S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/22/2018 - 23:42

నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 22: ఎన్నికల నిర్వహణ కోసం వినియోగించే ఈవీఏంలపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, అనేక విధాలుగా రక్షణ చర్యలు తీసుకున్న తరువాతనే పోలింగ్ రోజున ఉపయోగించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఇ.శ్రీ్ధర్ అన్నారు.

09/22/2018 - 23:41

చికాగోలో జరుగుతున్న లెవర్ కప్ టెన్నిస్ టోర్నమెంట్ డబుల్స్ విభాగంలో జోడీకట్టి, అనూహ్యంగా
పరాజయాన్ని ఎదుర్కొన్న ప్రపంచ మేటి ఆటగాళ్లు రోజర్ ఫెదరర్, నొవాక్ జొకోవిచ్.
యూరోప్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన వీరిపై వరల్డ్ టీంకు ప్రాతినిథ్యం వహిస్తున్న జాక్ సాక్, కెవిన్ ఆండర్సన్ జోడీ 6-7, 3-6, 10-6 తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసింది.

09/22/2018 - 23:40

జడ్చర్లరూరల్, సెప్టెంబర్ 22: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శనివారం సబ్ రిజిస్ట్రార్‌కు అశోక్ కుమార్, బాలానగర్ తెరాస జడ్పీటీసీ ప్రభాకర్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీశైలం యాదవ్‌ల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ చిలికి చిలికి గాలివానగా మారి ఇరువురి మధ్య అసభ్య పమదజాలంతో తీవ్ర దూషణలకు దారి తీసింది.

09/22/2018 - 23:39

దుబాయ్, సెప్టెంబర్ 22: ఆసియా కప్‌లో ఫేవరిట్‌గా బరిలోకి దిగిన టీమిండియా మంచి ఊపుమీద ఉంది. ఇప్పటికే ఆడిన గ్రూప్ మ్యాచ్‌లలో మూడింట్లో విజయం సాధించిన భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆదివారం జరిగే మ్యాచ్‌లో ఫేవరిట్ ముద్రతో తలపడనుంది. అయితే, ఈ మ్యాచ్‌ను టీమిండియా అంత ఈజీగా తీసుకోవడంలేదు. ప్రత్యర్థి టీమ్ కూడా బలంగా ఉండడంతో ఆచితూచి ఆడేందుకు భారత్ ప్రాధాన్యత ఇవ్వవచ్చు.

09/22/2018 - 23:38

చాంగ్జూ, సెప్టెంబర్ 22: చైనా ఓపెన్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో మాజీ ప్రపంచ నంబర్ వన్, ప్రస్తుత ఐదో ర్యాంక్ క్రీడాకారిణి కరోలినా మారిన్ మహిళల సింగిల్స్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీ ఫైనల్‌లో ఆమె జపాన్‌కు చెందిన నజోమీ ఒకుహరాను 15-21, 21-12, 21-13 తేడాతో ఓడించింది.

09/22/2018 - 23:38

గద్వాల, సెప్టెంబర్ 22: ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యం అందించే విధంగా ప్రభుత్వ వైద్యులు చర్యలు తీసుకోవాలని, రోగులను ప్రైవేటు ఆసుపత్రికి పంపకుండా వైద్యం అందించేందుకు కృషి చేయాలని గద్వాల ఏరియా ఆసుపత్రి డాక్టర్లను జిల్లా కలెక్టర్ కె.శశాంక ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

09/22/2018 - 23:36

దుబాయ్, సెప్టెంబర్ 22: ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆదివారం జరిగే మరో గ్రూప్ మ్యాచ్‌కి సిద్ధంగా ఉన్నామని, ఈ పోరులో విజయం తమదేనని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ధీమా వ్యక్తం చేశాడు. పాక్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌ని ఎనిమిది వికెట్ల తేడాతో భారత్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

09/22/2018 - 23:36

అమరచింత, సెప్టెంబర్ 22: సకాలంలో వర్షాలు పడక వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడి చేతికి వస్తుందో లేదోనని ఆందోళనతో తన పొలంలో రైతు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం మండల పరిధిలోని పాంరెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి అమరచింత ఎస్సై బి రామస్వామి తెలిపిన వివారాలు ఇలా ఉన్నాయి. పాంరెడ్డిపల్లికి చెందిన దేవర్ల ఆంజనేయులు (51) తనకున్న 4 ఎకరాల్లో కంది సాగు చేశాడు.

09/22/2018 - 23:35

కౌలాలంపూర్, సెప్టెంబర్ 22: లెజెండరీ బాడ్మింటన్ స్టార్ లీ చాంగ్ వెయ్ కేన్సర్‌తో బాధపడుతున్నాడు. ముక్కుకు సంబంధించిన కేన్సర్ అతనికి ప్రాథమిక దశలో ఉందని మలేసియా బాడ్మింటన్ సంఘం (బీఏఎం) ఒక ప్రకటనలో తెలిపింది. అతనికి తైవాన్‌లో చికిత్స జరుగుతున్నట్టు వివరించింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు కూడా ఆసుపత్రి వద్ద ఉన్నట్టు బీఏఎం అధ్యక్షుడు దతుక్ సెరి నొర్జా జకారియా తెలిపాడు.

09/22/2018 - 23:34

కొలంబో, సెప్టెంబర్ 22: శ్రీలంకతో ఇక్కడ శనివారం జరిగిన టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో భారత మహిళా జట్టు ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. భారత జట్టులోని యువ బ్యాట్స్‌ఉమన్ జమీమా రోడ్రిగ్స్ 40 బంతులు ఎదుర్కొని 57 పరుగులు చేసి జట్టును గెలిపించే కీలక బాధ్యతలను స్వీకరించింది.

Pages