S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగత్‌సింగ్

07/17/2016 - 00:03

‘పత్రికల్లో ఈ కేసు విచారణకు సంబంధించిన వార్తలను చదువుతూంటే నాకు కంపరం పుడుతున్నది. మేజిస్ట్రేటుకూ, నిందితులకూ నడుమ వాగ్వాదాల్లో పత్రికలు పూర్తిగా నిందితులనే సమర్థిస్తూ వార్తలు రాస్తున్నాయి. అవి చదివితే తప్పంతా మేజిస్ట్రేటుదే అయినట్టూ, నిందితులు అతణ్ని భలే బాగా నిలదీసినట్టు జనాలకు అభిప్రాయం కలుగుతుంది.

07/09/2016 - 22:11

ఆ రోజు 1929 అక్టోబర్ 21. అప్రూవర్‌గా మారిన జైగోపాల్ కోర్టులో సాక్ష్యం ఇవ్వవలసి ఉంది. అతగాడు విట్నెస్ బాక్సు ఎక్కుతూనే పొగరుగా మీసం మెలివేశాడు. సాక్ష్యం మొదలుపెడుతూనే భగత్‌సింగ్‌నూ, అతడి సహచరులనూ దుర్భాషలాడసాగాడు. చూస్తున్న జనం సిగ్గు సిగ్గు అని అరిచారు.

07/02/2016 - 22:38

తిరుగుబాట్లు, ధిక్కారాలు తెల్లదొరలకు కొత్తకావు. కుట్రలు, కుతంత్రాలతో మాయచేసి భారతదేశాన్ని ఆక్రమించినది మొదలుకుని ఎందరో దేశభక్తులు వారికి ఎదురు తిరుగుతూనే ఉన్నారు. దొరికిన వారిని దొరికినట్టు కారాగారాల్లో బంధించి, చిత్రహింసలు పెట్టి, తప్పుడు కేసులు మోపి ఉరికంబాలెక్కించి అవిధేయతను విదేశీ రాకాసులు యధేచ్ఛగా అణచివేస్తూనే ఉన్నారు.

06/26/2016 - 06:03

భగత్‌సింగ్ సాగిస్తున్న ఆకలి సమ్మెలో నెల తరవాత మిగతా సహచరులూ చేరాలని తొందరపడినప్పుడు వద్దని వారించినవాడు ఒకే ఒక్కడు:
యతీంద్రనాథ్ దాస్.
నిరాహారదీక్షను ఒకసారి మొదలెట్టాక కడ ఊపిరిదాకా కఠోరంగా కొనసాగించి, యావద్భారతానికీ ఆరాధ్యుడైన అమరుడు కూడా యతీన్‌దాసే.

06/18/2016 - 23:39

‘ఈ రోజు కోర్టులో భగత్‌సింగ్, బటుకేశ్వర్ దత్‌లు ఇద్దరూ చాలా బలహీనంగా కనిపించారు. నిన్న సాయంత్రం వీరికి బలవంతంగా ఆహారం ఎక్కించడానికి ఎనిమిదేసి పఠాన్లను నియోగించారని తెలిసింది. పఠాన్లు వారిని బలవంతంగా నేల మీద పడేసి కాళ్లు, చేతులు, ఛాతి, గొంతు నేలకు అదిమిపెట్టగా.. ముక్కులోంచి, గొంతులోంచి రబ్బరు ట్యూబు ద్వారా పాలు ఎక్కించారట. పఠాన్ల చేతిలో ఖైదీలిద్దరూ బాగా దెబ్బలు తిన్నారు.

06/11/2016 - 23:49

జైళ్లు, సంకెళ్లు విప్లవకారులను కట్టివేయలేవు. నాలుగు గోడల నడుమ బలవంతంగా బంధిస్తే ఆ బంధనాలలోనే వారు పోరాటానికి దారి వెతుక్కుంటారు. చేతిలో ఆయుధం ఉన్నంతవరకూ విప్లవకారుడు ఆయుధంతో పోరాడుతాడు. అది లేనప్పుడు ఆకలినే ఆయుధంగా మలచుకుంటాడు.

06/05/2016 - 00:58

అంతా విన్నాక ఒక అనుమానం సహజం.
అంత తెలివిగల భగత్‌సింగ్ ఇంత తేలికగా పోలీసుల చేతికి చిక్కాడేమిటి? నాలుగు నెలలకు పైగా శక్తియుక్తులు అన్నీ వెచ్చించి, బుర్ర ఎంత బద్దలు కొట్టుకున్నా సాండర్స్‌ని ఎవరు చంపిందీ కనుక్కోలేకపోయిన బ్రిటిషు సర్కారుకు - ఆ పని చేసింది నేనేనహో అని తనకు తానే అంత తెలివితక్కువగా తెలియపరచాడు. ఎందువల్ల?

06/05/2016 - 00:56

పార్లమెంటులో బాంబులేయటం దారుణం, దుస్సాహసం, నిష్కృతిలేని నేరం - అని మండిపడ్డ పెద్ద మనుషులు ఆ నేరగాళ్లకు న్యాయస్థానం యావజ్జీవ ఖైదు విధించిందని తెలిస్తే మామూలుగా అయితే సంతోషించాలి.

05/21/2016 - 22:59

సాధారణంగా కోర్టులో ముందు విచారణ... తరువాత తీర్పు.
బ్రిటిషు అన్యాయ వ్యవస్థ తీరు వేరు. ముఖ్యంగా స్వాతంత్య్రయోధుల, విప్లవకారుల విషయంలో.

05/15/2016 - 00:26

పరాయి ప్రభుత్వానికి దిమ్మతిరిగేలా దేశవాసుల నిరసన ప్రకటించటానికి కదా భగత్ బృందం అన్నిటికీ తెగించి చట్టసభలో బాంబులు వేసింది? వారి తెగువను దేశం ఎలా చూసింది? దేశంలోని పెద్దలు, మేధావులు ఆ సాహసకృత్యానికి ఎలా స్పందించారు?
జాతీయ వీరులకు ఘన నీరాజనాలిచ్చే మాట దేవుడెరుగు. కనీసం ఒక మంచి మాటకే తెరువులేదు. చెయ్యకూడని పనిచేసి దేశానికి తలవంపులు తెచ్చారని తిట్టిపోసినవారే పెద్ద మనుషులు దాదాపు అందరూ.

Pages