 - 18:01

‘దేహినో స్మిన్ యథాదేహే కౌమారం వనం జరా
తథా దేహాంతర ప్రాప్తిః ర్థీర స్తత్ర న మహ్యతి’ (2-13)

12/27/2015 - 04:26

దైన్యం దేహానిదే కానీ ఆత్మస్వభావానిది కాదు. కార్పణ్యం దోషమే కాబట్టి ఆ కార్పణ్య స్వభావం మనల్ని మూఢుల్ని చేస్తుంటుంది. మనం మూర్ఖశిఖామణులం అవుతుంటాం. అసలు మానసిక ప్రసన్నత మాత్రమే ప్రశాంతమయ జీవితాన్ని అందించగలదు. అది సాధ్యం కానప్పుడు మిగిలేది శోక జీవనమే. నిజానికి శోక స్థితి కూడా ఇంద్రియాతీతమైన ఆత్మస్థితి కాదు. అది ఇంద్రియ శోషనే. కాబట్టి అర్జునుడు శాంతిస్తే తప్ప ఇంద్రియాలు క్షోభించటం మానవు.

Pages