S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగత్‌సింగ్

09/24/2016 - 22:50

హుతాత్ముడవటానికి ముందు రోజు భగత్‌సింగ్ తన సెల్‌లో ఏదో పుస్తకం చదువుకుంటూండగా బయటి నుంచి ఎవరో ‘సర్దార్జీ’ అని మెల్లిగా పిలిచారు. లేచి తలుపు దగ్గరికి వెళితే ‘మీకో సందేశం తెచ్చాను. జవాబివ్వండి’ అన్నాడొకడు రహస్యంగా.

09/20/2016 - 14:07

...........................
తెల్ల రాక్షసులు ఏమి చేశారు? ముగ్గురు జాతీయ వీరుల
శరీరాలను ముక్కలు చేసి, గోనెసంచుల్లో మూటలు
కట్టించారు! రాత్రి సద్దుమణిగాక తమ జైలు వెనక గోడలో
కొంత భాగాన్ని తామే దొంగల్లా బద్దలు కొట్టించారు.
ఆ సందులో నుంచి ఒక ట్రక్కును లోపలికి తెప్పించారు.
గోనెసంచులను అందులో వేసుకుని దొంగల్లా పారిపోయి,

09/10/2016 - 23:22

ఒప్పందం వల్ల ఎదురవుతున్న చిక్కుల గురించి ఈ సాయంత్రం నేను మిస్టర్ గాంధితో మూడు గంటలు మాట్లాడాను...
... ... ...

09/03/2016 - 22:02

Sir Herbert Emerson, the Home Member who was called upon to play a prominent role in Delhi negotitions records listening with amazement to Irwin and Gandhi after agreement had been reached by them that Bhagat Singh must be executed, engaged in a prolonged discussion not as between two statesmen but as between two saints on the sanctity of human life.
[Viscount Halifax: A Biography,

08/27/2016 - 23:05

వైస్రాయ్ లార్డ్ ఇర్విన్‌తో మహాత్మాగాంధి మంతనాలు 1931 ఫిబ్రవరి 17న మొదలై మార్చి 5న ముగిశాయి. ఇరువురూ 8సార్లు సమావేశమై మొత్తం మీద 24 గంటలపాటు రహస్యంగా చర్చించారు. మార్చి 4 అర్ధరాత్రి దాటాక చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. అందులోని ముఖ్యాంశాలివి:
1.శాసనోల్లంఘన ఉద్యమాన్ని నిలిపివేయాలి.

08/27/2016 - 23:04

భగవతీ చరణ్ ఆకస్మిక దుర్మరణంతో విప్లవకారులందరి మనసులూ వికలమయ్యాయి. దుర్గాదేవి జుట్టు విరబోసుకుని ధ్యాన సమాధిలో ఉన్నట్టు నిశ్చలంగా కూర్చుండిపోయింది. భర్తృ వియోగపు చిచ్చు మనసును దహిస్తున్నా పైకి ప్రశాంతంగా ఉంది. ఆమె పక్కనే కన్నీరు కారుస్తూ సుశీలాదేవి కూర్చుంది. పక్క గదిలో సేనాపతి చంద్రశేఖర్ ఆజాద్ నిస్త్రాణతో గోడకు చేరగిలబడ్డాడు.

08/20/2016 - 22:42

అన్ని దారులూ మూసుకుపోయాయి. మిగిలింది ఒకే ఒక ఆశ.
ప్రివీ కౌన్సిల్ కూడా కుదరదు పొమ్మన్నాక భగత్‌సింగ్, మరి ఇద్దరి ఉరిని ఆపడం ఒక్క వైస్రాయి చేతుల్లోనే ఉంది. ఆయన ఆ పని ససేమిరా చెయ్యడు. దేశమంతటి నుంచి ఎంత మంది ఎన్ని విన్నపాలు పంపినా, ఎవరు ఎంతగా నచ్చచెప్పినా కనికరించడు. అంత మొండి వైస్రాయిని కూడా తలచుకుంటే మెడలు వంచి, పట్టుబట్టి ఒప్పించగలిగినవాడు యావద్భారతంలో ఒకే ఒక్కడు:
మహాత్మాగాంధి!

08/14/2016 - 09:06

పరాధీన భారతంలో స్వాతంత్య్ర యోధుల మీద కుట్ర కేసులు చాలా పెట్టారు. 1930 నాటి లాహోర్ కుట్ర కేసు అన్నిటిలోకెల్లా అధమాధమమైనది. మామూలుగా అయితే విచారణనుబట్టి శిక్ష. ఈ కేసులో ముందే నిర్ణయమైన శిక్షకు కావలసిన విధంగా విచారణ! నిందితులు లేకుండా కేసు విచారణ, కోర్టు హాల్లో నిందితులపై దారుణహింస, పెరేడ్‌లో గుర్తుపట్టటానికి వీలుగా దొంగ సాక్షులకు నిందితులను ముందే చూపించటం వంటి అక్రమాలకు లెక్కలేదు.

07/30/2016 - 22:56

తెల్లదొర తెల్లబోయాడు.

07/24/2016 - 02:21

మండే ఎండల మే నెల. లాహోర్‌లోని పూంచ్ హౌస్‌లో 5వ తేదీన ప్రత్యేక ట్రిబ్యునల్ విచారణ మొదలయ్యే నాటికి ఉష్ణోగ్రత 106 డిగ్రీల ఫారన్‌హీట్ దాటింది. కోర్టు హాల్‌లో బయటి జనం పలచగా ఉన్నారు. కారణం - ఎండ తీవ్రత కాదు... అటుకేసి వెళ్లిన వారినల్లా పోలీసులు సతాయిస్తారన్న భయం!

Pages