S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగత్‌సింగ్

05/07/2016 - 23:29

1929 ఏప్రిల్ 8.
ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూసిన రోజు.

05/01/2016 - 03:02

ఏమి చేయాలన్నది తేలిపోయింది. అది ఎవరు చేయాలన్నదే ఇక తేల్చాల్సి ఉంది.
ఆ పని ఇద్దరికి అప్పగించాలి అన్నాడు భగత్‌సింగ్.
‘ఎవరిని చంపటమూ మన ఉద్దేశం కాదు. మనం వేసేది ఎవరికీ హాని చెయ్యని తేలిక రకం పొగబాంబు. దానికి ఇద్దరు కామ్రేడ్స్‌ని, రిస్కు చేయటమెందుకు? అదను చూసి బాంబు విసిరి పరిగెత్తడానికి ఒకరు సరిపోతారు కదా?’ - అని ఒకరి శంక.

04/23/2016 - 23:11

ఈ దారి ఎక్కడికి? ఎంత దూరం వచ్చాం? ఏమి సాధించాం?
ఇవి విప్లవకారుల మనసులను తొలుస్తున్న ప్రశ్నలు.

04/17/2016 - 03:25

ఓ రోజు ఆగ్రా ఇంట్లో అందరూ కూచుని సరదాగా మాట్లాడుకుంటున్నారు.
మీరు అరెస్టంటూ అయితేగియితే ఏ పరిస్థితుల్లో అవుతారు? దానికి ఎలా స్పందిస్తారు? అందరూ చెప్పండి - అన్నారెవరో.
ముందు రఘునాథ్ (రాజ్‌గురు మారుపేరు) మొదలెట్టాడు.

04/09/2016 - 22:37

రాంప్రసాద్ బిస్మిల్‌ని ఉరి నుంచి ఎలాగూ కాపాడలేకపోయాం. కనీసం యోగేశ్‌చంద్ర చటర్జీనైనా విడిపించగలగాలి. ఎప్పటినుంచో విప్లవకారుల కోరిక అది.
కాకోరీ కేసులో శిక్ష పడి యోగేశ్ ప్రస్తుతం ఆగ్రా జైలులో ఉన్నాడు. జైలుగోడలు బద్దలు కొట్టటం వారివల్ల కాదు. ఏదో ఒక సందర్భాన అతడిని జైలు బయటికి తెచ్చినప్పుడే ఏదైనా చేయగలగాలి. ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది.

04/03/2016 - 09:05

ఒకప్పుడు ఈస్టిండియా కంపెనీ హయాంలో కోల్‌కతా హిందూ దేశానికి రాజధాని. రాజకీయ కేంద్రం న్యూఢిల్లీకి మారాక కూడా ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక జీవనానికి ఆ నగరమే జీవనాడిగా ఉండేది. మహా ప్రాసాదాలాంటి భవనాలు, అందమైన తోటలు, కళకూ సృజనకూ ఆలవాలమైన సాంస్కృతిక విభావరులు, మేధోమథనాలకు పెట్టింది పేరైన నవచైతన్య కేంద్రాలు కోల్‌కతాకు సహజాభరణాలు.

03/26/2016 - 21:58

భగత్‌కి దుర్గ్భాభీ ముందు నుంచీ తెలుసు.

03/20/2016 - 00:03

కాసేపట్లో హత్యాస్థలమంతా పోలీసులతో నిండిపోయింది. హంతకులు డి.ఎ.వి. కాంపౌండులోకి పారిపోయారని తెలిశాక పోలీసులు ఆ ప్రాంగణాన్ని చుట్టుముట్టారు. కాలేజి, హాస్టళ్లలో కనిపించిన వారినల్లా నిగ్గదీశారు. రిజిస్టర్లు తెప్పించి హాస్టల్‌వాసుల అటెండెన్సు తీసుకున్నారు. ఎవరైనా లేకపోతే వారు ఎవరు, ఎక్కడికి పోయారు, ఎవరితో వెళ్లారు అని ఆరాలు తీశారు. ఆ పక్కన ఉన్న డి.ఎ.వి.

03/13/2016 - 09:00

దేశ ప్రజలు ప్రేమించే అంత పెద్దాయన ఒంటిమీద చేయి వేసేంత దుర్మార్గానికి ఆ నీచులు తెగబడ్డారని తలచుకుంటేనే నాకు కంపరమెత్తుతోంది. దేశంలో మగటిమిగల యువకులు లేరా? ఈ సిగ్గు, అవమానం వారిని దహించటం లేదా?

03/05/2016 - 21:12

ఒక తప్పును ఇంకో తప్పు సరిచేసింది.
గాంధీగారి చలవవల్ల చౌరీచౌరాలో చతికిలపడిన జాతీయోద్యమం ఐదేళ్ల తరవాత తెల్లదొరల తొందర మూలంగా పుంజుకుని మళ్లీ దారిన పడింది.

Pages